NZB STUDENT DEATH: ప్రేమ పేరుతో వేధింపులు తట్టుకోలేక.. ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకొని! నిజామాబాద్‌లో బీటెక్ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ప్రేమ వేధింపులు తట్టుకోలేక స్నేహా తివారీ ఉరేసుకుంది. సోఫియాన్ అనే విద్యార్థి వేధింపులే కారణమని.. రోజూ ప్రేమించాలని వేధించేవాడంటున్న కుటుంబసభ్యులు. By Trinath 07 Sep 2023 in తెలంగాణ నిజామాబాద్ New Update షేర్ చేయండి Nizamabad student Sneha Tiwari suicide: ప్రేమ పేరుతో వేధించడం.. అమ్మాయి వెనుక తిరగడం.. లవ్ అంగీకరించకపోతే చంపడం దశాబ్దాలుగా జరుగుతూనే ఉన్నా ఈ మధ్య కాలంలో ఈ తరహా దారుణాలు పెరిగిపోతున్నాయి. నిత్యం ఏదో ఒక చోటా ప్రేమ వేధింపులకు యువతలు బలైపోతూనే ఉంటున్నారు. ఎవరికి చెప్పాలో అర్థం అవ్వక.. చెప్పనా అర్థం చేసుకునేవారు కరువై తనువు చాలిస్తున్నారు. తాజాగా నిజామాబాద్‌లో బీటెక్ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ప్రేమ వేధింపులు తట్టుకోలేక స్నేహా తివారీ ఉరేసుకుంది. సోఫియాన్ అనే విద్యార్థి వేధింపులే కారణమని.. రోజూ ప్రేమించాలని వేధించేవాడంటున్న కుటుంబసభ్యులు. Also Read: రోడ్డు ప్రమాదంలో మరణించి…ఏడుగురికి అవయవదానం చేసిన యువతి పెరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలు: మరోవైపు వరుస పెట్టి స్టూడెంట్స్ సూసైడ్స్ చేసుకుంటుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇండియన్ పీనల్ కోడ్ (IPC)లోని సెక్షన్ 309 ఆత్మహత్యాయత్నాన్ని శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తుంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (National Crime Records Bureau), 2021, దేశంలో ఆత్మహత్యల ద్వారా దాదాపు 1,64,000 మరణాలను నమోదు చేసింది. మహారాష్ట్ర అత్యధిక ఆత్మహత్యలను చూసింది, తమిళనాడు (రాథోడ్, 2023) తరువాతి స్థానంలో ఉంది. ఇండియా కంటే కాస్త జనాభా తక్కువగా ఉన్న చైనాతో పోలిస్తే, ఆత్మహత్యల సంఖ్య రెండింతలు భారత్‌లో ఉండటం కలవర పెడుతోంది. చైనాలో ప్రతి సంవత్సరం ప్రతి 1,00,000 మందికి ఆరుగురు ఆత్మహత్యల ద్వారా మరణిస్తున్నారు. ఇటు ఈ సంఖ్య ఈ సంఖ్య 12గా ఉంది. విద్యార్థులను పట్టించుకోరేం? న్యూఢిల్లీలో నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం, 15-29 వయస్సు మధ్య వారు ఆత్మహత్యలకు ఎక్కువగా చేసుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో యువతను కలిగి ఉన్న దేశంగా భారత్‌కు పేరుంది. మన యువత, విద్యార్థులు తమ జీవితాన్ని ఎందుకు వదులుకుంటారు? ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన యువకులపై చేసిన పరిశోధనలు చాలా వరకు చనిపోవాలని కోరుకోలేదని సూచిస్తున్నాయి. అప్పటి పరిస్థితి నుంచి తప్పించుకోవాలని మాత్రమే కోరుకుంటున్నారు. అందుకే వారికి చనిపోవడం సులువైన మార్గంగా కనిపిస్తోంది. కానీ ఇది అసలు కరెక్ట్ కాదు.. కష్టాలతో, కష్టాలు పెట్టేవారితో పోరాడాలి.. అవి మనల్ని చూసి పారిపోవాలి కానీ సమస్యలకు దూరంగా ఉండాలని ప్రాణాలు తీసుకోకూడదు. మరోవైపు పాఠశాలలు, కళాశాలలు నిజ జీవిత సమస్యలకు సహాయం చేయడం లేదంటున్నారు విశ్లేషకులు. ఇది ఒంటరితనానికి దారితీయవచ్చు. ఉపాధ్యాయులు విద్యార్థుల అవసరాలను పట్టించుకోరని చాలా మంది వాదిస్తున్నారు. అందుకే విద్యార్థులు కష్ట సమయాల్లో ఏం చేయాలో అర్థం అవ్వక కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారని చెబుతున్నారు. ఇప్పటికైనా స్కూల్స్ కాలేజీలు వారి సొంత ప్రతిష్టపై దృష్టి పెట్టకుండా విద్యార్థుల వైపు దృష్టి మళ్లించడం ప్రారంభించాలి. ALSO READ: మూసీలో లేడీ డెడ్ బాడీ..4 రోజుల క్రితం హుస్సేన్ సాగర్ నాలాలో గల్లంతైన లక్ష్మి! #nizamabad-student-sneha-tiwari-suicide #nizamabad-student-suicide #nizamabad-b-tech-student-suicide మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి