TSPSC: గ్రూప్-4 అభ్యర్థులకు అలర్ట్.. ! తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు పూర్తి కావడంతో ఉద్యోగాల భర్తీ పై టీఎస్పీఎస్సీ దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలోనే గ్రూప్-4 అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై టీఎస్పీఎస్సీ తాజాగా అప్డేట్ ఇచ్చింది. By Bhavana 17 May 2024 in జాబ్స్ Latest News In Telugu New Update షేర్ చేయండి TSPSC Group 4 Update: తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు పూర్తి కావడంతో ఉద్యోగాల భర్తీ పై టీఎస్పీఎస్సీ దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలోనే గ్రూప్-4 అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై టీఎస్పీఎస్సీ (TSPSC) తాజాగా అప్డేట్ ఇచ్చింది. గ్రూప్-4 ఉద్యోగాల భర్తీకి సంబంధించి త్వరలోనే అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. గ్రూప్-4 అభ్యర్థుల జనరల్ ర్యాంకింగ్ జాబితాను ఈ ఏడాది ఫిబ్రవరి 9న రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. జనరల్ అభ్యర్థులను 1:3 నిష్పత్తిలో, పీడబ్ల్యూడీ అభ్యర్థులను 1:5 నిష్పత్తిలో పిలవనున్నారు. అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్లు సిద్ధం చేసుకొని పెట్టుకోవాలని టీఎస్పీఎస్సీ సూచించింది. కమ్యూనిటీ, నాన్ క్రిమిలేయర్, స్టడీ సర్టిఫికేట్స్(1వ తరగతి నుంచి ఏడు వరకు), రిజర్వేషన్ కలిగి ఉంటే దానికి సంబంధించిన సర్టిఫికెట్లు, ఏజ్ రిలాక్సేషన్, క్వాలిఫికేషన్ సర్టిఫికెట్లు అందుబాటులో ఉంచుకోవాలని టీఎస్పీఎస్సీ సూచిచింది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ సమయంలో ఏ సర్టిఫికెట్ లేకున్నా రిజెక్ట్ అవుతారు. అదనపు టైమ్ ఇవ్వడం ఉండదని టీఎస్పీఎస్సీ తెలిపింది. Also Read: రాత్రి 8 లోపు నగరంలో భారీ వర్షం! #telangana #tspsc-group-4 #tspsc సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి