UP: తీవ్ర విషాదం.. ట్రాక్టర్ చెరువులోపడి 24 మంది మృతి ఉత్తర్‌ప్రదేశ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. మాఘ పూర్ణిమ సందర్భంగా హరిద్వార్ గంగా నదిలో పవిత్ర స్నానానికి వెళ్తున్న ప్రయాణికుల ట్రాక్టర్ చెరువులో బోల్తాపడింది. 24 మంది మృతి చెందారు. సీఎం యోగి మృతుల కుటుంబాలకు రూ.2లక్షల పరిహారం ప్రకటించారు. By srinivas 25 Feb 2024 in క్రైం నేషనల్ New Update షేర్ చేయండి UP Tractor Trolley Accident: ఉత్తర్‌ప్రదేశ్ (UP)లో ఘోర ప్రమాదం జరిగింది. గంగా నదిలో పవిత్ర స్నానమాచరించేందుకు వెళ్తున్న వారిని మృత్యువు కబళించింది. యాత్రికులు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ చెరువులో పడగా.. 24 మంది అక్కడికక్కడే చనిపోయారు. ఈ మృతుల్లో 9 మంది చిన్నపిల్లలున్నట్లు తెలుస్తోంది. పవిత్ర స్నానం కోసం.. ఈ మేరకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ యాత్రికులంతా హరిద్వార్ వెళ్తుండగా కాస్‌గంజ్‌లో ఈ ప్రమాదం జరిగింది. మాఘ పూర్ణిమ సందర్భంగా గంగా నదిలో పవిత్ర స్నానం చేసి మొక్కలు అప్పచెప్పేందుకు హరిద్వార్ వెళ్తున్నారు. ఈ క్రమంలోనే అదుపుతప్పిన ట్రాక్టర్ చెరువులో పడిపోయింది. వెంటనే గమనించిన తోటి ప్రయాణికులు, స్థానికులు కొంతమందిని కాపాడారు. Your browser does not support the video tag. ఇది కూడా చదవండి: Eye Urine Drops: కంట్లో మూత్రం చుక్కలు.. ఈ అమ్మాయి ప్రతీరాత్రి ఇలా ఎందుకు చేస్తుందో తెలిస్తే షాకే ఇక విషయం తెలియగానే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షల పరిహారం అందిస్తామన్నారు. Your browser does not support the video tag. #15-people-died #tractor-overturned #ups-kasganj మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి