రాజమండ్రిలో పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతితో టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రవీణ్ ను చంపేశారని కుటుంబ సభ్యులు, పాస్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రవీణ్ ఫోన్ డెటాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ప్రవీణ్ కు ఎవరితోనైనా గొడవలు ఉన్నాయా అనే కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రవీణ్ పై ఎవరైనా కుట్ర చేశారా లేకా అనుమానస్పద స్థితిలో మృతి చెందారా.. అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రవీణ్ పోస్టుమార్టం రిపోర్టుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రాజమండ్రి నుంచి రాజానగరం వెళ్లే దారిలో అనుమానస్పద స్థితిలో ప్రవీణ్ మృతదేహం లభ్యమైంది. ఆయన ముఖం, పెదాలపై గాయాలు కనిపించడంతో ఎవరైనా ఆయన్ను హత్య చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ప్రవీణ్‌ను హత్య చేసి యాక్సిడెంట్‌గా చిత్రీకరించారని ఆరోపణ వస్తున్నాయి. ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి ప్రవీణ్ మృతి వెనుక ఉన్న కారణాలు తెలపాలని పాస్టర్లు కోరుతున్నారు.
Pastor Praveen : పాస్టర్ ప్రవీణ్ కేసులో బిగ్ ట్విస్ట్!
రాజమండ్రిలో పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతితో టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రవీణ్ ను చంపేశారని కుటుంబ సభ్యులు, పాస్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రవీణ్ ఫోన్ డెటాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.