Tovino Thomas: ఫాంటాస్పోర్టో ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ .. ఉత్తమ నటుడిగా టోవినోథామస్

పోర్చుగల్ వేదికగా ఫాంటాస్పోర్టో ఇంటర్నేషనల్ ఫిలిమ్ ఫెస్టివల్ అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకల్లో మలయాళ నటుడు టోవినో థామస్ ఉత్తమ నటుడిగా అవార్డు గెలుచుకున్నారు. 'అదృశ్యం జలకంగళ్' సినిమాలోని నటనకుగానూ ఆయనను ఈ అవార్డు వరించింది.

New Update
Tovino Thomas:  ఫాంటాస్పోర్టో ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ .. ఉత్తమ నటుడిగా టోవినోథామస్

Tovino Thomas: 44 వ ఫాంటస్ పోర్ట్ ఇంటర్నేషనల్ ఫిలిమ్ ఫెస్టివల్ వేడుకలో పోర్చుగల్ వేదికగా ఘనంగా జరిగాయి. 32 దేశాల నుంచి దాదాపు 90 ఫీచర్ ఫిల్మ్‌లు, 20 షార్ట్ ఫిల్మ్‌లను ఈ అవార్డుకు నామినేట్ అయ్యాయి. ఈ వేడుకల్లో మలయాళ నటుడు టోవినో థామస్ ఉత్తమ నటుడుగా అవార్డు అందుకున్నారు. 'అదృశ్యం జలకంగళ్' సినిమాలో థామస్ నటనకు ఈ అవార్డు వరించింది. ఈ విషయాన్నీ సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ.. ఆనందం వ్యక్తం చేశారు టోవినో.

Also Read: Anchor Rashmi: రష్మి ఇంట తీవ్ర విషాదం.. స్టార్ యాంకర్ కంట కన్నీరు😿

టోవినో ఇన్స్టాగ్రామ్ పోస్ట్

పోర్చుగల్‌లో జరిగిన ఫాంటాస్పోర్టో అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఉత్తమ నటుడిగా అవార్డును పొందడం చాలా గౌరవంగా, గర్వంగా ఉంది. అంతర్జాతీయ వేదికగా ప్రతిభకు గుర్తింపు దక్కడం సంతోషంగా ఉంది. 'అదృశ్య జలకంగల్' సినిమా ఒక అద్భుతమైన చాఫ్టర్. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు అలాగే ఈ సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికి నా ధన్యవాదాలు అంటూ పోస్ట్ పెట్టారు.

అదృశ్య జలకంగల్ చిత్రాన్ని బీ రాజు దర్శకత్వం వహించారు. యుద్ధ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా గతేడాది నవంబర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఈ చిత్రాన్ని టాలిన్ బ్లాక్ నైట్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో కూడా స్క్రీనింగ్ చేశారు.

Also Read : NBK109 Glimpse : ‘‘సింహం నక్కల మీదకు వస్తే వార్‌ అవ్వదురా లఫూట్‌”.. బాలయ్య NBK 109 గ్లింప్స్ .. ఫ్యాన్స్ కు పూనకాలే

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు