/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-14-5-jpg.webp)
Pavani : టీఎస్ ఆర్టీసీ(TSRTC) యూనియన్ నాయకుడు రాజిరెడ్డి(Raji Reddy) ఇంటి గొడవ బజారుకెక్కింది. పెళ్లైన మూడోరోజు నుంచే తనను ఇంట్లోకి రానివ్వడంలేదంటూ రాజిరెడ్డి కోడలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఇంటి ముందు ధర్నాకు దిగింది.
బంగారం ఇవ్వట్లేదంటూ..
ఈ మేరకు గతేడాది మే 21న రాజిరెడ్డి కొడుకు కార్తీక్‌రెడ్డి(Karthik Reddy) కి పావనితో వివాహం జరిగింది. అయితే ఈ పెళ్లి కోసం రూ.30లక్షలు అప్పు చేశానంటున్న వాపోయిన పావని.. తనకు పుట్టింటివారు పెట్టిన బంగారం కూడా ఇవ్వడం లేదని ఆరోపణలు చేస్తోంది. తనకు తన భర్త కావాలని, న్యాయం చేయాలని డిమాండ్ చేస్తోంది.
నేతల పేర్లు చెప్పి బెదిరింపులు..
ఈ క్రమంలో పావని తమ ఇంటికి చేరుకోగానే ఇంటికి తాళం వేసి రాజిరెడ్డి కుటుంబ సభ్యులు బయటకు వెళ్లిపోగా.. పలువురు రాజకీయ నేతల పేర్లు చెప్పి బెదిరిస్తున్నారని పావని ఆవేదన చెందుతోంది. అంతేకాదు తన భర్త తన పక్కలోకి కూడా రావట్లేదని ఆందలోన చెందుతుంది. ఇక ఈ విషయం తెలుసుకొని అక్కడికి చేరుకున్న ఎల్బీనగర్ పోలీసులు(LB Nagar Police).. పావనికి న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇచ్చినట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి : Breaking: కేటీఆర్ పై క్రిమినల్ కేసు నమోదు..
సోరియాసిస్ విషయం చెప్పలేదు..
అయినప్పటికీ తనకు న్యాయం జరిగే వరకూ కదిలేది లేదంటూ భర్త ఇంటి ముందే బైఠాయించింది పావని. అయితే దీనిపై స్పందించిన రాజిరెడ్డి కోడలు పావనికి సోరియాసిస్ ప్రాబ్లం ఉందని చెబుతున్నారు. పెళ్లికి ముందు ఆ విషయం చెప్పకుండా తమను మోసం చేసిందన్నారు. ఆ కారణంతోనే తన కొడుకు ఆమెకు దూరంగా ఉంటున్నాడని తెలిపారు. కాగాఈ వివాదంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.