TS MLC Elections 2024 : నేనే గెలవబోతున్నా..: రాకేష్ రెడ్డి సంచలన ఇంటర్వ్యూ

ఈ రోజు జరుగుతున్న నల్గొండ-ఖమ్మం-వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన గెలుపు ఖాయమని బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అన్ని పార్టీల మద్దతు తనకే ఉందని.. కౌంటింగ్ రోజు ఈ విషయం స్పష్టం అవుతుందన్నారు. ఆర్టీవీతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు.

New Update
TS MLC Elections 2024 : నేనే గెలవబోతున్నా..: రాకేష్ రెడ్డి సంచలన ఇంటర్వ్యూ

Rakesh Reddy : పట్టభద్రులు (Graduates) ప్రతిభకే పట్టం కడతారని.. ప్రశ్నించేవారనే కోరుకుంటారని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బీఆర్ఎస్ (BRS) అభ్యర్థి రాకేష్ రెడ్డి అన్నారు. తన గెలుపు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. హన్మకొండ (Hanamkonda) లోని పింగిళి మహిళా కళాశాలలో ఈ రోజు ఆయన ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఓటర్లు (Voters) పార్టీతో పాటు అభ్యర్థుల గత చరిత్రన కూడా పరిగణలోకి తీసుకుంటారన్నారు. వందశాతం ఓటింగే లక్ష్యంగా పట్టభద్రులంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఆర్టీవీతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. ఆయన పూర్తి ఇంటర్వ్యూను ఈ కింది వీడియోలో చూడండి.

Also Read : అమెరికాను వణికిస్తున్న టోర్నడోలు.. 15 మంది మృతి..

మన ఓటు - మన హక్కు
మన ఓటు - రేపటి తరాలకు అభివృద్ధి మెట్టు

వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ సందర్భంగా హన్మకొండ నగరంలోని వడ్డేపల్లి పింగిలి కళాశాలలో సతిసమేతంగా మా ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. #GraduateMLC #Warangal_Khammam_Nalgonda pic.twitter.com/Ns5RcJfpy9

— Rakesh Reddy Anugula (@RakeshReddyBRS) May 27, 2024

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

BIG BREAKING : జీరో లైన్ దాటిన భారత జవాన్.. బంధించిన పాక్ ఆర్మీ!

ఫిరోజ్‌పూర్‌లోని భారత్-పాకిస్తాన్ సరిహద్దు వద్ద BSF జవాన్ ను పాక్ సైన్యం బంధించింది. తమ భూభాగంలోకి అక్రమంగా ప్రవేశించాడని ఆరోపిస్తూ అరెస్టు చేశామని చెబుతోంది. అయితే ఈ ఆరోపణలను BSF ఖండించింది.

New Update
pak-army

pak-army

పహల్గాం ఉగ్రదాడి మధ్య పంజాబ్ నుంచి బిగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది.  ఫిరోజ్‌పూర్‌లోని భారత్-పాకిస్తాన్ సరిహద్దు వద్ద BSF జవాన్ ను పాక్ సైన్యం బంధించింది. తమ భూభాగంలోకి అక్రమంగా ప్రవేశించాడని ఆరోపిస్తూ అరెస్టు చేశామని పాక్ ఆర్మీ  చెబుతోంది. అయితే ఈ ఆరోపణలను BSF ఖండించింది. జవాను అనుకోకుండా జీరో లైన్ దాటాడని..  తప్పుడు ఆరోపణలతో జవాన్ ను  అదుపులోకి తీసుకుందని ఇండియన్ ఆర్మీ చెబుతోంది.  

రైతులు పంట కోస్తున్న ప్రదేశంలో ఆ సైనికుడు వారిని గమనిస్తున్నాడని తెలిపింది.. రెండు దేశాల సరిహద్దులు కలిసే సరిహద్దు భాగాన్ని జీరో లైన్ అంటారు.  ఈ ప్రదేశంలో వ్యవసాయం చేయడానికి రైతులకు ప్రత్యేక అనుమతి లభిస్తుంది. రైతులు పంటలు కోసేటప్పుడు వారి భద్రత కోసం BSF సైనికులు వారితో ఉంటారు. వారిని రైతు రక్షకులు అని కూడా అంటారు.

జీరో లైన్ కు చాలా ముందుగానే ముళ్ల తీగను ఏర్పాటు చేస్తారు. జీరో లైన్ పై స్తంభాలను మాత్రమే ఏర్పాటు చేస్తారు.అక్కడ వేడి తీవ్రంగా ఉండటంతో సైనికుడు జీరో లైన్ దాటి పాకిస్తాన్ సరిహద్దుకు వెళ్లి ఒక చెట్టు నీడ కింద కూర్చున్నాడు.  ఇంతలో పాకిస్తానీ రేంజర్లు అతన్ని చూసి అదుపులోకి తీసుకుని వెంటనే అతని ఆయుధాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత, భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ద వాతావరణం నెలకొంది.  

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు