Begging Ban: దానం చేస్తే జైలుకెళ్లడం ఖాయం.. అవును మీరు విన్నది నిజమే భిక్షాటన నిషేధం దేశంలోని ప్రధాన నగరాల్లో అమలు చేయాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. Also Read : అల్లు అర్జున్ కోసం హైదరాబాద్ వస్తున్న పవన్..! హైదరాబాద్ కూడా.. పైలెట్ ప్రాజెక్టుగా మొదట 10 నగరాలను ఎంచుకున్నారు. అందులో మన హైదరాబాద్ కూడా ఉంది. ఇకపై భిక్షాటన చేస్తున్న వ్యక్తులకు దానం చేసే వారిపై కేసులు నమోదు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. Also Read : మరోసారి షూటింగ్ లో గాయపడ్డ ప్రభాస్..! మన దేశం అభివృద్ధిలో ముందుకు వెళ్తుండగా, ఇందులో యాచకులు ఉండకూడదనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయంతీసుకుంది. అయితే దేశవ్యాప్తంగా భిక్షాటన పూర్తిగా నివారించడం కష్టం కాబట్టి కొన్ని నగరాల్లో ఈ నిషేధాన్ని అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. ఇందుకోసం ఇండోర్ నగరాన్ని మొదటి నగరంగా ఎంచుకుని, జనవరి 1 నుంచి నిషేధాన్ని అమలు చేస్తోంది. Also Read : రాష్ట్రపతి రాకతో ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ రూట్లలో వెళ్లొద్దు ఇప్పటికే ఇండోర్ నగరంలో భిక్షం వేసే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరికలు జారీ చేశారు. యాచకులకు దానం చేసే వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ద్వారా బిక్షాటన చేసే వారి సంఖ్యను తగ్గించాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. Also Read : 'పుష్ప2' ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే? 2024 డిసెంబర్ చివర్లో, నిరాశ్రయులు, అంగ వైకల్యం ఉన్న వారిని పునరావాస కేంద్రాలకు తరలించాలని కలెక్టర్ సూచించారు. ఈ ప్రాజెక్టు సఫలమైతే, దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో కూడా ఇదే విధంగా అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది.