Upasana : నానమ్మ, అత్తమ్మ మధ్యలో ఆవకాయ పచ్చడి.. ఉపాసన ఫన్నీ వీడియో వైరల్..!!

హీరో రామ్ చరణ్ సతీమణి ఉపాసన తాజాగా ఓ ఫన్నీ వీడియోను షేర్ చేశారు. ఇందులో చిరంజీవి సతీమణి సురేఖ ఆవకాయ కలుపుతూ కనిపించారు. చిరంజీవి తల్లి అంజనాదేవి, ఉపాసన మధ్య జరిగిన సంభాషణ చాలా సరదాగా అనిపించింది. ఈ ఫన్నీ వీడియోను మీరూ చూసేయ్యండి.

New Update
Upasana : నానమ్మ, అత్తమ్మ మధ్యలో ఆవకాయ పచ్చడి.. ఉపాసన ఫన్నీ వీడియో వైరల్..!!

Upasana Funny Video : మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) సతీమణి సురేఖ(Surekha) ఈమధ్యే వ్యాపార రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అత్తమ్మాస్ కిచెన్(Atthamma's Kitchen) పేరుతో ఫుడ్ బిజినెస్ షురూ చేసింది. అప్పటికప్పుడు తయారు చేసే విధంగా మనకు నచ్చే రుచికరమైన నాణ్యమైన డ్రై హోమ్ ఫుడ్స్ ను అందించే లక్ష్యంతో ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టినట్లు తెలిపింది. తాజాగా అత్తమ్మాస్ కిచెన్ కోసం సురేఖ మామికాయ పచ్చళ్లు పెట్టిన వీడియో ఒకటి సోషల్ మీడియా(Social Media) లో వైరల్ గామారింది. ఈ వీడియోను ఉపాసన సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్ట వైరల్ అవుతోంది. చిరంజీవి తల్లి అంజనాదేవి పర్యవేక్షణలో సురేఖ పచ్చడి కలుపుతోంది. అంచానదేవిని ఉద్దేశించి ఉపాసన(Upasana) నానమ్మా.. మీ కోడలుకు పచ్చళ్లు సరిగ్గా పెట్టడం రాదా.. అందుకే కోపంగా ఉన్నారా అంటూ అడిగింది. అలా ఏమీ లేదని.. నువ్వు ఉన్నావుగా ఆమెకు కోడలిగా అంటూ అంజనాదేవి నవ్వుతూ బదులు ఇచ్చారు. లివింగ్ రూమ్ కిచెన్ గా మారితే ఇలా ఉంటుందని అంజనాదేవి పర్యవేక్షణలో కొత్త అవకాయ రెడీ చేస్తున్నాం.. మీరు కూడా అత్తమ్మాస్ కిచెన్ అవకాయ్ రుచి చూడాలనుకుంటున్నారా అని ఉపాసన వీడియోలో పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి:  కాంగ్రెస్‌లోకి మరో బీఆర్ఎస్ కీలక నేత.. క్లారిటీ!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Aghori - Sri Varshini Love: ఓరి మీ దుంపల్‌తెగ ఆపండ్రోయ్.. అఘోరీ కోసం వర్షిణీ లవ్ సాంగ్- వీడియో

శ్రీవర్షిణి కొన్ని పాటలను లేడీ అఘోరీకి డెడికేట్ చేసింది. మళ్లీ తాను అఘోరీ చెంతకు చేరుకున్న ఆనందంలో పాటలు పాడింది. మెల్లగ కరగనీ రెండు మనసుల దూరం అంటూ ప్రభాస్ వర్షం మూవీలోని సాంగ్‌ను పాడి అఘోరీకి డెడికేట్ చేసింది. ప్రస్తుతం అది వైరల్‌గా మారింది.

New Update

అఘోరీ - శ్రీవర్షిణీ ఎపిసోడ్ మరింత హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటి వరకు ఓ రేంజ్‌లో నడిచిన వీరి కథ.. ఇప్పుడు మరో మలుపు తిరిగింది. వీరిద్దరూ వీరి నాలుగు నెలల ప్రేమ బంధానికి గుర్తుగా పెళ్లి చేసుకున్నారు. అయితే అది ఒకసారి కాకపోవడం గమనార్హం. వేరు వేరు ప్రాంతాల్లో రెండు సార్లు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. మొదటి సారి విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కుటుంబ సభ్యుల మధ్య వర్షిణీని అఘోరీ బంగారు చైన్‌ వేసి పెళ్లాడింది. ఈ విషయాలన్నీ స్వయంగా వర్షిణీనే బయటపెట్టింది. 

Also Read: మహేష్ హీరోయిన్ పై కన్నేసిన బన్నీ..!

అంతేకాకుండా ఇటీవలే గుజరాత్ నుంచి వచ్చి ఫ్యామిలీ దగ్గర ఉన్న వర్షిణీ ఇప్పుడు మళ్లీ అఘోరీ చెంతకు చేరుకుంది. తమను ఎవరూ విడదీయలేరని అంటోంది. తమ ప్రేమకు గుర్తుగా పెళ్లి కూడా చేసుకున్నామని చెబుతోంది. అఘోరీలో జెన్యుటీని చూసి ఇష్టపడ్డానని అంటోంది. అఘోరీతో సె**క్స్‌ను తాను కోరుకోలేదని.. సె**క్స్ కోరికలు తనకు లేవని తెలిపింది. ఇందులో భాగంగానే RTV ఛానెల్‌తో ఇచ్చిన లైవ్ ఇంటర్వ్యూలో అఘోరీపై ప్రేమను కురిపించింది. 

Also Read: కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ బ్రాండ్ న్యూ కార్ అదుర్స్..!

అఘోరీ కోసం స్పెషల్ సాంగ్ 

అఘోరీ అంటే తనకు ఎంత ఇష్టం..? ఎందుకు ఇష్టమో తెలిపింది. అంతేకాదండోయ్.. అఘోరీ కోసం ఏకంగా ప్రభాస్, పవన్ కళ్యాణ్ పాటలను డెడికేట్ చేసింది. అఘోరీ - వర్షిణీ ఇద్దరూ కారులో ఉండి లైవ్ ఇచ్చారు. అందులో అఘోరీ కోసం వర్షిణీ కొన్ని పాటలు పాడింది. పవన్ కళ్యాణ్ ‘అత్తారింటికి దారేది’ మూవీలోని వీడు ఆరడుగుల బుల్లెట్టు అంటూ ఓ సాంగ్ పాడింది. ఆ తర్వాత.. ప్రభాస్ ‘వర్షం’ మూవీలోని మెల్లగా కరగనీ రెండు మనసుల దూరం అంటూ ఓ సాంగ్ పాడింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. 

Chiranjeevi: డ్యాన్స్ చేస్తూ కళ్ళు తిరిగి పడిపోయిన చిరంజీవి..!

(aghori | lady aghori sri varshini relation | sri varshini | Aghori Sri Varshini Lov | aghori sri varshini | latest-telugu-news | telugu-news)

Also Read: 'మంగపతి' గెటప్‌లో శివాజీ స్పెషల్ వీడియో వైరల్

Advertisment
Advertisment
Advertisment