Crime News: విశాఖలో విషాదం..తండ్రి చనిపోయినా వెనకడుగు వెయ్యని విద్యార్థిని..! విశాఖలో విషాదం చోటుచేసుకుంది. అనారోగ్యంతో తండ్రి సోమేశ్ మృతి చెందగా పుట్టెడు దుఃఖంలోనూ ఇంటర్ పరీక్షకు హాజరయింది ఢిల్లీశ్వరి. అక్క మానసిక స్థితి బాలేకపోవడంతో తానే అంత్యక్రియలు చేయాల్సిన పరిస్థితి. తండ్రి చివరి కోరికను నెరవేర్చేందుకు పరీక్షకు హాజరై అంత్యక్రియల్లో పాల్గొంది. By Jyoshna Sappogula 08 Mar 2024 in ఆంధ్రప్రదేశ్ క్రైం New Update షేర్ చేయండి Visakhapatnam : విశాఖలో విధి కాటేసింది. తండ్రి చనిపోయిన కన్నీళ్లతోనే పరీక్ష రాసింది విద్యార్థిని. ఈ విషాదమైన ఘటన గాజువాక హనుమాన్ నగర్‌లో చోటు చేసుకుంది. ఏ కష్టం వచ్చినా వెన్నంటే ఉండి నడిపించేది నాన్నే. అలాంటిది.. ఇక నాన్న లేడన్న విషయం తెలిసినా.. పుట్టెడు దుఃఖంలోనూ తండ్రి కోరికను నెరవేర్చేందుకు ఇంటర్ పరీక్షకు హాజరయింది. పరీక్ష తర్వాత అంత్యక్రియల్లో పాల్గొంది. స్థానికుల సమాచారం మేరకు.. లారీ డ్రైవర్ సోమేశ్ అనే వ్యక్తి బ్లడ్ క్యాన్సర్ తో మృతి చెందాడు. అతడికి ఇద్దరు ఆడ పిల్లలు. రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడి సంపాదించి తన కుటుంబాన్ని పోషిస్తూ వచ్చాడు. పిల్లలను పెద్దవారిని చేశాడు. పెద్దకూతురు మానసికంగా అంత మతిస్థిమితం లేకపోవడంతో.. చంటి పిల్లలా కాపాడుకుంటూ వచ్చాడు. కేవలం చిన్న కూతురుని మాత్రమే చదివిస్తున్నాడు. Also Read: రాత్రి సమయంలో రోడ్డుపై వెళ్లేటప్పుడు ఈ కలర్ డ్రెస్ లు వేసుకుంటే డేంజర్..! చిన్న కూతురు ఢిల్లీశ్వరి అన్నీ తానై పేరెంట్స్‌కు చేదోడు వాదోడుగా నిలిచింది. ప్రస్తుతం చిన్న కూతురు ఇంటర్మీడియట్ చదువుతోంది. పరీక్షలు మొదలవడంతో ప్రిపేర్ అవుతోంది. అయితే, ఈ రోజు ఉదయాన్నే పరీక్షకి వెళ్దామని అనుకున్న ఆమెకు.. మరోసారి విధి పరీక్ష పెట్టింది. అనారోగ్యంతో మంచం పట్టిన తండ్రి.. ప్రాణాలు కోల్పోయాడు. అక్క మానసిక స్థితి బాలేకపోవడంతో.. తండ్రికి తనే అంత్యక్రియలు చేయాల్సిన పరిస్థితి. ఇంత విషాదంలోనూ ఇంటర్మీడియట్ పరీక్షకు హాజరైంది. జీవితానికి బాటలు వేసే పరీక్ష కంటే.. తనకు జీవితం ప్రసాదించిన తండ్రి చివరి కోరిక నెరవేర్చింది. తండ్రి చనిపోవడంతో కుటుంబసభ్యుల పరిస్థితి దయనీయంగా మారింది. తమల్ని ఆర్ధికంగా ఆదుకోవాలని RTVతో వేడుకుంటోంది. #visakhapatnam మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి