మెట్రో సంస్థకు మొట్టికాయలు..రూ. 6 వేలు జరిమానా..!!

హైదరాబాద్ మెట్రో సంస్థకు వినియోగదారుల కమిషన్ రూ.6 వేల ఫైన్ విధించింది. మెట్రో స్టేషన్‌లో తప్పుడు సైన్ బోర్డులు ఏర్పాటు చేయటంతో ఓ ప్రయాణికుడికి అసౌకర్యం కలగింది. అతడు వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించగా.. ఫిర్యాదును విచారించిన కమిషన్ హైదరాబాద్ మెట్రో సంస్థకు మొట్టికాయలు వేసింది. ప్రయాణకుడికి రూ.5వేల పరిహారం, కేసు ఖర్చులు రూ.1,000 చెల్లించాలని ఆదేశించింది.

New Update
Hyderabad Metro Trains: కొత్త సంవత్సరం వేళ...హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం..!!

Hyderabad Metro Rail: ప్రయాణికుడికి ఇబ్బంది కలిగించినందుకు గాను హైదరాబాద్ మోట్రో రైల్ సంస్థకు హైదరాబాద్ వినియోగదారుల కమిషన్ జరిమానా విధించింది. తప్పుడు సైన్ బోర్డులతో ప్రయాణికుడి సమయాన్ని వృథా చేసినందుకు రూ. 5 వేల ఫైన్, కేసు ఖర్చుల కోసం అదనంగా రూ. వెయ్యి చెల్లించాలని ఆదేశించింది. కేసు వివరాల్లోకి వెళ్తే.. సైదాబాద్‌కు చెందిన షేక్‌ అబ్దుల్‌ ఖాదర్‌ న్యాయవాద వృత్తిలో కొనసాగుతున్నారు. ఆయన 2022 డిసెంబర్‌ 16న హఫీజ్‌పేట్‌ వెళ్లేందుకు.. దిల్‌సుఖ్‌నగర్‌ నుంచి మలక్‌పేట్‌ వరకు మెట్రోలో ప్రయాణించారు. మలక్ పేట మెట్ర స్టేషన్‌లో 9.45 గంటలకు ట్రైన్ దిగారు. మలక్‌పేట్‌ రైల్వే స్టేషన్‌కు త్వరగా చేరుకోవాలని అక్కడ సైన్ బోర్డులను ( దిక్కుల సూచిక బోర్డు) అనుసరిస్తూ కౌంటర్‌ వద్ద మెట్రో కార్డును ట్యాప్‌ చేశారు.

Also Read: కాంగ్రెస్‌కు వారి చరిత్రనే గుదిబండ.. లీడర్లు వెళ్లినంత మాత్రానా ఓటర్లు మారరు!

కొద్ది దూరం వెళ్లి పరిశీలించగా.. రైల్వేస్టేషన్‌ మార్గం మరోవైపు ఉంది. తప్పుడు సైన్ బోర్డుతో ఖాదర్ గందరగోళానికి గురయ్యారు. మెట్రోస్టేషన్‌లో ఏర్పాటు చేసిన మూడు సైన్ బోర్డులు తప్పుడు దిక్కులు సూచిస్తున్నాయని గుర్తించాడు.ఇదే విషయాన్ని అక్కడి కౌంటర్‌లో ఉన్న సిబ్బందిని అడగ్గా.. వారి నుంచి సరైన స్పందన లేకుండా పోయింది. పైగా.. కార్డు ట్యాప్‌ చేసిన తర్వాత అటువైపు వెళ్లేందుకు అతడిని అనుమతించ లేదు. దీంతో అసహనానికి గురైన ఖాదర్.. హైదరాబాద్ జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. విచారించిన కమిషన్‌ మెట్రోకు రూ. 6 వేల ఫైన్ విధించింది. అలాగే మెట్రోస్టేషన్‌లో సరైన సూచిక బోర్డులు 30 రోజుల్లో ఏర్పాటు చేయాలని చెప్పింది. పరిహారం, కేసులు ఖర్చులు 45 రోజుల్లో చెల్లించాలని ఆదేశించింది. ఇలా చిన్న మిస్టేక్‌తో హైదరాబాద్ మెట్రోకు రూ. 6 వేల ఫైన్ పడింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు