TS RTC: టీఎస్ఆర్టీసీ అదిరిపోయే శుభవార్త.. హైదరాబాద్-విజయవాడ రూట్ ప్రయాణికులకు భారీ ఆఫర్! హైదరాబాద్-విజయవాడ రూట్ లో ప్రయాణించేవారికి టీఎస్ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ఈ మార్గంలో ప్రతిరోజు 120కి పైగా బస్సులను నడుపుతుండగా ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సును అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. అప్ అండ్ డౌన్ రిజర్వేషన్ టికెట్ పై 10 శాతం డిస్కౌంట్ కల్పించింది. By srinivas 29 Apr 2024 in ఆంధ్రప్రదేశ్ తెలంగాణ New Update షేర్ చేయండి TS RTC: టీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్-విజయవాడ రూట్ లో వెళ్లే వారికోసం ప్రతి 10 నిమిషాలకు ఒక (TSRTC) బస్సును అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. హైదరాబాద్-విజయవాడ రూట్ లో వెళ్లే ప్రయాణికుల కోసం ప్రతి 10 నిమిషాలకో బస్సును #TSRTC అందుబాటులో ఉంచింది. ఆ మార్గంలో ప్రతిరోజు 120కి పైగా బస్సులను సంస్థ నడుపుతోంది. అందులో లహరి ఏసీ స్లీపర్ 2, నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్ 2, ఈ-గరుడ 10, గరుడ ప్లస్ 9, రాజధాని 41, సూపర్ లగ్జరీ 62… pic.twitter.com/nvG8kzoaRH — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) April 27, 2024 ఈ మేరకు 'ఈ మార్గంలో ప్రతిరోజు 120కి పైగా బస్సులను సంస్థ నడుపుతోంది. అందులో లహరి ఏసీ స్లీపర్ 2, నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్ 2, ఈ-గరుడ 10, గరుడ ప్లస్ 9, రాజధాని 41, సూపర్ లగ్జరీ 62 బస్సులున్నాయి. ఈ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ చేసుకునే వారికి 10 శాతం రాయితీని సంస్థ కల్పించింది. తిరుగుప్రయాణ టికెట్ పై ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది. టీఎస్ఆర్టీసీ బస్సుల్లో అడ్వాన్స్ డ్ రిజర్వేషన్ కోసం అధికారిక వెబ్ సైట్ http://tsrtconline.in ని సంప్రదించండి' అంటూ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పోస్ట్ షేర్ చేశారు. #hyderabad-vijayawada #ts-rtc మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి