Travelling Tips: దూర ప్రయాణం చేస్తున్నారా? వీటిని పాటిస్తే ఏ సమస్యా ఉండదు..! దూర ప్రయాణాల్లో ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ఈ చిట్కాలు తప్పక పాటించండి. హైడ్రేట్‌గా ఉండటం కోసం నీళ్లు తాగండి. ఫ్రూట్స్ ఎక్కువగా తినండి. జంక్ ఫుడ్ తినొద్దు. బీపీ, షుగర్ ఉంటే వెంట మందులు తీసుకెళ్లండి. అవసరమైన మేరకు నిద్రపోండి. ప్రయాణానికి ముందు వైద్యుల సలహా తీసుకోండి. By Shiva.K 30 Dec 2023 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Travelling Tips: కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి విహార యాత్రకు వెళ్లాలంటే చాలా మందికి ఇష్టం. దూర ప్రయాణాలు(Long Drive) చేయడానికి చాలా మంది ఆసక్తి చూపుతారు. అయితే, కొంత మంది ప్రయాణం అంటే భయపడుతుంటారు. ఇందుకు కారణం గత ప్రయాణ సందర్భంలో ఎదుర్కొన్న సమస్యలు అయి ఉంటాయి. లేదంటే ప్రయాణాలపై ఆసక్తి లేకపోవడమైనా కారణమై ఉంటుంది. వాస్తవానికి ప్రయాణంలో ఆరోగ్యానికి(Health) సంబంధించిన ఇబ్బందులు ఎదురవుతుంటాయి. చాలా మంది ప్రయాణ(Travelling) సమయంలో వాంతులు చేసుకోవడం, నరాలు లాగడం, తలనొప్పి, కడుపునొప్పి వంటి ఆరోగ్య సంబంధిత సమస్యలు ఎదుర్కొంటారు. మరికొందరు ప్రయాణం ముగించుకుని ఇంటికి వచ్చాక అనారోగ్యానికి గురవుతారు. ఈ కారణంగానే కొందరు ప్రయాణాలకు దూరంగా ఉంటారు. అయితే, ప్రయాణ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్య సమస్యలు రావని నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్య పరంగా ప్రజల అజాగ్రత్త కారణంగానే ఇలాంటి సమస్యలు వస్తాయంటున్నారు. మరి ప్రయాణం సాఫీగా సాగాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఓసారి చూద్దాం.. తినే ఆహారంపై జాగ్రత్త వహించాలి.. ప్రయాణాల్లో ఆహారపు అలవాట్ల విషయంలో జాగ్రత్తలు తీసుకోకుంటే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ప్రయాణ సమయంలో డీహైడ్రేషన్ కారణంగా నరాల్లో సమస్యలు, వాంతులు, తలనొప్పి వంటి సమస్యలను కలిగిస్తుంది. అందుకే.. ప్రయాణంలో ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినాలి. శరీరం హైడ్రేట్ గా ఉండేలా నీరు త్రాగుతూ ఉండాలి. ఆపిల్, దానిమ్మ, జామ వంటి కొన్ని పండ్లను ప్రయాణంలో వెంట ఉంచుకోవాలి. అలాగే.. స్పైసీ ఫుడ్ అతిగా తినొద్దు. ఫిట్నెస్ ఫ్రీక్.. ఫిట్‌నెస్ ఫ్రీక్ అయితే మీరు పాటించే రొటీన్‌ను బ్రేక్ చేయకూడదు. ఇందుకోసం మీరు మీతో పాటు జంపింగ్ రోప్, యోగా మ్యాట్‌ని తీసుకెళ్లాలి. పలితంగా మీరు హోటల్ గదిలో, బయట అయినా వ్యాయామం చేయగలరు. ఇది మీ వ్యాయామ షెడ్యూల్‌ను డిస్ట్రబ్ చేయదు. మంచి నిద్ర.. ప్రయాణంలో అలిసిపోతుంటారు. అందుకే.. యాత్రను ఆస్వాదించడంతో పాటు, విశ్రాంతి తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. 7 నుండి 8 గంటల నిద్ర ఉండేలా చూసుకోవాలి. ఇది ప్రయాణ సమయంలో ఏర్పడే ఒత్తిడి, అలసట నుండి శరీరానికి ఉపశమనాన్ని అందిస్తుంది. అవసరమైన మందులు.. ప్రయాణ సమయంలో ఎవరికైనా గాయం అవడం గానీ.. వాంతులు అవడటం గానీ జరుగుతుంది. అందుకే.. ఎల్లప్పుడు కొన్ని అవసరమైన మందులు వెంట ఉంచుకోవాలి. ఎవరికైనా ఇప్పటికే మధుమేహం, బీపీ పేషెంట్స్ ఉన్నట్లయితే.. మందులు తప్పనిసరిగా ఉంచుకోవాలి. అవసరమైనప్పుడు వైద్య సలహా.. ఇప్పటికే ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే.. ప్రయాణానికి ముందు వైద్యుడిని సంప్రదించాలి. ప్రయాణ సమయంలో మంచి ఆహారం తీసుకోవడంతో పాటు.. అవసరమైన మేరకు విశ్రాంతి తీసుకోవాలి. Also Read: అభయహస్తం అప్లికేషన్‌పై అనేక సందేహాలు.. సమాధానం ఏది?! టీడీపీ బీసీ మంత్రం.. జనవరి 4 నుంచి ‘జయహో బీసీ’.. #travelling-tips మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి