Anant Ambani: అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్ వేడుకలకు అల్ట్రా లగ్జరీ టెంట్స్..

అంబానీ ఇంట్లో పెళ్ళంటే ఆల్మోస్ట్ దేవతల పెళ్ళిళ్ళ లెక్కనే. దేన్నైనా చాలా ఆడంబరం గా చేసే మోస్ట్ రిచ్చెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా ముఖేష్ తన ఆఖరి కొడుకు అనంత్ ప్రీ వెడ్డింగ్ ఏర్పాట్లను కూడా అట్టహాసంగా చేస్తున్నారు. అవేంటో తెలుసుకోవాలంటే...ఇది చదివేయండి.

New Update
Ambani's Wedding: కొత్త దంపతులకు కోట్ల విలువైన బహుమతులు

Anant Ambani Pre Wedding: రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అని సామెత. సామెతలో దెబ్బలు అనే ఉంటుంది కానీ రాజులు తలుచుకుంటే ఏదైనా ఘనంగా ఉండాల్సిందే. ప్రస్తుతం ఉన్నది రాజుల కాలం కాకపోయినా ముఖేష్ అంబానీ మాత్రం రాజుల లెక్కనే. ఇండియాలో నంబర్ వన్ టాప్ ధనవంతుడు అయిన ముఖేష్ (Mukesh Ambani) ఏం చేసినా చాలా రిచ్‌గానే చేస్తారు. వాళ్ళింట్లో పెళ్ళి అయినా, వేడుక అయినా తరాలు చెప్పుకోవల్సిందే. ఇప్పుడు ముఖేష్-నీతా అంబానీల ఆఖరి కొడుకు అనంత్ అంబానీ (Anant Ambani) పెళ్ళి మరికొన్ని రోజుల్లో జరగబోతోంది. వీరిటంల్ఓ ఇదే ఆఖరి పెళ్ళి అవడంతో దీన్ని ఎవరూ ఊహించలేనంత గ్రాండ్‌గా జరపించాలనుకుంటున్నారు ముఖేష్ అంబానీ.

ప్రీ వెడ్డింగ్ వేడుకలకు కళ్ళు చెదిరే ఏర్పాట్లు...

అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ (Radhika Merchant) ల పెళ్ళి జూలైలో జరగనుంది. అయితే పెళ్లి ముందు వేడుక మాత్రం మార్చి 1 నుంచి మూడు రోజుల పాటూ జరుపుతున్నారు. దీనికి అతిరథ, మహారథులందరినీ పిలిచారు. ఈ వేడుక కోసం గుజరాత్‌లోని (Gujarat) జామ్ నగర్‌లో వరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. జాయ్‌ నగర్ అంతా ప్రీ వెడ్డింగ్ వేడుకలతో మారు మోగిపోయేటట్టు చేస్తున్నారు. ఇప్పటికే ఇక్కడకు రావడానికి అతిధుల కోసం ఢిల్లీ, ముంబయ్‌ల నుంచి ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేశారు. ఇప్పుడు జామ్‌నగర్‌లో అతిధులు ఉండడానికి అల్ట్రా లగ్జరీ టెంట్లను నిర్మిస్తున్నారు. జామ్‌నగర్‌లో 5స్టార్ హోటళ్ళు లేకపోవడంతో వీటిని ఏర్పాటు చేయిస్తున్నామని చెబుతున్నారు ముఖేష్ అంబానీ దంపతులు. ఈ టెంట్‌ల్లో టైల్డ్‌ బాత్‌రూమ్‌లు, విశాలమైన బెడ్‌లు, చిన్న బార్‌ రూమ్‌లతో సహా సర్వసదుపాయాలు ఉంటాయి.

దేశ విదేశాల నుంచి ప్రముఖులు...
అనంత్ అంబానీ -రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలను మన దేశం నుంచే కాక విదేశాల నుంచి కూడా ప్రముఖులు తరలివస్తున్నారు. మన దేశం నుంచి బాలీవుడ్‌ ప్రముఖులు అమితాబ్‌ బచ్చన్‌, షారుక్‌ ఖాన్‌, క్రికెట్‌ దిగ్గజాలు సచిన్‌ తెందుల్కర్‌, ఎంఎస్‌ ధోనీలు లాంటి వారు ఎలాగో వస్తారు. వీరుకాకుండా మెటా సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌, మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌, ఆల్ఫాబెట్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌, అడోబ్‌ సీఈఓ శంతను నారాయణ్‌, వాల్ట్‌ డిస్నీ సీఈఓ బాబ్‌ ఐగర్‌, బ్లాక్‌రాక్‌ సీఈఓ లారీ ఫింక్‌, అడ్నాక్‌ సీఈఓ సుల్తాన్‌ అహ్మద్‌ వంటి అంతర్జాతీయ ప్రముఖులు కడా రానున్నారు. మరోవైపు ముఖేష్ తర్వాత అంతటి రిచ్ వ్యాపారస్తులు అయిన గౌతమ్‌ అదానీ, టాటా సన్స్‌ ఛైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌, బిర్లా గ్రూప్‌ ఛైర్‌పర్సన్‌ కుమార్‌ మంగళం బిర్లా, గోద్రేజ్‌ కుటుంబం, ఇన్ఫోసిస్‌ ఛైర్మన్‌ నందన్‌ నీలేకనీ, ఆర్‌పీఎస్‌జీ గ్రూప్‌ హెడ్‌ సంజీవ్‌ గోయెంకా, విప్రో రిషద్‌ ప్రేమ్‌జీ, ఉదయ్‌ కోటక్‌, అదర్‌ పూనావాలా, సునీల్‌ మిత్తల్‌, పవన్‌ ముంజాల్‌, రోష్ని నాడార్‌, నిఖిల్‌ కామత్‌, రొన్నీ స్క్రూవాలా, దిలీప్‌ సంఘ్వీలకు కూడా ఆహ్వానాలు అందాయి.

Also Read: Cricket: నాలుగో టెస్ట్‌లో భారత్ ఘనవిజయం..సీరీస్ కూడా మనదే.

ఇక క్రికెటర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, రవిశాస్త్రి లాంటి వారికి ప్రీవెడ్డింగ్ వేడుకలను వస్తున్నారు. బాలీవుడ్ ప్రముఖులు దాదాపు అందరూ వీటికి హాజరుకానున్నారు. ముడూ రోజుల పాటూ జరిగే ఈ ఫంక్షన్‌కు మాలీవుగ్ పాప్ సింగర్ రిహాన్నా షో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. దాంతో పాటూ దిల్జీత్ దోసాన్జ్, ఇతర గాయకుల ప్రదర్శనలు కూడా ఉండనున్నాయి.

Watch This Trending Video:

Advertisment
Advertisment
తాజా కథనాలు