Karnataka: టెన్త్ , ఇంటర్ లో సమాన మార్కులు సాధించిన కవలలు..ఇది ఎలా సాధ్యం అంటే! సాధారణంగా కవలలు అంటే పోలికలు, వారు చేసే పనులు ఒకేలా ఉంటాయి. కానీ ఇలా మార్కులు కూడా సేమ్ టు సేమ్ రావడంతో కాలేజీ యాజమాన్యం, కుటుంబ సభ్యులు అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటకకు చెందిన చుక్కి, ఇబ్బనిచంద్ర కు 600 మార్కులకు గాను 571 మార్కులు వచ్చాయి. By Bhavana 13 Apr 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Karnataka Twin Sisters Score Same Marks: ఈ ఏడాది పీయూసీ ఇంటర్ పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. ఎప్పటిలాగే ఈ ఫలితాల్లో మరోసారి బాలికలు తమ సత్తాను చాటారు. ఈ ఏడాది ఇంటర్ పరీక్షల్లో ఓ అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. కర్ణాటకలోని హసన్ ప్రాంతానికి చెందిన చుక్కి, ఇబ్బనిచంద్ర అనే కవలలకు పీయూసీ ఇంటర్ పరీక్ష (PUC Exam) ఫలితాల్లో ఒకే మార్కులు వచ్చి అందర్ని ఆశ్చర్య పరిచారు. సాధారణంగా కవలలు అంటే పోలికలు, వారు చేసే పనులు ఒకేలా ఉంటాయి. కానీ ఇలా మార్కులు కూడా సేమ్ టు సేమ్ రావడంతో కాలేజీ యాజమాన్యం, కుటుంబ సభ్యులు అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చుక్కి, ఇబ్బనిచంద్ర కు 600 మార్కులకు గాను 571 మార్కులు వచ్చాయి. ఇక్కడ మరో విశేషం కూడా ఉంది. వీరికి పదో తరగతి ఫలితాల్లో కూడా 625 మార్కులకు గాను 620 మార్కులు వచ్చాయి. దీంతో రెండు సార్లు కీలకమైన ఫలితాల్లో సమానమైన మార్కులు ఎలా వచ్చాయే తమకే అర్ధం కావడం లేదని చుక్కి, ఇబ్బనిచంద్ర అనే కవలలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. Also read: తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్ పై కీలక అప్‌డేట్ .. ఆ తరువాతే ఫలితాలు! #karnataka మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి