TSPSC Group-1 Exam: గ్రూప్-1 పరీక్ష రద్దుతో అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన.. టీఎస్పీఎస్సీ నెక్ట్స్ స్టెప్ ఇదే? తెలంగాణలో జూన్ 11న నిర్వహించిన గ్రూప్-1 పరీక్షను హైకోర్టు రద్దు చేయడంతో అభ్యర్థులు తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు. ఈ నేపథ్యంలో తీర్పుపై డివిజన్ బెంచ్ కు అప్పీలు చేయాలని కమిషన్ భావిస్తోంది. By Nikhil 24 Sep 2023 in జాబ్స్ తెలంగాణ New Update షేర్ చేయండి తెలంగాణలో ఈ ఏడాది జూన్ 11న నిర్వహించిన గ్రూప్-1 పరీక్షను (TSPSC Group-1 Exam) హైకోర్టు నిన్న రద్దు చేసిన విషయం తెలిసిందే. గతంలోనూ పేపర్ లీకేజీ కారణంగా ఓసారి పరీక్ష రద్దు అయ్యింది. రెండు సార్లు పరీక్ష రద్దు కావడంతో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. అనేక వ్యయప్రయాసలకు ఓర్చుకుని.. కుటుంబాన్ని వదులుకుని ఏళ్లుగా గ్రూప్-1 ఉద్యోగ సాధనే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్న వారి ఆవేదన వర్ణనాతీతంగా మారింది. ఇప్పటికే తాము చేస్తున్న ఉద్యోగాలకు ఏళ్లుగా సెలవు పెట్టి ప్రిపేర్ అవుతున్నామని.. మళ్లీ నెలల పాటు సెలవులు ఎలా పెట్టాలని వారు ఆదేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే.. పరీక్షను హైకోర్టు రద్దు చేయడంపై టీఎస్పీఎస్సీ (TSPSC) సైతం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పుపై డివిజన్ బెంచ్ కు అప్పీలు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు కమిషన్ న్యాయనిపుణలతో చర్చలు ప్రారంభించింది. ఆలస్యం చేయకుండా సోమవారమే టీఎస్పీఎస్సీ హైకోర్టులో అప్పీలు దాఖలు చేయనున్నట్లు కమిషన్ వర్గాలు వెల్లడించాయి. తెలంగాణలో దాదాపు 11 ఏళ్ల తర్వాత గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదలైంది. ఉమ్మడి రాష్ట్రంలో చివరిసారిగా 2011లో గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదలైంది. గతేడాది 2022 ఏప్రిల్ 26న 503 గ్రూప్-1 పోస్టుల భర్తీకి గాను తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. భారీగా పోస్టులు ఉండడంతో దరఖాస్తులు కూడా భారీగా వచ్చాయి. మొత్తం 3.80 లక్షల మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ప్రిలిమ్స్ ను అదే ఏడాది అక్టోబర్ 16న నిర్వహించింది పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఈ పరీక్షకు 2.85 లక్షల మంది హాజరుకాగా.. ఫలితాను కూడా ప్రకటించారు. మొత్తం 25 వేల మంది అభ్యర్థులను మెయిన్స్ కు ఎంపిక చేశారు. అనూహ్యంగా పేపర్ లీకేజీ వ్యవహారం బయటపడడంతో ఆ పరీక్షను రద్దు చేయాల్సి వచ్చింది. అనంతరం జూన్ 11న ప్రిలిమ్స్ పరీక్షను మళ్లీ నిర్వహించింది టీఎస్పీఎస్సీ. ఈ సారి పరీక్షకు 2.33 లక్షల మంది హాజరయ్యారు. వారంతా ఫలితాల కోసం వేచి చూస్తున్న సమయంలో హైకోర్టు పరీక్షను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ప్రకారం.. అభ్యర్థులంతా పరీక్షకు హాజరైన సమయంలో బయోమెటిక్ర్ విధానం ద్వారా ఫొటో, బొటనవేలి ముద్రలు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే.. రెండో సారి పరీక్ష నిర్వహించిన సమయంలో టీఎస్పీఎస్సీ ఈ నింబంధన పాటించకపోవడంతో పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించడంతో పరీక్షను రద్దు చేసింది ధర్మాసనం. ఇది కూడా చదవండి: TRT 2023: తెలంగాణ టీఆర్టీ అభ్యర్థులకు కొత్త టెన్షన్.. ఆ సమస్య పరిష్కారం ఎలా? #tspsc #telangana-government-jobs #group మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి