TSRTC: దసరా పండుగ వేళ తెలంగాణ ప్రజలకు శుభవార్త.. కీలక ప్రకటన చేసిన టీఎస్ఆర్టీసీ.. దసరా పండుగకు ప్రయాణికులను క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలను చేర్చేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ)(TSRTC) అన్ని ఏర్పాట్లు చేస్తోంది. బతుకమ్మ, దసరాకు సొంతూళ్లకు వెళ్లే వారి సౌకర్యార్థం 5,265 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని ప్లాన్ చేసింది. By Shiva.K 01 Oct 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి TSRTC Special Buses for Dasara: దసరా పండుగకు ప్రయాణికులను క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలను చేర్చేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ)(TSRTC) అన్ని ఏర్పాట్లు చేస్తోంది. బతుకమ్మ, దసరాకు సొంతూళ్లకు వెళ్లే వారి సౌకర్యార్థం 5,265 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని ప్లాన్ చేసింది. ఈ మేరకు టీఎస్ఆర్టీసీ ఎంపీ సజ్జనార్ ఒక ప్రకటన విడుదల చేశారు. అక్టోబర్ 13వ తేదీ నుంచి 25వ తేది వరకు ఈ ప్రత్యేక బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంచనున్నారు. ఈ బస్సుల్లో 536 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించారు. అక్టోబర్ 22న సద్దుల బతుకమ్మ, 23న మహార్ణవమి, 24 దసరా నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశముంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆయా రోజుల్లో అవసరాన్ని బట్టి మరిన్నీ ప్రత్యేక బస్సులను నడిపేందుకు ప్లాన్స్ వేస్తోంది టీఎస్ఆర్టీసీ. హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి రాష్ట్రం నలుమూలలతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ప్రధాన బస్టాండ్స్ అయిన ఎంజీబీఎస్, జేబీఎస్, సీబీఎస్‌తో పాటు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే కేపీహెచ్ బీ కాలనీ, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఉప్పల్ బస్టాండ్, దిల్‌సుఖ్ నగర్, ఎల్బీనగర్, ఆరాంఘర్, తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను నడపనున్నారు. పండుగ రోజుల్లో ఎంజీబీఎస్ - ఉప్పల్, ఎంజీబీఎస్ - జేబీఎస్, ఎంజీబీఎస్ - ఎల్బీనగర్ మార్గాల్లో ప్రతి 10 నిమిషాలకో సిటీ బస్సును అందుబాటులో ఉంచనున్నారు. అలాగే, అక్టోబర్ 21వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రెగ్యూలర్, స్పెషల్ సర్వీసులను ఎంబీజీఎస్ నుంచి కాకుండా వివిధ ప్రాంతాల నుంచి నడపాలని సంస్థ నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, మాచర్ల వైపునకు వెళ్లే బస్సులు సీబీఎస్ నుంచి బయలుదేరుతాయి. ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ వైపునకు వేళ్లేవి జేబీఎస్, పికెట్ నుంచి వెళ్తాయి. వరంగల్, హన్మకొండ, జనగామ, పరకాల, నర్సంపేట, మహబుబాబాద్, తొర్రూరు, యాదగిరిగుట్ట బస్సులు ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఉప్పల్ బస్టాండ్ నుంచి నడుస్తాయి. విజయవాడ, విజయనగరం, గుంటూరు, విశాఖపట్నం బస్సులు ఎల్బీనగర్ నుంచి బయలుదేరుతాయి. మిగతా సర్వీసులు యథావిధిగా ఎంజీబీఎస్ నుంచే నడుస్తాయి. సాధారణ ఛార్జీలే.. పండుగ వేళ నడిపే ప్రత్యేక బస్సుల్లోనూ సాధారణ ఛార్జీలను తీసుకోవడం జరుగుతుందని టీఎస్ఆర్టీసీ ప్రకటించింది. స్పెషల్ సర్వీసులకు ఒక్క రూపాయి కూడా అదనంగా వసూలు చేయబోరని స్పష్టం చేసింది టీఎస్ఆర్టీసీ. ప్రయాణికులను సురక్షితంగా గమ్యం చేర్చడమే తమ లక్ష్యం అని, అదనపు ఛార్జీలు తీసుకోబడవని ప్రకటనలో క్లియర్‌గా పేర్కొన్నారు. సజ్జనార్ ట్వీట్.. “బతుకమ్మ, దసరా పండుగలకు సొంతూళ్లకు వెళ్లే వారి కోసం 5,265 ప్రత్యేక బస్సులను నడపాలని టీఎస్ఆర్టీసీ ప్రణాళికలు సిద్దం చేసింది. అక్టోబర్ 13వ తేదీ నుంచి 25వ తేది వరకు ఈ ప్రత్యేక సర్వీసులు నడుస్తాయి. గత దసరాకు 4,280 ప్రత్యేక నడపగా.. అందులో 239 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ కల్పించాం. గతేడాది కంటే కూడా ఈ సారి దాదాపు 1000 (20 శాతం) బస్సులను అదనంగా నడుపుతున్నాం. ముందస్తు రిజర్వేషన్ సర్వీసులను కూడా 535కి పెంచాం. ప్రధానంగా హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచే ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశముండటంతో ఆ మేరకు ఏర్పాట్లు చేయడం జరిగింది. రెగ్యూలర్ సర్వీసుల మాదిరిగానే ప్రత్యేక బస్సులకు సాధారణ చార్జీలనే సంస్థ వసూలు చేస్తుంది. స్పెషల్ సర్వీసులకు ఒక్క రూపాయి కూడా అదనంగా వసూలు చేయడం లేదు. ప్రయాణికులను సురక్షితంగా గమ్యం చేర్చడమే లక్ష్యంగా సంస్థ అన్ని చర్యలు తీసుకుంది. ఈ ప్రత్యేక సర్వీసులను ఉపయోగించుకుని క్షేమంగా, సురక్షితంగా ప్రయాణికులకు గమ్యస్థానాలకు చేరుకోవాలని ప్రభుత్వ రంగ సంస్థైన టీఎస్ఆర్టీసీ కోరుతోంది.” అని టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనర్ ట్వీట్ చేశారు. ఈ ప్రత్యేక సర్వీసుల్లో ముందస్తు రిజర్వేషన్ కోసం సంస్థ అధికారిక వెబ్ సైట్ tsrtconline.inను సందర్శించాల్సి ఉంటుంది. ఇక దసరా స్పెషల్ సర్వీసులకు సంబంధించి పూర్తి సమాచారం కోసం టీఎస్‌ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని ఆర్టీసీ యాజమాన్యం సూచించింది. దసరా పండుగకు ప్రయాణికులను క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలను చేర్చేందుకు #TSRTC అన్ని ఏర్పాట్లు చేస్తోంది. బతుకమ్మ, దసరాకు సొంతూళ్లకు వెళ్లే వారి సౌకర్యార్థం 5265 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని ప్లాన్ చేసింది. అక్టోబర్ 13 నుంచి 25వ తేది వరకు ఈ ప్రత్యేక బస్సులు ప్రయాణికులకు… — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) October 1, 2023 Also Read: Telangana: అన్నీ చిలుక పలుకులే.. కొత్తగా ఆయన ఇచ్చేదేంది?.. ప్రధాని మోదీపై హరీశ్ రావు మార్క్ సెటైర్స్.. PM Modi: ఎన్నికల శంఖారావం పూరించిన ప్రధాని.. బీఆర్ఎస్, కాంగ్రెస్‌పై నెక్ట్స్ లెవల్ పంచ్‌లు.. #tsrtc #dasara-special-buses #tsrtc-dasara-special మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి