Ayodhya Ram Mandir: అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ రోజు స్కూళ్లు, కాలేజీలకు సెలవు!

రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జనవరి 22 రోజున ఎంతో అంగరంగ వైభవంగా జరగనుంది. ఈక్రమంలో యూపీ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. మందిరం ప్రతిష్ఠ జరిగే రోజున స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించాలని యోగీ సర్కారు నిర్ణయం తీసుకుంది.

New Update
Ayodhya Ram Mandir : ప్రాణ ప్రతిష్ఠ జనవరి 22నే ఎందుకు? ఈ తేదీ ప్రాముఖ్యత ఏంటి?

Ayodhya: యావత్‌ దేశ మంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అయోధ్య రామ మందిర(Ayodhya Ram Mandhir) ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం మరో పది రోజుల్లో జరగనున్న తరుణంలో అయోధ్య లో ఏర్పాట్లన్ని చకచకా జరిగిపోతున్నాయి. ఇప్పటికే స్వామి వారి ఆలయానికి మొదటి బంగారు తలుపుని ఏర్పాటు చేశారు.

యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..

స్వామి వారి ప్రతిష్ఠ కార్యక్రమం జరిగే రోజున ఏర్పాట్ల గురించి యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే దేశ విదేశాల నుంచి స్వామి వారిని దర్శించుకోవడానికి భక్తులు వస్తున్న క్రమంలో సుమారు 600 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రత ఏర్పాట్లను చేసింది.

స్కూళ్లు, కాలేజీలకు సెలవు..

ఇప్పటికే రాష్ట్రంలో స్వామి ఆలయ ప్రతిష్ఠ కార్యక్రమం రోజున మద్యం షాపులన్నింటిని కూడా మూసివేయాలని కీలక ఆదేశాలు జారీ చేసింది యోగీ ప్రభుత్వం. అంతేకాకుండా ఆ చుట్టుపక్కల ఎక్కడా కూడా మాంసాన్ని కూడా అమ్మరాదని ఇప్పటికే స్పష్టం చేసింది. అదే విధం గా ఆలయ ప్రాణ ప్రతిష్ఠ జరిగే సోమవారం స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించినట్లు వివరించింది. అయోధ్య చుట్టూ ఆరోజు ఆరెంచెల భద్రతను కూడా ఏర్పాటు చేసింది.

కార్యక్రమం రోజునే...

ఆ మహోన్నత కార్యక్రమం జరిగే రోజునే మ పిల్లలను కంటామంటూ గర్భిణులు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. స్వామి వారి పేరు వచ్చేటట్లు తమ పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుందని చాలా మంది గర్భీణులు సీ సెక్షన కోసం వైద్యులను కోరుతున్నారు. మరి కొందరైతే నెలలు కూడా నిండక ముందే డెలివరీ చేయాలని వైద్యులను ఆశ్రయిస్తున్నారు.

జైళ్లలో ప్రత్యక్ష ప్రసారం...

జనవరి 22న జరగబోయే రామ మందిర ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని యూపీలోని అన్ని జైళ్లలో ప్రత్యక్ష ప్రసారం చేస్తామని యూపీ జైళ్లశాఖ మంత్రి ధర్మవీర్‌ ప్రజాపతి తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని ఖైదీలు అందరూ కూడా వీక్షిస్తారని అన్నారు. యూపీ లో ఉన్న అన్ని జైళ్లలో కలిపి 1.05 ఖైదీలు ఉన్నారని వారంతా కూడా భారతీయులే కావడంతో వారికి ఈ అద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు అవకాశం కల్పించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ధర్మవీర్‌ తెలిపారు. ఖైదీలుగా ఉన్నవారంతా కూడా పరిస్థితుల ప్రభావంతో నేరస్తులుగా మారారని ఆయన అన్నారు.

రామ మందిరాన్ని ఎంతో పటిష్టంగా నిర్మిస్తున్నారు. వేల సంవత్సరాలు పాటు భూకంపాలు వచ్చినప్పటికీ చెక్కు చెదరకుండా ఉండేలా ఆలయ నిర్మాణాన్ని చేపట్టారు. ఆలయాన్ని రాళ్లతో నిర్మిస్తున్నారు. ఐరన్ ఎక్కడా వినియోగించడం లేదు.ఆలయ పొడవు 380 అడుగులు, వెడల్పు 250 అడుగులు, ఆలయ ఎత్తు 161 అడుగులుగా నిర్మించారు. ఆలయాన్ని మూడు అంతస్తుల్లో నిర్మిస్తున్నారు. ఒక్కో అంతస్తు ఎత్తు కూడా 20 అడుగులు ఉంది. అయోధ్యలోని రామ మందిరానికి 44 తలుపులను ఏర్పాటు చేస్తున్నారు.

అందులో 18 తలుపులు బంగారు తాపడంతో తయారు చేశారు. దీంతో పాటు ఆలయంలో 392 స్తంభాలు ఉన్నాయి. ఈ స్తంభాలపై దేవతామూర్తుల విగ్రహాలను చెక్కించారు. అంతే కాదు ఈ ఆలయాన్ని మూడు దశల్లో నిర్మిస్తున్నారు. మొదటి దశ పనులు పూర్తయ్యాయి. జనవరి 22న రాముడిని గ్రాండ్ ప్యాలెస్‌లో ప్రాణ ప్రతిష్ట చేయనున్నారు , జనవరి 2024 నాటికి రెండవ దశ పని పూర్తవుతుంది. జనవరి 2025 నాటికి మొత్తం ఆలయాన్ని నిర్మిస్తారు.

Also read: బిగ్ సీ లో మొదలైన సంక్రాంతి ఆఫర్లు.. త్వరపడండి!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP Crime News : అక్క ఇంటికే కన్నం వేసిన చెల్లెలు...లక్షల విలువచేసే బంగారంతో…

ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు.. మరోవైపు సొంత అక్క ఆర్థికంగా బాగుండంతో దుర్భిద్ధి పుట్టింది. దాంతో అక్క ఇంటికే కన్నం వేసిందో చెల్లెలు. అయితే పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి చోరీ కేసును ఛేదించారు. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో జరిగింది సంఘటన.

New Update
Nidadavole Police Station

Nidadavole Police Station

AP Crime News : ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు.. మరోవైపు సొంత అక్క ఆర్థికంగా బాగుండంతో దుర్భిద్ధి పుట్టింది. దాంతో అక్క ఇంటికే కన్నం వేసిందో చెల్లెలు. అయితే పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి చోరీ కేసును ఛేదించారు. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో జరిగింది సంఘటన. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిడదవోలులోని ఎంవీనగర్ దానమ్మ గుడివద్ద గల లలితదేవి అనే మహిళ ఇంట్లో చోరీ జరిగింది. సుమారు రూ.12,50,000 విలువ చేసే బంగారంతో పాటు రూ.10000 నగదు చోరికి గురైంది. లలితదేవి బయటకు వెళ్లి వచ్చేసరికి ఇంటి తాళాలు పగలగొట్టి ఉండడం, ఇంట్లో వస్తువులన్నీ చిందరవందరగా ఉండటంతో పాటు నగలు చోరీ జరిగినట్లు గుర్తించింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వచ్చి క్లూస్ సేకరించారు.

Also Read: 'ప్రభాస్'ని పక్కన పెట్టి అలియా భట్ తో నాగ్ అశ్విన్ మూవీ..!

Also Read: మహేష్ హీరోయిన్ పై కన్నేసిన బన్నీ..!

కాగా పోలీసులు అన్ని రకాలుగా విచారించి చోరి చేసింది లలితాదేవి చెల్లెలే అని నిర్ధారించారు. ఇటీవల నిడదవోలులోని అక్క ఇంటికి వచ్చిన చెల్లెలు లక్ష్మీ శైలజ. అప్పటికే ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న శైలజ అక్క ఇంట్లో డబ్బు, బంగారం చూడగానే దుర్భిద్ది పుట్టింది. దీంతో మరో రోజు పగడ్భందిగా ప్లాన్ చేసింది. చేసి అక్క బావ ఇంట్లో లేనప్పుడు చూసి మరో ఇద్దరు సాయంతో అక్క ఇంట్లో తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడింది. అక్క ఇంటికి రాగానే ఇల్లంతా చిందర వందరంగా ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి రంగంలోకి దిగిన పోలీసులు చాకచక్యంగా చెల్లెలును అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మరో ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. వారి వద్ద నుంచి నగదు, నగలు స్వాధీనం చేసుకున్నారు.

Chiranjeevi: డ్యాన్స్ చేస్తూ కళ్ళు తిరిగి పడిపోయిన చిరంజీవి..!

Also Read: 'మంగపతి' గెటప్‌లో శివాజీ స్పెషల్ వీడియో వైరల్

Advertisment
Advertisment
Advertisment