/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/us-jpg.webp)
America: అమెరికాలో ఇద్దరు తెలుగు అమ్మాయిలు అరెస్టు అయ్యారు. షాప్‌లో దొంగతనం చేస్తూ పట్టుబడ్డారు. 27 వస్తువులు కొని 155 డాలర్లకు కేవలం 8.74 డాలర్లు మాత్రమే చెల్లించారని తెలుస్తోంది. సీసీ ఫుటేజీలో రికార్డయిన షాప్ లిఫ్టింగ్ దృశ్యాలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. గత నెల 19న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Also Read: ఈ కీటకాలు పాములకంటే ప్రమాదకరమైనవి.. వీటికి దూరంగా ఉండటం మంచిది..!
హైదరాబాద్.. గుంటూరుకు చెందిన ఈ ఇద్దరు అమ్మాయిలు ఉన్నత విద్య కోసం న్యూజెర్సీకి వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే, మన దేశంలో లాగా అక్కడ బిల్లింగ్ ఉండదట. మనం కొన్న వస్తువులకు మనమే QR కోడ్ స్కాన్ చేసి బిల్లింగ్ వేసుకోవాలట. అయితే, వీరిద్దరు సొంతంగా బిల్లింగ్ చేసుకోవాల్సి రావడం వల్ల హడావిడిలో మరిచిపోయారని వారు వాపోతున్నారు. అందుకు తగ్గట్టూ మరిచిపోయిన వస్తువులకు డబుల్ నగుదు చెల్లించారని..అయినప్పటికి వారు చేసింది తప్పేనని పోలీసులు వారిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.