/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Tomato-Price-falls-in-Madanapalle-Market-Yard-jpg.webp)
Tomato Price falls farmers are disappointed Rs 9 per kg in Madanapalle Market Yard: గత కొద్ది రోజుల క్రితం టమాటా అనగానే ఆమడ దూరం పారిపోయేవారు. అంతలా ఆకాన్నంటాయి టమాటా ధరలు. ఒక్కసారిగా కిలో రూ.200 వరకూ వెళ్లాయి. దీంతో రైతులకు కాసుల పంట కురిశాయి. కానీ వినియోగదారుడు మాత్రం చితికిపోయాడు. టమాటాలు అమ్మి ఒక్కో ప్రాంతాల్లో లక్షాధికారులు, కోటీశ్వరులు అయ్యారు రైతులు. ఇప్పుడు ఇదే టమాటా ధరలు రైతును కంట తడి పెట్టిస్తున్నాయి. మొన్నటి వరకూ కిలో రూ.200కి పైగా లభించే టమాటాలు ఇప్పుడు కిలో రూ.9 నుంచి రూ.30 పలుకుతున్నాయి. దీంతో రైతులు నిరాశతో వెనుదిరుగుతున్నారు. మొన్నటి వరకూ మార్కెట్ కు వచ్చి జేబు నిండా డబ్బులు పట్టికెళ్లిన రైతు.. ఇప్పుడు చేతి ఖర్చులకు కూడా డబ్బులు ముట్టడంట లేదు.
చిత్తూరు జిల్లాలో సంప్రదాయ పంటగా టమాటా:
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పడమటి ప్రాంత రైతాంగం ప్రధాన సాంప్రదాయ పంటగా సాగు చేస్తున్న టమాటా ఈసారి రైతుని సంపన్నుడ్ని కూడా చేసింది. మునుపెన్నడూ లేని రీతిలో ఏకంగా కిలో టమోటా ధర డబుల్ సెంచరీ పలకడంతో సాగు చేసిన టమోటా ను పంటను కాపలా కాయడమే కష్టంగా మారిపోయిన పరిస్థితికి నెలకొంది. జులై నెలాఖరు వరకూ కిలో రూ.150 నుంచి రూ.200 పలికిన టమాటా ధర తర్వాత తగ్గు ముఖం పడుతూ వచ్చింది. ఆగష్టు 14వ తేదీ వరకూ తగ్గుతూ వచ్చిన టమాటా ధరలు ఆ తర్వాత ఒక్కసారిగా పతనమయ్యాయి.
ఆగస్టు 14న కిలో రూ.22కు చేరుకున్న టమాటా కనిష్ఠ ధర:
ఆగస్టు 14న కిలో టమాటా కనిష్ఠ ధర రూ.22కు చేరుకుంది. ఆ రోజున 282 మెట్రిక్ టన్నుల టమోటా మదనపల్లి మార్కెట్ కు రైతులు అమ్మకానికి తీసుకుని రాగా ట్రేడర్లు నుంచి పెద్దగా డిమాండ్ లేకపోవడంతో గిట్టుబాటు ధర రాకపోయింది. క్రమేపి టమోటా ధరలు తగ్గుతూ రావడం ప్రారంభం కాగా ఇతర ప్రాంతాల్లో టమాటా దిగుబడులు మొదలయ్యాయి. దీంతో మదనపల్లి మార్కెట్ టమాటా డిమాండ్ పడిపోయింది. పక్కనే ఉన్న కర్ణాటక, అనంతపురం జిల్లాలతో పాటు ఇతర ప్రాంతాల్లో టమోటా సాగు విస్తారంగా జరగడం, దిగుబడి ఆశాజనకంగా ఉండడంతో మదనపల్లి మార్కెట్ వైపుకు టమాటా కొనుగోలు చేసేందుకు బయ్యర్లు ఇటువైపు చూడడం మానేశారు.
కమిషన్ పోగా రైతు చేతికి అందేది కిలో కు రూ. 7 మాత్రమే:
ప్రస్తుతం 300 లోపు మెట్రిక్ టన్నుల టమాటా మదనపల్లి మార్కెట్ కు వస్తున్నా కొనుగోలు చేసేందుకు ఇతర ప్రాంతాల నుంచి బయ్యర్లు రాకపోవడం లేదు. దీంతో ఇప్పుడు ఎక్స్పోర్ట్ క్వాలిటీ కిలో టమాటా ధర రూ.9 కి చేరింది. మదనపల్లి మార్కెట్ లో జాక్పాట్ విధానం అమల్లో ఉండడంతో కమిషన్ విధానం టమాటా రైతును మరో దెబ్బతీస్తోంది. కిలో టమాటా కు రూ.9 దక్కుతుంటే కమిషన్ పోగా చేతికి అందేది కిలో కు రూ. 7 మాత్రమే. దీంతో 20 రోజుల క్రితం వరకు మదనపల్లి మార్కెట్ కు టమోటాలు తీసుకొచ్చి జేబునుండా డబ్బులు తీసుకెళ్లిన టమోటా రైతు ఇప్పుడు ఖాళీ జేబులతో ఇంటికి వెళ్తున్న పరిస్థితి నెలకొంది. టమోటా సాగు చేసి చిత్ర విచిత్రమైన పరిస్థితులను ఎదుర్కొంటున్న పరిస్థితి నెలకొంది.
ఇవి కూడా చదవండి:
TDP Leader Ayyanna Patrudu Arrest: తెలుగుదేశం పార్టీ ముఖ్యనేత అయ్యన్న పాత్రుడు అరెస్ట్
సూర్యుడి పై ఫోకస్ పెట్టిన ఇస్రో.. Aditya L1 Mission ప్రయోగానికి అంతా సెట్
IT Notices to Chandrababu Naidu: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఐటీ నోటీసులు
Good News for Tenant Farmers: కౌలు రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం
AP News: అమరావతి అభివృద్ధికి మోదీ సర్కార్ అండగా ఉంది.. పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు!
అమరావతి రాజధానికి మోదీ సర్కార్ సంపూర్ణ సహకారం అందిస్తుందని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి చెప్పారు. ఇందులో భాగంగానే రూ. 2500కోట్లు మౌలిక వసతుల కల్పనకు కేటాయించిందని తెలిపారు. ఏపీకి కేంద్ర సహాయంపై ఓ వీడియో రిలీజ్ చేశారు.
Purandeshwari
AP News: అమరావతి రాజధానికి మోడీ సర్కార్ సహకారం అందిస్తుందని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి చెప్పారు. ఇందులో భాగంగానే రూ. 2500కోట్లు కేంద్రం అమరావతిలో మౌలిక వసతుల కల్పనకు కేటాయించిందని తెలిపారు. అవుటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి 20వేల కోట్లు కేంద్రం మంజూరు చేసినట్లు వెల్లడించా. 2024 లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో డబుల్ ఇంజన్ సర్కార్ కు ప్రజలు పట్టం కట్టారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిని ప్రజలు ఆశీర్వదించారు. అమరావతి నిర్మాణానికి, అభివృద్దికి సంపూర్ణ సహకారం అందిస్తామని మోడీ చెప్పినట్లు గుర్తు చేస్తూ వీడియో రిలీజ్ చేశారు.
Also Read: తెలంగాణ మందుబాబులకు అదిరిపోయే వార్త.. 604 కొత్త బ్రాండ్లు!
రాష్ట్ర ప్రభుత్వంతో కీలక ఒప్పందం..
వరల్డ్ బ్యాంకు ద్వారా 15వేల కోట్లు, హడ్కో కింద 11వేల కోట్లు ఏపీకి అందించడానికి నిర్ణయం చేశారు. హడ్కో కింద 11వేల కోట్ల రూపాయలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో నేడు ఒప్పందం చేసుకున్నారు. 15వేల కోట్లు ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్ మెంట్ బ్యాంకు కలిపి 13వేల 600కోట్లు ఇస్తుండగా కేంద్ర ప్రభుత్వం తన వాటాగా 1400కోట్లు అందిస్తుంది. ఈ 15వేల కోట్లు మొబలైజేషన్ లో 25శాతం గ్రాంట్ కింద ఇస్తామని కేంద్రం చెప్పిన విధంగా ఇటీవల 4వేల 285 కోట్లు కేంద్రం అందించింది. కేంద్రం నుంచి వచ్చే సహకారాన్ని అందిపుచ్చుకుంటూ అమరావతిని అద్భుతంగా అభివృద్ది చేయాలని కోరుతున్నాను అని పురంధేశ్వరి వివరించారు.
Also Read: రికార్డ్ సృష్టించిన ఇండియా.. రూ.2 లక్షల కోట్ల విలువైన స్మార్ట్‌ఫోన్స్ ఎగుమతి
bjp-purandeswari | amaravathi | telugu-news | today telugu news
వాళ్లను తరిమికొట్టినట్లే.. బీజేపీ వాళ్లను ఓడించాలి : సీఎం రేవంత్ రెడ్డి
Life Style: 20-20-20 ఫార్ములా ఎప్పుడైనా ట్రై చేశారా? స్క్రీన్స్ ముందు ఉండేవారికి ఇది చాలా ముఖ్యం
Murder : ములుగు జిల్లాలో దారుణం.. గొడ్డలితో నరికి గిరిజన యువకుడిని హత్య
రేవ్ పార్టీలో అడ్డంగా బుక్కైన ఆర్మీ, రాజకీయ నేతల కూతుర్లు.. వీడియో వైరల్
Iphone 15 Price Drop: ఐఫోన్ 15పై బిగ్గెస్ట్ డిస్కౌంట్ భయ్యా.. వదిలారో మళ్లీ మళ్లీ రాదు!