TS Politics: కష్టపడి గెలిపిస్తే.. నన్ను కోదాడ ఎమ్మెల్యే ఏం చేశాడో తెలుసా?: చందర్ రావు ఇంటర్వ్యూ

గత ఎన్నికల సమయంలో తాను కష్టపడి మల్లయ్య యాదవ్ ను గెలిపిస్తే.. గెలిచిన తర్వాత తనను తీవ్ర అవమానాలకు గురి చేశాడని మాజీ ఎమ్మెల్యే చందర్ రావు ఆరోపించారు. తన లాంటి నిజాయితీ పరులు బీఆర్ఎస్ పార్టీకి అవసరం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీవీతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు.

New Update
TS Politics: కష్టపడి గెలిపిస్తే.. నన్ను కోదాడ ఎమ్మెల్యే ఏం చేశాడో తెలుసా?: చందర్ రావు ఇంటర్వ్యూ

బీఆర్ఎస్ కు కోదాడ మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు (Kodada Ex.MLA Chandar Rao) రాజీనామా చేశారు. నిన్న ఆయన కాంగ్రెస్ లో చేరిపోయారు కూడా. ఈ సందర్భంగా ఆర్టీవీతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. 2018లో కష్టపడి మల్లయ్య యాదవ్ ను (Bollam Mallaiah Yadav) కోదాడ ఎమ్మెల్యేగా గెలిపించామన్నారు. అయితే.. గెలిచిన తర్వాత ఫ్లెక్సీలో తన ఫొటో కూడా లేకుండా చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో సంక్షేమ పథకాల అమలులో అనేక అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ఈ విషయాలను మంత్రులు, అధిష్టానానికి చెప్పినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితిని తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడలేదన్నారు. తాను పార్టీలోకి తీసుకువచ్చిన వారందరినీ ఎమ్మెల్యే పక్కన పెట్టారన్నారు.
ఇది కూడా చదవండి: Pilot Rohith Reddy: అమ్ముడు పోయిన కొడుకుల్లారా.. మిమ్ముల్ని వదలం: రోహిత్ రెడ్డి వార్నింగ్

గెలిచిన ఎంపీపీలు, జడ్పీటీసీలను ఏడిపించాడన్నారు. దళితబంధులో కూడా ఎమ్మెల్యే డబ్బులు తిన్నాడన్నారు. ఒక రాజు మాదిరిగా పని చేసి కోట్ల రూపాయలు సంపాధించాడని తీవ్ర ఆరోపణలు చేశారు. డబ్బుల బాగా సంపాధించి, వాటిని ఖర్చు పెట్టే వారే బీఆర్ఎస్ పార్టీకి కావాలన్నారు. తన లాంటి నిజాయితీ పరులు పార్టీకి అవసరం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 8-10 సీట్లు కాంగ్రెస్ కు వచ్చే అవకాశం ఉందని చెప్పారు చందర్ రావు. ఆయన ఇంకా ఏమన్నారో ఈ కింది వీడియోలో చూడండి.

Advertisment
Advertisment
తాజా కథనాలు