పోస్ట్‌మార్టం సమయంలో.. బాలిక బతకడంతో షాక్ అయిన డాక్టర్లు..! సాధారణంగా కొన్ని సంఘటనలు జరిగినప్పుడు ఆ పరిస్థితులను మనం తట్టుకోలేని పరిస్ధితి ఏర్పడుతుంది. ఆ పరిస్థితుల నుండి బయటపడేందుకు ట్రైం చేస్తాం. అయితే వాటిలో కొన్ని మంచి ఫలితాలను ఇస్తాయి. అలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. ఓ బాలిక కాలువలో పడి చనిపోయింది. చనిపోయిందనుకున్న బాలికను తల్లిదండ్రుల కోరిక మేరకు ఆస్పత్రికి తరలించారు. అక్కడే పోస్టుమార్టం చేస్తున్న సమయంలో వైద్యులు చెక్ చేస్తుండగా ఆ అమ్మాయి గుండె కొట్టుకోవడంతో డాక్టర్లు ఆశ్యర్యపోయారు. By Shareef Pasha 22 Jun 2023 in క్రైం నేషనల్ New Update షేర్ చేయండి కొన్ని సందర్భాల్లో ఊహించని సంఘటనలు జరుగుతాయి. వాటి ద్వారా మనకు తీవ్ర మనస్థాపం కలుగుతుంది. ఆ పరిస్థితిని జీర్ణించుకోలేకపోతాం. ఆ బాధనుండి బయట పడడానికి నానా ప్రయత్నాలు చేస్తాం. ఒక్కోసారి అలా చేసే ప్రయత్నాలు ఫలితం లేదని తెలిసినా కూడా చేసి తీరుతాం. ఒక్కోసారి మన కళ్లను మనం నమ్మలేని పరిస్థితి కూడా ఎదురవుతుంది. అలాంటిదే ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఓ బాలిక నీటిలోపడి చనిపోయింది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం సమయంలో వైద్యులు చెక్ చేస్తుండగా ఆ అమ్మాయి గుండె కొట్టుకోవడంతో.. డాక్టర్లు ఆశ్యర్యపోయారు. సరైన ట్రీట్‌మెంట్ ఇచ్చి బాలికను ఇంటికి పంపించారు. ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌లో ఓ బాలిక కాలువలో పడి చనిపోయింది. నీళ్లలో పడి బాగా నీళ్లు మింగి బాలిక చనిపోయిందని అందరూ అనుకున్నారు. పోలీసులు కూడా ఘటనా స్థలానికి వచ్చి కేసు దర్యాప్తు చేశారు. బాలిక మృతి చెందిందని నిర్ధారించారు. అయితే చిన్నారి తల్లిదండ్రులు మాత్రం చాలా ఆవేదన చెందారు. బాలిక చనిపోయిందన్న విషయాన్ని జీర్ణించుకోలేక తల్లడిల్లిపోయారు. చివరి ప్రయత్నంగా చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లాలని పోలీసును కోరారు. ఆస్పత్రిలో తమ కూతురుకి చికిత్స అందించాల్సిందేనని పట్టుబట్టారు. దీంతో పోలీసులు బాలికను పోస్టుమార్టం చేయడానికి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రభుత్వాసుపత్రిలో డాక్టర్లు పోస్టుమార్టం సందర్భంగా బాలిక గుండె చప్పుడు గమనించారు. బాలిక అపస్మారక స్థితిలో ఉందని తెలిపారు. అత్యవసర చికిత్స అందించారు. బాలిక మింగిన నీళ్లు బయటికి తీసి చికిత్స అందించారు. జరిగిన మిరాకిల్‌కి డాక్టర్లు ఆశ్చర్యపోయారు. చికిత్స అనంతరం బాలిక మానసిక పరిస్థితిని వైద్యులు పరిశీలించారు. బాలికతో మాట్లాడుతూ బాలిక తల్లిదండ్రులను, స్నేహితులను, వారి కుటుంబసభ్యుల వివరాలను అడిగారు. బాలిక మెంటల్ కండీషన్ చెక్ చేసి పూర్తిగా ఆరోగ్యంగా ఉందని నిర్ధారించారు. తల్లిదండ్రులు తమ నమ్మకాన్ని నిజం చేసినందుకు డాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు. బాలికను ఇంటికి తీసుకెళ్ళారు. ఈ సంఘటన స్థానికులనే కాకుండా అందరినీ ఆశ్చర్యపరిచింది. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి