Karimnagar: నిలిచిపోయిన పందెం కోడి వేలం..ఎందుకంటే!

.కరీంనగర్‌ -సిరిసిల్ల బస్‌ లో దొరికిన పందెం కోడి మేటర్ గత నాలుగు రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద హాట్‌ టాపిక్‌ అయ్యింది. వేలం పాటలో ఎవరికి దక్కుతుందో అనుకున్న పందెం కోడి కాస్తా బ్లూ క్రాస్‌ అధికారుల చెంతకు చేరింది. దీంతో కథ సుఖాంతం అయ్యింది

New Update
Karimnagar: నిలిచిపోయిన పందెం కోడి వేలం..ఎందుకంటే!

Karimnagar: పిట్ట పిట్ట పోరు పిల్లి తీర్చిందనే సామెత మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా. సరిగా ఇప్పుడు అలాంటి సంఘటనే పందెం కోడి (padem kodi) విషయం లో జరిగింది. వేలం పాటలో ఎవరికి దక్కుతుందో అనుకున్న పందెం కోడి కాస్తా బ్లూ క్రాస్‌ అధికారుల చెంతకు చేరింది. దీంతో కథ సుఖాంతం అయ్యింది.

అసలేం జరిగిందంటే..కరీంనగర్‌ -సిరిసిల్ల (Karimnagar-sirisilla) బస్‌ లో దొరికిన పందెం కోడి మేటర్ గత నాలుగు రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో(Telugu States) పెద్ద హాట్‌ టాపిక్‌ అయ్యింది. ఆర్టీసీ అధికారులు (Rtc Officers) రెండు రోజుల పాటు చూసి కోడి కోసం ఎవరూ రాకపోయేసరికి మూడో రోజు ఆర్టీసీ అధికారులు వేలం పాట నిర్వహించారు.

ఇక్కడే అసలు ట్విస్ట్‌ బయటపడింది. పందెం కోడి నాదే అంటూ నెల్లూరు జిల్లాకు చెందిన మహేష్‌ అనే వ్యక్తి ఓ వీడియోతో మీడియా ముందుకు వచ్చాడు. వేలం పాట వేయోద్దని కోడిని తనకి అప్పగించాలంటూ పలు ఆధారాలతో సహా మహేష్‌ వీడియోని పోస్ట్‌ చేశారు.అయితే కోడి వేలాన్ని మాత్రం ఆపేది లేదని ఆర్టీసీ అధికారులు తెగేసి చెప్పారు.

కావాలంటే కోడి వేలంలో మహేష్‌ని కూడా పాల్గొనవలసిందిగా సూచించింది. దీంతో వివిధ ప్రాంతాల నుంచి సుమారు 20 మంది వ్యక్తులు వేలం పాటలో పాల్గొనడానికి వచ్చారు. మరో వైపు పశుసంరక్షణ చట్టం గురించి అధికారులు ఆర్టీసీ ఆఫీసర్లకు గుర్తు చేశారు. దీంతో వేలం రద్దు చేస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు ప్రకటించారు.

దీంతో ఆర్టీసీ అధికారులు పశుసంవర్థక శాఖ జోక్యంతో వేలం ఆగిపోయింది. దీంతో పందెం కోడి పశుసంరక్షక కేంద్రానికి చేరింది. సినిమా ట్విస్ట్‌ లను తలపించిన పందెం కోడి వేలం మొత్తానికి నిలిచిపోయింది.పందెం కోడిని అందుకున్న బ్లూ క్రాస్‌ సంస్థ అధికారులు ఆర్టీసీ అధికారులకు భరోసా ఇచ్చారు.

Also read: సంక్రాంతి రోజు ఈ పనులు చేయండి..పుణ్యమే కాదు.. సంపదతో ఇల్లు నిండుతుంది..!!

Advertisment
Advertisment
తాజా కథనాలు