/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-2024-01-29T211609.550-jpg.webp)
Unnatural sex: భార్యతో అసహజమైన శారీరక సుఖాన్ని పొందాలని తపనపడిన భర్తకు ఓ మహిళా ఊహించని షాక్ ఇచ్చింది. కామవాంఛతో రగిలిపోతున్న భర్తను జీవితాంతం శృంగారానికి దూరం చేయాలని చూసింది. మితిమిరిన శృంగారం కోసం అతను పట్టుబట్టడంతో విసిగిపోయింది. దీంతో అతని ప్రైవేట్ పార్ట్‌ను పళ్లతో కొరికేసిన భయంకరమైన సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్ జిల్లా సదర్ కొత్వాలి ప్రాంతంలో చోటుచేసుకుంది.
हमीरपुर - पत्नी ने पति का गुप्तांग मुंह से काटा
➡अप्राकृतिक यौन संबंध से परेशान थी पत्नी
➡गंभीर हालत में युवक कानपुर रेफर किया गया
➡सदर कोतवाली इलाके के टिकरौली का मामला.#Hamirpur pic.twitter.com/bpTv8NexzR— भारत समाचार | Bharat Samachar (@bstvlive) January 29, 2024
అసహజ సంభోగం..
ఈ మేరకు కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తిక్రౌలి గ్రామంలో శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది. 34 ఏళ్ల భర్త రాము నిషాద్ అసహజ సంభోగానికి పాల్పడ్డాడని భార్య భర్తపై ఆరోపణలు చేసింది. జనవరి 28 రాత్రి తనను బాగా విసిగించడంతో భార్య పురుషాంగాన్ని పళ్లతో గట్టిగా కొరికేసినట్లు తెలిపింది. దీంతో భర్త జననాంగాలు రక్తసిక్తమవడంతో.. గట్టిగా అరుపులందుకున్నాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన పిల్లలు సంఘటనా స్థలానికి చేరుకుని, మహిళ దవడను నొక్కి దాన్ని వేరు చేశారు. అనంతరం అర్థరాత్రి ఆస్పత్రికి తరలించారు.
ఇది కూడా చదవండి : Digital Health Profile Card: అందరికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డు…సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..!!
పరిస్థితి విషమం..
అయితే మొదట సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లగా అతని పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యకోసం మరొక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. ఇక భారతీయ శిక్షాస్మృతి (IPC)లోని సెక్షన్ 326 కింద భర్తను గాయపరిచినందుకు, బెదిరింపులకు పాల్పడినందుకు సెక్షన్ 506 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికారి అనూప్ సింగ్ తెలిపారు.