TS EDCET: టీఎస్‌ ఎడ్‌సెట్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ నోటిఫికేషన్‌ రిలీజ్!

టీఎస్‌ ఎడ్‌సెట్‌ 2024 ఎంట్రెన్స్‌ టెస్ట్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణులైన విద్యార్థులు ఆన్‌లైన్‌ విధానంలో మే 5 వరకూ అప్లై చేసుకోవాలి. మే 23న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.

New Update
TS EDCET: టీఎస్‌ ఎడ్‌సెట్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ నోటిఫికేషన్‌ రిలీజ్!

EDCET: టీఎస్‌ ఎడ్‌సెట్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. 2024 బీఈడీ కోర్సులో ప్రవేశాలకు సంబంధించి తెలంగాణ స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ అర్హతగల అభ్యర్థులనుంచి దరఖాస్తులు కోరింది. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలని సూచించింది. ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.

రెండేళ్ల శిక్షణ..
ఉపాధ్యాలకు వృత్తి పరమైన శిక్షణ ఇచ్చే రెండేళ్ల బీఈడీ కోర్సులో అడ్మిషన్ కల్పించేందుకు ఈ పరీక్షను నిర్వహిస్తారు. టీఎస్ ఎడ్‌సెట్ పరీక్షలో అర్హుత పొందటం ద్వారా తెలంగాణలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ బీఈడీ కాలేజీల్లో అడ్మిషన్ పొందొచ్చు. రెండేళ్ల బీఈడీ కోర్సు విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులు ప్రైవేట్ స్కూళ్లతో పాటుగా, ప్రభుత్వం భర్తీ చేసే ఉపాద్యాయ ఉద్యోగ ప్రకటనల ద్వారా సర్కార్ బడుల్లో ఉపాధ్యాయులుగా విధులు నిర్వహించవచ్చు.

ఇది కూడా చదవండి: JOBS: ESICలో 1,930 ఉద్యోగాలు.. ఈ అర్హతలుంటే చాలు!

ఉమ్మడి నిర్వాహణ..
ఇక ఈ టీఎస్ ఎడ్‌సెట్ 2024 పరీక్షను తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, మహాత్మ గాంధీ యూనివర్సిటీ కలిసి ఉమ్మడిగా నిర్వహిస్తుండగా.. ఈ ఏడాది పరీక్షను పరీక్షను మే 23వ తేదీన నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పూర్తి కంప్యూటర్ ఆధారంగా జరిగే ఈ పరీక్ష లో మొత్తం 150 మల్టిపుల్ ఛాయస్ ప్రశ్నలకు 150 నిముషాలలో సమాధానం చేయాల్సి ఉంటుంది.

రిజిస్ట్రేషన్‌ ఫీజు:
ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు రూ.550; ఇతరులకు రూ.750.

దరఖాస్తు:
ఆన్‌లైన్‌ విధానంలో 2024 మే 5 వరకూ అప్లై చేసుకోవాలి.

లేట్ ఫీజు:
ఆలస్యం రుసుము రూ.250తో కలిపి 2024 మే 13 వరకూ దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించింది.

పరీక్ష తేదీ:
2024 మే 23న నిర్వహించననున్నారు.

మరిన్ని విరాలకు అధికారిక వెబ్‌సైట్‌: https://edcet.tsche.ac.in/

Advertisment
Advertisment
తాజా కథనాలు