BJP Politics: బీజేపీలో అసంతృప్తి జ్వాల.. అమిత్‌షాపై అలిగిన నేతలు.. ఎవరంటే?

తెలంగాణ బీజేపీలో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాపై పలువురు కీలక బీజేపీ నేతలు అలిగారు. రాష్ట్ర విమోచన దినోత్సవ సందర్భంగా హైదరాబాద్‌కు వచ్చిన అమిత్‌షాపై కేవలం కిషన్ రెడ్డి, బండి సంజయ్‌, ఈటలను కలవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నేతలు. ఈ లిస్ట్‌లో మాజీ ఎంపీ వివేక్‌ వెంకటస్వామి, విజయశాంతి, కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి కూడా ఉన్నారు.

New Update
BJP Politics: బీజేపీలో అసంతృప్తి జ్వాల.. అమిత్‌షాపై అలిగిన నేతలు.. ఎవరంటే?

తెలంగాణ బీజేపీ ఇంట్లో ఏ నలుగురి మధ్య సఖ్యత ఉన్నట్టే కనిపించడంలేదు. ఎప్పుడూ చూసిన అలకలు, ఏడుపులు, పెడార్థలే కనిపిస్తున్నాయి. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నా ఇప్పటివరకు ఒకే తాటిపైకి రాలేదు సీనియర్లు. బండి సంజయ్‌, కిషన్‌రెడ్డి వర్గాల లొల్లి సమిసిపోయిందని అలా అనుకున్నారో లేదో మరో సమస్య ఇలా దర్శనమిస్తోంది. తాజాగా తెలంగాణ బీజేపీలో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడినట్టు కనిపిస్తున్నాయి. ఈసారి తెలంగాణ లీడర్ల అలక కిషన్‌రెడ్డిపైనో.. బండి సంజయ్‌పైనో కాదు.. ఏకంగా కేంద్ర హోంమంత్రి అమిత్‌షాపైనా. రాష్ట్ర విమోచన దినోత్సవ సందర్భంగా హైదరాబాద్‌కు వచ్చిన అమిత్‌షాపై పలువురు బీజేపీ నేతలు అలిగారు.

మమ్మల్ని కలవలేదు.. ప్చ్‌..!
మాజీ ఎంపీ వివేక్‌ వెంకటస్వామి ఇంట్లో అసంతృప్త నేతల సమావేశమయ్యారు. ఈ మీటింగ్‌కి విజయశాంతి, కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి హాజరయ్యారు. చాడ సురేష్‌ రెడ్డి, గరికపాటి మోహన రావు, ఏనుగు రవీందర్ రెడ్డి, రవీంద్ర నాయక్‌, విజయ రామారావు ఈ మీటింగ్‌కి వచ్చారు. అధిష్టానం వ్యవహరశైలిపైనే ప్రధానంగా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. హైదరాబాద్‌కి వచ్చిన అమిత్ షా కేవలం కిషన్ రెడ్డి, బండి సంజయ్‌, ఈటలను కలవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నేతలు. తమతో పాటే పార్టీలోకి వచ్చిన ఈటలకు అధిక ప్రాధాన్యతపై అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. నియోజకవర్గాల్లో చేరికలపై సీనియర్లను సంప్రదించకపోవడంపైనా ఆవేదన చెందుతున్నట్టు ప్రచారం జరుగుతోంది.

నెక్ట్స్ ఏం జరగబోతోంది?
మరోవైపు ములుగు నుంచి మాజీ మంత్రి చందూలాల్‌ కొడుకు సంగారెడ్డిలో పులిమామిడి రాజు చేరికలపై ఆగ్రహంగా ఉన్నారు సీనియర్లు. సంప్రదింపులు లేకుండా చేర్చుకుంటున్నారని నియోజకవర్గ నేతల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 24న మరోసారి భేటీ కావాలని నిర్ణయించుకున్నారు. అటు ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలోనూ తెలంగాణ బీజేపీ నేతల్లో సఖ్యత, ఐక్యత లేకపోవడం పట్ల కార్యకర్తల్లో ఆనందం కరువైంది. ఇక వివేక్‌ వెంకటస్వామి, విజయశాంతి బీజేపీని విడుతారన్న ప్రచారం కూడా జరుగుతోంది. నిన్నటివరకు కేవలం వివేక్‌ ఒక్కరిపైనా ఈ తరహా ప్రచారం జరగగా.. తాజాగా సోనియాగాంధీని పొగుడుతూ విజయశాంతి చేసిన ట్వీట్ బీజేపీ వర్గాల్లో కాక రేపింది. ఆమె కూడా కాంగ్రెస్‌ కండువా కుప్పుకుంటారన్న ప్రచారం జరుగుతోంది.

ALSO READ: కాంగ్రెస్ గ్యారంటీలతో బీఆరెస్ నేతలు కకావికాలం..!!

Advertisment
Advertisment
తాజా కథనాలు