Station Master: అర్ధరాత్రి అరగంటకు పైగా నిలిచిపోయిన ఎక్స్ ప్రెస్..సిగ్నల్ ఇవ్వాల్సిన స్టేషన్ మాస్టర్ చేసిన పనికి పాసెంజర్స్ షాక్!

ఉత్తర ప్రదేశ్ లోని ఎటావా దగ్గరలోని ఉడిమోరి జంక్షన్ రైల్వే స్టేషన్ లో స్టేషన్ మాస్టర్ గుర్రు పెట్టి నిద్రపోవడంతో.. సిగ్నల్ ఇచ్చేవారు లేక పాట్నా-కోటా ఎక్స్‌ప్రెస్‌ రైలు దాదాపు అరగంటకు పైగా ఆగిపోయింది. దీంతో, ప్రయాణీకులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.

New Update
Station Master: అర్ధరాత్రి అరగంటకు పైగా నిలిచిపోయిన ఎక్స్ ప్రెస్..సిగ్నల్ ఇవ్వాల్సిన స్టేషన్ మాస్టర్ చేసిన పనికి పాసెంజర్స్ షాక్!

Station Master: అది ఉత్తర ప్రదేశ్ లోని ఎటావా దగ్గరలోని ఉడిమోరి జంక్షన్ రైల్వే స్టేషన్. అర్ధరాత్రి. పాట్నా-కోటా ఎక్స్‌ప్రెస్‌ రైలు వచ్చి ఆగింది. నిజానికి ఆ ట్రైన్ కు అక్కడ హాల్ట్ లేదు. సిగ్నల్ లేకపోవడంతో రైలు ఆగింది. ఐదు.. పది.. పదిహేను.. ఇరవై నిమిషాలు గడుస్తున్నాయి. అరగంట పూర్తి అయిపోయింది. ట్రైన్ పైలట్ సిగ్నల్(Station Master) కోసం హారన్  కొడుతూనే ఉన్నాడు. కానీ, సిగ్నల్ ఇవ్వడం లేదు. దీంతో ఆ ట్రైన్ లోని ప్రయాణీకులకు విసుగు వచ్చింది. రైలు ఇంకెంత సేపు ఆగుతుంది? అంటూ చికాకు పడటం మొదలైంది. గార్డ్ కు కూడా అనుమానం వచ్చింది. ఎందుకు ఇంత సేపు సిగ్నల్ లేదు అని లోకో పైలెట్ తో మాట్లాడి.. స్టేషన్ లోకి వెళ్లి చూశారు. అక్కడి పరిస్థితి చూసి పైలట్, గార్డులకు మతిపోయింది. అక్కడ ద్యూటీలో ఉన్న స్టేషన్ మాస్టర్ గుర్రుపెట్టి నిద్రపోతున్నాడు. దీంతో అవాక్కయిన రైలు సిబ్బంది సదరు స్టేషన్ మాస్టార్ని నిద్రలేపి.. సిగ్నల్(Station Master) ఇవ్వు స్వామీ అని చెప్పి.. వెళ్లిపోయారు. 

ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు ఆ స్టేషన్ మాస్టర్(Station Master) పై క్రమశిక్షణా చర్యలకు ఉపక్రమించారు. జరిగిన సంఘటనపై అతని వివరణ అడిగారు. దీంతో స్టేషన్ మాస్టర్ జరిగిన తప్పుకు క్షమాపణలు కోరినట్టు చెబుతున్నారు. అంతేకాకుండా, ఆ సమయంలో తానూ, పాయింట్‌మెన్ ఇద్దరే డ్యూటీలో ఉన్నామని ఆయన చెప్పారు. పాయింట్‌మెన్ ట్రాక్ చెక్ చేయడం కోసం వెళ్లడంతో.. తానూ ఒక్కడినే స్టేషన్ లో ఉన్నాననీ అనుకోకుండా నిద్రలోకి జారిపోయాననీ ఆయన(Station Master) చెప్పారని తెలిసింది. 

Also Read: ఓహ్ మై డాగ్..! ఇంత నల్ల కుక్క తెల్లగా ఎలా మారిందో..?

ఏదిఏమైనా ఇది చాలాపెద్ద తప్పిదం అనీ, స్టేషన్ మాస్టర్(Station Master) వివరణ అందాకా  అతని సమాధానం ఆధారంగా తగిన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని ఆగ్రా రైల్వే డివిజన్ పీఆర్‌వో ప్రశస్తి శ్రీవాస్తవ వెల్లడించారు. అయితే, మరోవైపు ఈ ఘటనను డివిజినల్ రైల్వే మేనేజర్ (డీఆర్ఎం) తేజ్ ప్రకాశ్ అగర్వాల్ తీవ్రంగా పరిగణించారు. వెంటనే సదరు స్టేషన్ మాస్టర్ పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఘటన చోటు చేసుకున్న ఉడిమోరి జంక్షన్ చిన్న స్టేషన్ కానీ.. అది చాలా ముఖ్యమైన స్టేషన్. ఆగ్రా, ఝాన్సీ నుంచి ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే రైళ్లు దీని మీదుగా వెళ్తాయి. దీంతో అటువైపుగా వెళ్లే రైళ్ల అన్నిటిపై ఈ స్టేషన్ లో చోటుచేసుకున్న సంఘటన ప్రభావం తీవ్రంగా పడింది అని.. అందుకే చాలా రైళ్లు ఆలస్యం అయ్యాయని రైల్వే అధికారులు పేర్కొన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు