TS Politics: రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఫిక్స్.. ఆ రోజున రాహుల్ అపాయిట్మెంట్?

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ నెల 25న హస్తం గూటికి చేరనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రాహుల్ అపాయిట్మెంట్ కూడా ఫిక్స్ అయినట్లు సమాచారం. మునుగోడు నుంచి రాజగోపాల్ రెడ్డికి టికెట్ ఇచ్చేందుకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.

New Update
TS Politics: రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఫిక్స్.. ఆ రోజున రాహుల్ అపాయిట్మెంట్?

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) బీజేపీని వీడడం దాదాపు ఖయమైనట్లు తెలుస్తోంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా ఈ ప్రచారం జోరుగా సాగుతున్నా.. ఆయన ఎక్కడా ఖండిచలేదు. అంతే కాకుండా.. కాంగ్రెస్ నుంచి మునుగోడులో (Munugodu) పోటీ చేయాలని తనపై కార్యకర్తల నుంచి ఒత్తిడి వస్తుందంటూ.. తనను కలిసిన మీడియా ప్రతినిధులకు ఆయన చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఆయన పార్టీ మారడం కన్ఫామ్ అయిందని తెలుస్తోంది. ఈ నెల 25న రాజగోపాల్ రెడ్డి రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు రాహుల్ గాంధీ అపాయిట్మెంట్ కూడా ఫిక్స్‌ అయినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Big Breaking: కాంగ్రెస్ లోకి వివేక్, రాజగోపాల్ రెడ్డి?

రాజగోపాల్ రెడ్డి చేరిన తర్వాత రోజు.. అంటే ఈ నెల 26న కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ విడుదలయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఆయనకు మునుగోడు టికెట్ ఇవ్వడానికి కాంగ్రెస్ హైకమాండ్ ఓకే చెప్పినట్లు కూడా సమాచారం. రాజగోపాల్ రెడ్డి తరఫున ఆయన సోదరుడు వెంకట్ రెడ్డి ఢిల్లీ పెద్దలతో ఈ మేరకు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

రాజగోపాల్ రెడ్డి చేరికకు ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, దామోదర్ రెడ్డి తదితర సీనియర్ నేతలు కూడా ఓకే చెప్పిడంతో లైన్ క్లీయర్ అయినట్లు కాంగ్రెస్ వర్గాల నుంచి సమాచారం. రాజగోపాల్ రెడ్డి పార్టీ వీడడంతో వచ్చిన మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన పాల్వాయి స్రవంతి మాత్రం ఈ పరిణామాలపై సీరియస్ అవుతున్నట్లు సమాచారం. రాజగోపాల్ రెడ్డి చేరికను ఆమె తీవ్రంగా వ్యతిరేకించే అవకాశం ఉంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు