TTD: శ్రీవారి నిధులు పక్కదారి పడుతున్నాయి.. బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ తిరుమల శ్రీవారి నిధులు దారిమళ్లుతున్నాయని బీజేపీ తెలంగాణ మాజీ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ ఆరోపించారు. వేంకటేశ్వర స్వామికి భక్తులు సమర్పించే కానుకలను ధర్మప్రచారం కోసమే టీటీడీ వినియోగించాలని డిమాండ్ చేశారు. శనివారం తిరుమలలో ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. By Naren Kumar 02 Dec 2023 in ఆంధ్రప్రదేశ్ తిరుపతి New Update షేర్ చేయండి TTD: తిరుమల శ్రీవారి నిధులు దారిమళ్లుతున్నాయని బీజేపీ తెలంగాణ మాజీ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ ఆరోపించారు. శనివారం తిరుమలలో స్వామివారిని దర్శించుకున్న ఆయన స్థానికంగా మీడియాతో మాట్లాడారు. వేంకటేశ్వర స్వామికి భక్తులు సమర్పించే కానుకలను ధర్మప్రచారం కోసమే టీటీడీ వినియోగించాలని డిమాండ్ చేశారు. నగర అభివృద్ధికి ప్రభుత్వ లేదా నగరపాలక నిధులు ఉపయోగించాలని కోరారు. ఇది కూడా చదవండి: నకిలీ కరెన్సీ చలామణీకి యత్నం.. గుట్టు రట్టు చేసిన ఎన్‌ఐఏ భక్తుల విరాళాలను దైవ కార్యాలు, నిత్య కైంకర్యాల కోసమే ఉపయోగించాలని కోరారు. అంతేకాకుండా, తిరుపతిలోని ప్రాచీన నిర్మాణాల కూల్చివేత అంశాల్లో శ్రీవారి భక్తుల మనోభావాలను టీటీడీ తప్పకుండా గౌరవించి తీరాలని లక్ష్మణ్ స్పష్టం చేశారు. పార్వేట మండపాన్ని పునరుద్ధరించి నిర్మించే సమయంలో టీటీడీ పురావస్తు శాఖను సంప్రదించిందో లేదో వెంటనే భక్తులకు స్పష్టంగా చెప్పాలని ఈ సందర్భంగా లక్ష్మణ్ డిమాండ్ చేశారు. #ttd #bjp-laxman మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి