TS TET 2023: టెట్ ఫలితాలపై గందరగోళం.. అభ్యర్థుల ఆందోళన...!! తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TSTET)ఫలితాల్లో ఈసారి ఉత్తీర్ణత శాతం బాగా తగ్గింది. కేవలం 84శాతం మంది అభ్యర్థులు ఫెయిల్ అయ్యారు. దీంతో ఓఎంఆర్ షీట్లు ఆన్ లైన్లో పెట్టాలంటూ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టెట్ ప్రాథమిక కీలో వచ్చిన అభ్యంతరాలను శాస్త్రీయంగా చూడకపోవడం, ఫైనల్ కీ ని ఆలస్యంగా వెబ్ సైట్లో ఉంచడం పట్ల టెట్ రాసిన అభ్యర్థులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రాథమిక కీ చూసుకుని పాస్ గ్యారెంటీ అనుకున్నవాళ్లంతా ఇప్పుడు ఫెయిల్ అవ్వడంతో మరిన్ని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. By Bhoomi 29 Sep 2023 in జాబ్స్ తెలంగాణ New Update షేర్ చేయండి తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TSTET)ఫలితాల్లో ఈసారి ఉత్తీర్ణత శాతం బాగా తగ్గింది. కేవలం 84శాతం మంది అభ్యర్థులు ఫెయిల్ అయ్యారు. దీంతో ఓఎంఆర్ షీట్లు ఆన్ లైన్లో పెట్టాలంటూ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టెట్ ప్రాథమిక కీలో వచ్చిన అభ్యంతరాలను శాస్త్రీయంగా చూడకపోవడం, ఫైనల్ కీ ని ఆలస్యంగా వెబ్ సైట్లో ఉంచడం పట్ల టెట్ రాసిన అభ్యర్థులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రాథమిక కీ చూసుకుని పాస్ గ్యారెంటీ అనుకున్నవాళ్లంతా ఇప్పుడు ఫెయిల్ అవ్వడంతో మరిన్ని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రాథమిక కీలో ఇచ్చన ఆన్సర్ ఆప్షన్స్ తుది కీ వచ్చేనాటికి మార్చడం కూడా ఈ పరిస్థితికి కారణమని అభ్యర్థులు అంటున్నారు. ప్రాథమిక కీలో వచ్చిన అభ్యంతరాలు నిజమైతే...సాధారణంగా రెండు ఆఫ్షన్స్ ఇస్తారని...కానీ ఇప్పుడు అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని వాపోతున్నారు. ఆప్షన్ మార్చడం వల్ల కొంతమంది అభ్యర్థులు 5 మార్కులు కోల్పోయినట్లు ఆరోపిస్తున్నారు. ఒక మార్కు తక్కువై అర్హత సాధించలేని వారు 50వేల మంది ఉన్నారని అధికారవర్గాలు చెబుతున్నాయి. గోప్యతపై అభ్యర్థుల్లో ఎన్నో అనుమానాలు: తుది కీని ఆలస్యంగా వెబ్ సైట్లో ఉంచిన అధికారులు...ఫలితాల వెల్లడి సందర్భంగా ఎలాంటి విషయంపై స్పష్టత ఇవ్వలేదు. అసలు ప్రాథమిక కీలో ఎలాంటి అభ్యంతరాలు ఉన్నాయి. దానిలో ఏవి పరిగణలోనికి తీసుకన్నారు. ఎందులో మార్పులు చేశారనే సమాచారం ఇప్పటివరకు వెల్లడించనేలేదు. దీంతో పరీక్ష రాసిన అభ్యర్థులు ఓఎంఆర్ షీట్లను ఆన్ లైన్లో ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్లను వెల్లడించేందుకు టెట్ కన్వీనర్ ను కలిసినా ఎలాంటి ప్రయోజనం లేదని మండిపడ్డారు. ఇది కూడా చదవండి: కర్నాటకలో బంద్ ప్రభావం..పాఠశాలలు మూసివేత, 44 విమానాలు రద్దు..!! కాగా ఈ విషయం గురించి విద్యాశాఖమంత్రి కలిసి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు అభ్యర్థులు. అటు అధికారవర్గాల నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి. సమన్వయ లోపంతోనే ఇలా జరిగిందంటూ చెబుతున్నారు. టెట్ కన్వీనర్ ఏకపక్ష ధోరణితో వ్యవహారించారని...తాము చెప్పింది అసలు వినిపించుకోలేదని అధికారులు అంటున్నారు. మంత్రి కార్యాలయం నుంచి వచ్చిన సూచలను కూడా పక్కనపెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయంటున్నారు. మొత్తంగా టెట్ నిర్వహణ తీరుపై అభ్యర్థుల్లో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇది కూడా చదవండి: రోజుకు ఏ వయస్సు వారు ఎన్ని గంటలు నిద్ర పోవాలో తెలుసా? రాష్ట్రవ్యాప్తంగా టెట్ పరీక్షకు 2,08,499 మంది దరఖాస్తు చేసుకోగా 1,90,047మంది పరీక్షకు హాజరయ్యారు. అందులో ఉత్తీర్ణత సాధించింది కేవలం 29,073 మంది మాత్రమే. జనరల్ కేటగిరిలో ఎన్నడూ లేనివిధంగా ఫలితాలు వచ్చాయి. కేవలం 563మంది మాత్రమే పాస్ అయ్యారు. అంటే 3.65శాతం ఉత్తీర్ణత నమోదు అయ్యింది. జనరల్ కేటగిరిలో 150 మార్కులకు 90 మార్కులు వస్తేనే టెట్ లో అర్హత సాధించినట్లు. ఈ కారణంగా చాలా మంది అభ్యర్థులు ఫెయిల్ అయినట్లు చెబుతున్నారు. #ts-tet #ts-tet-2023 #ts-tet-results-2023 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి