Udayanidhi Stalin: మరోసారి సోషల్ మీడియాలో ఫోటో .. ఉదయ్‌ ఏం చెప్పాలనుకున్నాడు!

దోమలను చంపేందుకు వాడే మస్కిటో కాయిల్(masquito coil) ఫోటోను ఒక దానిని సోషల్ మీడియాలో ఉదయ్‌ పోస్ట్ చేశాడు

New Update
Udayanidhi Stalin: మరోసారి సోషల్ మీడియాలో ఫోటో .. ఉదయ్‌ ఏం చెప్పాలనుకున్నాడు!

Udayanidhi Stalin: తమిళనాడు మంత్రి(Tamilnadu Minister) , నటుడు ఉదయనిధి స్టాలిన్‌(Udhayanidhi Stalin) కొద్ది రోజుల క్రితం సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని వ్యాఖ్యలు చేసినప్పటి నుంచి కూడా ఆయన మీద హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. కొందరు రాజకీయ నేతలు కూడా ఆయన మీద తీవ్ర విమర్శలు చేశారు. సనాతన ధర్మాన్ని డెంగీ, మలేరియా వంటిదని..దాన్ని దేశం నుంచి తరిమి కొట్టాలని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.

ఇప్పటికీ ఈ అంశం రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. కొందరు అయితే ఉదయనిధిని చెప్పుతో కొట్టాలని, తల నరికి తీసుకుని రావాలని కూడా ఆఫర్లు ప్రకటించగా..వాటిని ఎంతో వ్యంగ్యంగా తిప్పికొట్టారు ఉదయ్‌. బీజేపీ (BJP) నేతలు, హిందూ మత పెద్దలు ఉదయ్‌ వ్యాఖ్యలను తీవ్రంగా విమర్శిస్తున్నారు కూడా.

అయితే ఎవరు ఎన్ని మాటలు అన్న కూడా ఉదయ్‌ మాత్రం అసలు తగ్గేదేలే అంటున్నారు. ఎవరు ఎన్ని అన్న నాకు అనవసరం అన్నట్లుగా ఆయన ప్రవర్తిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన నా మీద ఎన్ని కేసులు పెట్టిన సరే దానికి నేను రెడీ అంటున్నారు కూడా. ఇదిలా ఉండగా తాజాగా ఉదయ్‌ సోషల్‌ మీడియాలో ఓ పోస్టు పెట్టాడు.

Also Read: ప్రపంచమంతా భారత్‎కే సపోర్ట్ బ్రో..పాక్ తిక్కకుదిర్చిన టర్కీ..!

దోమలను చంపేందుకు వాడే మస్కిటో కాయిల్(Mosquito coil)ఫోటోను ఒక దానిని సోషల్ మీడియాలో ఉదయ్‌ పోస్ట్ చేశాడు. కానీ దానికి ఎటువంటి క్యాప్షన్‌ ఇవ్వలేదు. దీనిని చూసిన వారు అందరూ కూడా గతంలో సనాతన ధర్మం (Sanatana Dharma) పై ఉదయ్‌ చేసిన కామెంట్లను గుర్తుకు తెస్తున్నాయి. దీని గురించి కొంత మంది నెటిజన్లు ఉదయ్‌ పై వస్తున్న విమర్శలను ఎలా స్వీకరించాలి..ఎలా తిప్పికొట్టాలి అనే విషయం కచ్చితంగా తెలుసని పేర్కొంటున్నారు.

ఆదివారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఉదయనిధి మరోసారి కేంద్ర ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు. బీజేపీ (BJP) ఒక విష సర్పం అని అన్నారు. దాని నుంచి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు. దేశం గర్వించే విధంగా జీ 20 సమావేశాలను (G20 Summit) ఏర్పాటు చేశారు బాగానే ఉంది. కానీ దేశంలో ఉన్న పేదల మురికి వాడలను కనపడకుండా కేంద్ర ప్రభుత్వం దాచేసిందని ఆయన విమర్శించారు.

విదేశీ నాయకుల ముందు తమ దేశం ఎంతో అభివృద్ధి సాధించిందని చెప్పుకోవడానికి మాత్రమే ఈ ఏర్పాట్లు అని ఆయన అన్నారు. తమిళనాడులో ఉన్న విపక్ష పార్టీ అయిన ఏఐడీఎంకే ఒక పనికి రాని పార్టీ..అది తమిళనాడులో బీజేపీకి చోటు ఇస్తూ మద్దతు ఇస్తుందని పేర్కొన్నారు.

Also Read: ఇష్టం లేకపోతే దేశం విడిచివెళ్ళిపోండి, భారత్ పేరు మార్పు మీద బీజెపీ నేత కీలక వ్యాఖ్య

#sanatana-dharma #stalin-shares-photo-of-mosquito-coil #mosquito-coil #udaynidhi #sanatana-dharma-row #udhayanidhi-stalin
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు
తదుపరి కథనాన్ని చదవండి

J&K : వారిని వదిలిపెట్టేదే లేదు..ఉగ్రదాడిపై నేతల ర...

J&K : వారిని వదిలిపెట్టేదే లేదు..ఉగ్రదాడిపై నేతల రియాక్షన్

జమ్మూలోని పహల్గామ్ లోని ఉగ్రదాడిపై ప్రధాన మోదీ, రాష్ట్రపతితో పాటూ నేతలందరూ స్పందించారు. ఇంత దారుణానికి ఒడిగట్టిన వారిని వదిలిపెట్టేదే లేదని ప్రధాని మోదీ అన్నారు. ఇదొక క్రూరమైన అమానవీయ చర్య అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

New Update
attack jammu

attack jammu

జమ్మూలో జరిగిన టెర్రరిస్ట్ అటాక్ యావత్ దేశాన్ని షాక్ లో పడేసింది. అమాయక టూరిస్టులు చనిపోవడంపై నేతలు అందరూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ..కేంద్రహోం మంత్రి అమిత్ షాకు ఫోన్ చేసి మాట్లాడారు. ఇందులో మృత చెందిన వారికి ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అత్యంత హేయమైన పనికి ఒడిగట్టినవారిని చట్టం ముందుకు తీసకువస్తామని...వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని మోదీ చెప్పారు. టెర్రరిస్టుల ఎజెండా ఎప్పటికీ విజయవంతం కాదని...వారిపై పోరాడాలన్న సంకల్పం మరింత ధృడమైందని ప్రధాని అన్నారు. దాడిలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుతూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. 

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..

పహల్గాం ఉగ్రదాడి అత్యంత హేయమైన చర్య అని రాష్ట్ర పత్రి అన్నారు.ఇదొక క్రూరమైన, అమానవీయ చర్యలను చెప్పారు. అమాయక పౌరులను చంపేయడం క్షమించరానిది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పోస్ట్‌ చేశారు.

సీఎం చంద్రబాబు..

టెర్రరిస్టుల దాడి ఘన తీవ్ర ఆవేదన కలిగించిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అమాయకులైన పర్యాటకులపై పాశవిక చర్యను ఆయన తీవ్రంగా ఖండించారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ తెలిపారు. 

సీఎం రేవంత్ రెడ్డి..

పహల్గామ్ అటాక్ ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దుశ్చర్యగా అభివర్ణించారు. ఇలాంటి దొంగదెబ్బ తో  భారతీయుల ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీయలేరని ఆయన చెప్పారు. ఈ దాులపై పరభత్వం వెంటనే చర్యలు తీసుకోవాని...వారి పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలని రేవంత్ కేంద్రాన్ని కోరారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని, గాయపడిన వారు తొందరగా కోలుకోవాలని ఆయన కోరారు. 

కిషన్ రెడ్డి..

ఉగ్రవాదుల దాడి తనను కలిచి వేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జాతి మొత్తం ఏకతాటిపై ఉంటుంది. అమాయక పౌరులపై ఉగ్రవాదుల దాడి పిరికిపంద చర్య అన్నారు. జమ్మూకశ్మీర్‌ ఉగ్రదాడి ఘటన పట్ల కలతచెందినట్లు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నా. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా అంటూ పోస్ట్ చేశారు. 

గజేంద్ర సింగ్ షెకావత్..

ఉగ్రదాడి ఒక పిరికిపంద చర్య అన్నారు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్. ఈ కిరాతక దాడికి పాల్పడిన వారు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. 

today-latest-news-in-telugu | jammu | terror-attack | leaders | pm modi 

Also Read: ’పేరు, మతమేంటిని అడిగి.. ముస్లింలు కానివారిని కాల్చి చంపేశారు‘

Advertisment
Advertisment
Advertisment