TS TET-2023: తెలంగాణ టెట్ పరీక్షకు హాజరైన వారికి బిగ్ అలర్ట్.. కీలక ప్రకటన.. వివరాలివే! తెలంగాణ టెట్ పరీక్షకు సంబంధించిన ప్రైమరీ కీని అధికారులు తాజాగా విడుదల చేశారు. కీపై అభ్యంతరాలను ఈ నెల 23లోగా సమర్పించాలని సూచించారు. By Nikhil 21 Sep 2023 in జాబ్స్ తెలంగాణ New Update షేర్ చేయండి తెలంగాణలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TS TET-2023)ను ఈ నెల 15న నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ పరీక్షకు సంబంధించిన ప్రైమరీ కీని తాజాగా విడుదల చేశారు అధికారులు. అభ్యర్థులు ప్రైమరీ కీపై అభ్యంతరాలను వ్యక్తం చేసే అవకాశం కల్పించారు అధికారులు. ఈ నెల 23వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా తమ అభ్యంతరాలను అభ్యర్థులు తెలియజేయాలని టెట్ కన్వీనర్ రాధారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో https://tstet.cgg.gov.in/ అధికారిక వెబ్ సైట్ లో తమ అభ్యంతరాలను తెలియజేయాల్సి ఉంటుంది. అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి తుది కీని విడుదల చేయనున్నారు. ఫలితాలను ఈ నెల 27న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నెల 25 లేదా 26 తేదీల్లో ఫైనల్ కీ విడుదల చేసే అవకాశం ఉంది. తెలంగాణ టెట్-2023 ప్రైమరీ కీ డైరెక్ట్ లింక్-Link అలా కుదరకపోతే ఫలితాలతో పాటే ఫైనల్ కీని విడుదల చేస్తారు. తెలంగాణలో మరో వైపు టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ కు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ సాగుతోంది. టెట్ లో అర్హత సాధించిన వారే టీఆర్టీకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇదిలా ఉంటే.. టెట్ పరీక్ష పేపర్-1 కు మొత్తం 2, 26,744 మంది దరఖాస్తు చేసుకోగా.. 2,26,744 మంది హాజరయ్యారు. అంటే 84.12 శాతం మంది హాజరయ్యారు. పేపర్-2కు సంబంధించి 91.11 శాతం హాజరు నమోదైంది. ఇదిలా ఉంటే.. తెలంగాణలో దాదాపు 7 లక్షలకు పైగా అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న గ్రూప్-4 ఫలితాలపై (tspsc group-4) కూడా కీలక అప్టేట్ వచ్చేసింది. ఈ రిజల్ట్స్ ను అక్టోబర్ లో విడుదల చేయాలని టీఎస్పీఎస్సీ (tspsc) ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఫైనల్ కీని మరో పది రోజుల్లో విడుదల చేయాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ప్రైమరీ కీని విడుదల చేసి అభ్యంతరాలను స్వీకరించిన టీఎస్పీఎస్సీ తాజాగా ఫైనల్ కీని రూపొందించడంలో కసరత్తు ముమ్మరం చేసింది. #telangana-government-jobs #ts-tet-2023 #teachers-recruitment మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి