AP: పశుపతినాథ ఆలయంలో దుండగుల బీభత్సం! అనంతపురం జిల్లా గొల్లల దొడ్డి గ్రామంలోని చతుర్ముఖ ఆలయంలో దుండగులు విధ్వంసం సృష్టించారు. పడమర నంది విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఘటనపై పూజారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నేపాల్ తర్వాత చెప్పుకోదగ్గ పశుపతినాథ ఆలయంలో ఇలా జరగడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. By Jyoshna Sappogula 12 Aug 2024 in ఆంధ్రప్రదేశ్ క్రైం New Update షేర్ చేయండి Ananthapuram: అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం గొల్లల దొడ్డి గ్రామంలోని పశుపతినాథ ఆలయంలో దుండగులు బీభత్సం సృష్టించారు. గ్యాస్ వెల్డింగ్ కట్టర్ తో ఇనుప డోర్లను కట్ చేసి ఆలయంలోకి చొరబడి నాలుగు దిక్కుల్లో ఉన్న నంది ముఖాలకు నల్ల బట్టను కట్టి పూజలు నిర్వహించి పడమర ఉన్న నంది ముఖంను ధ్వంసం చేశారు. Also Read: అంబేద్కర్ గురించి మాట్లాడే అర్హతే లేదు.. వైసీపీపై వర్మ ఫైర్..! ఆలయానికి విచ్చిన పురోహితులు జడప్ప ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. రంగంలో దిగిన పోలీసులు, అర్బన్ సిఐ శ్రీనివాసులు సంఘటనా స్థలానికి చేరుకొని జరిగిన ఘటనపై పూజారితో ఆరా తీశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. క్లూస్ టీమ్ ను రప్పించి విచారణ చేపట్టామన్నారు. Also Read: ఈ నిబంధనలు పాటించాల్సిందే.. పాఠశాలలకు మంత్రి హెచ్చరిక..! దుండగులను త్వరలో పట్టుకుంటామని తెలిపారు. దేశంలో నేపాల్ తర్వాత చెప్పుకోదగ్గ పశుపతినాథ ఆలయంలో ఈ ఘటన జరగడంతో భక్తులు ఆందోళనలు వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు, ప్రభుత్వం ప్రతిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసి ఇలాంటి ఘటనలు మరల జరగకుండా చూడాలని కోరారు. #ananthapuram మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి