Village Startups: విలేజ్ స్టార్టప్స్ కోసం ప్రభుత్వ సహకారం.. కోట్లాది రూపాయల నిధులు అందుబాటులో.. 

మీరు గ్రామంలో నివసిస్తున్నా లేదా దేశంలోని వ్యవసాయ రంగంలో పని చేయాలనుకుంటున్నా ఇప్పుడు ప్రభుత్వం మీకు సహాయం చేయడానికి ఏర్పాట్లు చేస్తోంది. అటువంటి స్టార్టప్‌లకు నిధులను అందించడం ద్వారా ప్రభుత్వం మద్దతు ఇస్తుంది. ఇందుకోసం రూ.750 కోట్ల నిధులను ప్రభుత్వం సిద్ధం చేసింది.

New Update
Village Startups: విలేజ్ స్టార్టప్స్ కోసం ప్రభుత్వ సహకారం.. కోట్లాది రూపాయల నిధులు అందుబాటులో.. 

Village Startups: మీరు గ్రామాల్లో నివసిస్తున్నారా? మీరు ఉంటున్న గ్రామంలో ఏదైనా వ్యవసాయానికి సంబంధించిన ఏదైనా స్టార్టప్ ప్రారంభించాలని అనుకుంటున్నారా? అయితే, మీలాంటి వారి కోసం ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ తీసుకువచ్చింది. గ్రామాలలో వ్యవసాయానికి సంబంధించి ఏదైనా స్టార్టప్ పెట్టాలనుకునే వారికీ సహకరించడం కోసం 750 కోట్ల రూపాయలతో ఫండ్ ఏర్పాటు చేస్తోంది. నిర్దిష్ట రాగంలో ఆవిష్కరణలు ప్రోత్సహించడం కోసం ఈ ఏర్పాటు చేస్తోంది ప్రభుత్వం. దీని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

Village Startups: దేశంలో వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న పారిశ్రామికవేత్తలకు సహాయం చేయడానికి, ప్రభుత్వం 'అగ్రిసూర్' పేరుతో ఒక నిధిని సృష్టించింది. దీనిని 'అగ్రికల్చర్ ఫండ్ ఫర్ స్టార్టప్స్ అండ్ రూరల్ ఎంటర్‌ప్రైజెస్'గా పిలుస్తారు. ప్రభుత్వ అధికారిక ప్రకటన ప్రకారం, ఈ నిధితో ప్రభుత్వం గ్రామాలు, వ్యవసాయ సంబంధిత పరిశ్రమలలో పెట్టుబడి పెడుతుంది. ముఖ్యంగా వ్యవసాయం - అనుబంధ రంగాలలో పనిచేస్తున్న స్టార్టప్‌లకు ప్రభుత్వం రుణాలతో పాటు ఈక్విటీ మద్దతును అందిస్తుంది. 750 కోట్ల నిధుల ద్వారా భారతదేశ వ్యవసాయ రంగంలో ఆవిష్కరణలు,  స్థిరత్వాన్ని ప్రోత్సహించడం ఈ పథకం ప్రధాన లక్ష్యం.

వ్యవసాయ రంగంలో తక్కువ రిస్క్..
Village Startups: ఈ ఫండ్ సంస్థలకు ఈక్విటీ, లోన్ సపోర్ట్ రెండింటినీ అందిస్తుంది. ఇది ముఖ్యంగా వ్యవసాయ విలువ గొలుసులో ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇది అధిక ప్రభావాన్ని సృష్టించే కార్యకలాపాలను కూడా ప్రోత్సహిస్తుంది. దీనికి సంబంధించి ఇటీవల ఓ కార్యక్రమం నిర్వహించారు. ఆర్థిక సంస్థలు, పెట్టుబడిదారులు, AIF మేనేజర్లు, వ్యవసాయ స్టార్టప్‌లతో సహా కీలకమైన వాటాదారులు దీనికి హాజరయ్యారు.

Also Read: అదుపులో లేని ద్రవ్యోల్బణం.. కూరగాయల ధరలే కారణం!

Village Startups: దేశంలోని ఎక్కువ శాతం జనాభా ఇప్పటికీ దాని మీద ఆధారపడి జీవిస్తోంది. దీని కారణంగా, దేశంలో వ్యవసాయ రంగం అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. రైతులకు ఆర్థిక సహాయం కోసం, ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో పథకాన్ని అమలు చేస్తుంది. ఇందులో వారికి ఏటా రూ.6వేలు నేరుగా ఆర్థిక సహాయం అందజేస్తారు.

ఇది మాత్రమే కాకుండా, ప్రభుత్వం ఎరువులపై భారీ సబ్సిడీని ఇస్తుంది. అలాగే,  రైతులకు రాయితీ ధరలకు విద్యుత్.. ఇతర సౌకర్యాలను కూడా అందిస్తుంది. ఏది ఏమైనప్పటికీ, ఈ రంగంలో పెట్టుబడులకు, ముఖ్యంగా మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఇంకా చాలా చేయాల్సిన అవసరం ఉంది. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Gold Prices Today: భారీగా తగ్గిన బంగారం.. గ్రాము ఎంత ఉందంటే?

నేడు మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.98,340గా ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర రూ.90,140గా ఉంది. ఇక గ్రాము రేటు చూసుకుంటే.. రూ.9,834 గా మార్కెట్‌లో ఉంది. అయితే ప్రాంతం, సమయాన్ని బట్టి ధరల్లో కాస్త మార్పులు ఉంటాయి.

New Update
Gold rate

Gold rate

గత కొన్ని రోజుల నుంచి బంగారం ధరలు పెరుగుతున్నాయి. 10 గ్రాముల బంగారం ధర లక్ష రూపాయలకు పైనే దాటింది. లక్ష లేనిదే బంగారం కొనలేరు. అందులోనూ తులం బంగారం అంటే చేతిలో లక్ష కంటే ఎక్కువగానే డబ్బులు పెట్టుకోవాలి. నేడు మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.98,340గా ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర రూ.90,140గా ఉంది. ఇక గ్రాము రేటు చూసుకుంటే.. రూ.9,834 గా మార్కెట్‌లో ఉంది. అయితే ప్రాంతం, సమయాన్ని బట్టి ధరల్లో కాస్త మార్పులు ఉంటాయి.

ఇది కూడా చూడండి: TG Crime: కోడలిపై మోజుతో కొడుకును లేపేసిన తండ్రి.. రోకలి బండతో కొట్టి చంపి!

ఇది కూడా చూడండి: Betting Apps Pramotion Case : ప్రభుత్వం సంచలన నిర్ణయం..సెలబ్రిటీ బెట్టింగ్ యాప్స్ కేసు సీఐడీకి బదిలీ

ఏయే నగరాల్లో ఎలా ఉన్నాయంటే?

చెన్నైలో 22 క్యారెట్ల గ్రాము ధర రూ.9,005, 24 క్యారెట్ల గ్రాము ధర రూ.9,824, ముంబైలో 22 క్యారెట్ల గ్రాము ధర రూ.9,005, 24 క్యారెట్ల గ్రాము ధర రూ.9,824, న్యూఢిల్లీ 22 క్యారెట్ల గ్రాము ధర రూ.9,005, 24 క్యారెట్ల గ్రాము ధర రూ.9,834, కోల్‌కతా 22 క్యారెట్ల గ్రాము ధర రూ.9,005, 24 క్యారెట్ల గ్రాము ధర రూ.9,824, బెంగళూరులో 22 క్యారెట్ల గ్రాము ధర రూ.9,005, 24 క్యారెట్ల గ్రాము ధర రూ.9,824, హైదరాబాద్‌లో 22 క్యారెట్ల గ్రాము ధర రూ.9,005, 24 క్యారెట్ల గ్రాము ధర రూ.9,824, కేరళలో 22 క్యారెట్ల గ్రాము ధర రూ.9,005, 24 క్యారెట్ల గ్రాము ధర రూ.9,824, పూణే 22 క్యారెట్ల గ్రాము ధర రూ.9,005, 24 క్యారెట్ల గ్రాము ధర రూ.9,824, అహ్మాదాబాద్ 22 క్యారెట్ల గ్రాము ధర రూ.9,005, 24 క్యారెట్ల గ్రాము ధర రూ.9,824గా ఉంది.

ఇది కూడా చూడండి: Indus River Agreement: 64 ఏళ్ళ ఒప్పందానికి స్వస్తి..ఎడారిగా మారనున్న పాకిస్తాన్

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు