Basara IIIT : బాసర ట్రిపుల్ ఐటీలో విషాదం.. విద్యార్థిని బలవన్మరణం..!!

బాసర ట్రిపుల్ ఐటీలో విషాద ఘటన చోటుచేసుకుంది. పీయూసీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని శిరీష ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. శిరీష స్వగ్రామం సంగారెడ్డి జిల్లా మనూర్ మండలం దేవురాపురం.

New Update
TS News : అయ్యో వైశాలి.. మార్కులు తక్కువగా వచ్చాయని ఎంత పని చేశావమ్మా!

Basara IIIT Incident :  బాసర ట్రిపుల్ ఐటీ(Basara IIIT) లో విషాదం నెలకొంది. పీయూసీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని శిరీష(Sirisha) బలవర్మణానికి పాల్పడింది. ఆమె ఆత్మహత్య(Suicide) కు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. శిరీష బుధవారమే తన ఇంటి నుంచి ఆర్జీయూకేటీ క్యాంపస్(RGUKT Campus) కు వచ్చిందని పోలీసులు తెలిపారు. ఇంతలోనే ఆమె సూసైడ్ చేసుకోవడం విషాదకరంగా మారింది. విద్యార్థిని గదిలో సూసైడ్ నోట్(Suicide Note) కూడా లభించిందని అధికారులు తెలిపారు. శిరీష స్వగ్రామం సంగారెడ్డి జిల్లా(Sangareddy District) మనూర్ మండలం దేవురాపురమని హాస్టల్ వార్డెన్ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇది కూడా చదవండి : భార్యే భర్తకు భరణం ఇవ్వాలి..కోర్టు సంచలన తీర్పు..!!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Andhra Pradesh: ఏపీలో దారుణం.. టీడీపీ నేతను నరికి నరికి

ఒంగోలులో మాజీ ఎంపీపీ, టీడీపీ నేత ముప్పవరపు వీరయ్య చౌదరి దారుణ హత్యకు గురయ్యారు. తన ఆఫీసులో ఉండగా ముగ్గురు దుండగులు వచ్చి కత్తులతో దాడులు చేశారు. స్థానికులు ఆస్పత్రికి తరలించగా ఆయన అప్పటికే మృతి చెందారు.

author-image
By B Aravind
New Update

ఒంగోలులో దారుణం జరిగింది. మాజీ ఎంపీపీ, టీడీపీ నేత ముప్పవరపు వీరయ్య చౌదరి దారుణ హత్యకు గురయ్యారు. పద్మ టవర్స్‌లోని తన ఆఫీసులో ఉండగా ముగ్గురు దుండగులు వచ్చి కత్తులతో దాడులు చేశారు. ఆ తర్వాత స్థానికులు వీరయ్యను సమీప ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే లిక్కర్‌ సిండికేట్‌ విషయంలో గత కొన్నిరోజులుగా గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే. 

Also Read: ముంబై నుంచి హీరోయిన్‌ని తీసుకొచ్చి.. అరెస్టైన ఆ IPS చేసిన పని ఇదేనా..?

 

Advertisment
Advertisment
Advertisment