TTD : టీటీడీ కీలక నిర్ణయం.. మహిళా భక్తులకు మంగళసూత్రాలు..లక్ష్మీకాసులు..!!

టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది. రూ. రూ.5141.74 కోట్లతో టీటీడీ వార్షిక బడ్జెట్ కు ఆమోద ముద్ర తెలపడంతోపాటు హిందూ ధార్మిక ప్రచారంలో భాగంగా బంగారు మంగళ సూత్రాలు, లక్ష్మీ కాసులు భక్తులకు విక్రయించాలని టీటీడీ నిర్ణయించింది.

New Update
TTD : టీటీడీ కీలక నిర్ణయం.. మహిళా భక్తులకు మంగళసూత్రాలు..లక్ష్మీకాసులు..!!

TTD :  టీటీడీ పాలక మండలి పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. మొత్తం రూ. 514.74కోట్లతో టీటీడీ వార్షిక బడ్జెట్(Annual budget of TTD) కు  ఆమోదం తెలిపింది. హిందూ ధార్మిక ప్రచారం(Hindu Charitable Campaign)లో భాగంగా బంగారు మంగళ సూత్రాలు, లక్ష్మీ కాసులు భక్తులకు విక్రయించాలని నిర్ణయించింది. టీటీడీ (TTD)ఉద్యోగుల ఇళ్ల స్థలాల్లో గ్రావెల్ రోడ్డు నిర్మాణానికి ఆమోదం తెలిపింది. లడ్డు ట్రే మోసే కార్మికుల వేతనాలు రూ. 15వేలు అదనంగా పెంచుతూ టీటీడీ పాలక మండలి(Governing Council of TTD) నిర్ణయం తీసుకుంది.

టీటీడీ తీసుకున్న కీలక నిర్ణయాలు :

తిరుమల తిరుపతి దేవాస్థానం బోర్డు సమావేశంలో భక్తుల కోసం కొన్ని ముఖ్య నిర్ణయాలను తీసుకున్నారు. ధర్మ ప్రచారంలో భాగంగా బంగారు డాలర్లు తరహాలో శ్రీవారి పాదాల చెంత ఉంచిన మంగళ సూత్రాలను భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తామని టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. మహిళల కోసం మంగళసూత్రాలు, లక్ష్మీకాసులను తయారు చేయించాలని నిర్ణయించారు. లాభాపేక్ష లేకుండా మంగళసూత్రాలు, లక్ష్మీ కాసులు విక్రయిస్తామని తెలిపారు. హైందవస్త్రీలకు ఈ మంగళసూత్రాలు, లక్ష్మీ కాసులు ఒక అమూల్యమైన కానుక అన్నారు. వేదపాఠశాల్లో 51మంది సంభావన అధ్యాపకుల వేతనాలు రూ. 34 వేల నుంచి రూ. 54 వేలకు పెంచాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.

నూతన పోస్టులు మంజూరు:
టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న 60 ఆలయాల్లో పనిచేసేందుకు నూతనంగా పోస్టుల మంజూరుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. 3,4,5వ తేదీల్లో ధార్మిక సదస్సును నిర్వహిస్తున్నామని టీటీడీ చైర్మన్ తెలిపారు.

ఆదాయంపై అంచనాలు :
టీటీడీలో ఒరాకిల్ ఫ్యూషన్ క్లౌడ్ సాఫ్ట్ వేర్ వినియోగానికి ఆమోదించారు. అన్నమయ్య భవన్ ఆధునీకరణకు రూ. 1.47 కోట్లు కేటాయించారు. 2024-25 లో హుండీ ఆదాయం రూ. 1611 కోట్లు వస్తుందని అంచనా వేసారు. బ్యాంకు డిపాజిట్ల వడ్డీల ద్వారా రూ. 1068.51 కోట్ల అంచనా వేసింది పాలకమండలి. లడ్డూ ప్రసాదం విక్రయాల ద్వారా రూ. 550కోట్లు వస్తాయని అంచనాల్లో చూపించారు. దర్శన టికెట్ల విక్రయాల ద్వారా రూ. 468కోట్లు అంచనా వేసారు. గదుల వసతి సౌకర్యం ద్వారా ర. 14కోట్లు పేర్కొన్నారు. కల్యాణ కట్ట ద్వారా రూ. 226.50కోట్ల ఆదాయం వస్తుందన్నారు. రూ 30కోట్లతో గోగర్భం ఆకాశగంగ వరకు నాలుగు వరుసల నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు.

ఇది కూడా చదవండి: ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్ లో బాలీవుడ్ భామల.. బ్యూటీ లుక్స్

Advertisment
Advertisment
తాజా కథనాలు