Hero Abbas : సూసైడ్ చేసుకుందామని లారీకి ఎదురెళ్లా! షాకింగ్ న్యూస్ చెప్పిన హీరో అబ్బాస్ 90వ దశాబ్దంలో హీరో అబ్బాస్ ఒక సంచలనం అనే చెప్పాలి. తన బాల్ హెయిర్‌స్టైల్‌తో కుర్రకారు మతిపోగొట్టాడు. ప్రేమ దేశం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అబ్బాస్ తొలి సినిమాతోనే తిరుగులేని పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. ముఖ్యంగా యూత్ లో అబ్బాస్ క్రేజ్ అప్పట్లో మాములుగా ఉండేది కాదు. ఇక అమ్మాయిలకైతే కలల రాకుమారుడనే చెప్పాలి. అయితే తాజాగా.. తను లారీ కిందపడి సూసైడ్ చేసుకుందామని డిసైడ్ అయినట్లు తెలిపాడు. By Shareef Pasha 19 Jul 2023 in సినిమా Scrolling New Update షేర్ చేయండి 1990లో నటుడు అబ్బాస్ సినిమాలో యాక్ట్ చేస్తే చాలు బాక్సాపీస్ బద్దలు అవ్వాల్సిందే. అంతలా యూత్‌ని అట్రాక్ట్ చేశాడు. ప్రేమదేశం చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అబ్బాస్ తన తొలి సినిమాతోనే తిరుగులేని పాపులారిటీ తెచ్చుకున్నాడు. ఇక అబ్బాస్ కటింగ్ అంటే అప్పట్లో కుర్రకారు పడిచచ్చిపోయేవారు. ఎంతలా అంటే అబ్బాస్ కటింగ్ పోటోలు సెలూన్ షాపుల ముందు బోర్డులు పెట్టేంతగా.. ఇక తన కటింగ్ తో పాటు హర్పిక్ యాడ్ కూడా అబ్బాస్ కు మంచి ఐడెంటీటీని తెచ్చిపెట్టింది. కాగా అబ్బాస్ 2015 సంవత్సరం తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైపోయాడు. అనంతరం ఆయన న్యూజిలాండ్‌లో స్థిరపడ్డాడు. రీ-ఎంట్రీ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్ అయితే ఆయన రీ-ఎంట్రీ కోసం చాలామంది ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అంతేకాకుండా పలువురు దర్శక నిర్మాతలు కూడా ఆయన్ని మళ్లీ సినిమాల్లోకి తీసుకురావాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని ఇన్ సైడ్ టాక్. మంచి క్యారెక్టర్ పడితే ఆయన కూడా రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉన్నట్లు సమాచారం.ఇదిలా ఉంటే అబ్బాస్ ఒకానొక దశలో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడట. టెన్త్ క్లాస్ ఫెయిలవ్వడం, అదే సమయంలో తన గర్ల్ ఫ్రెండ్ వదిలి వెళ్లడం తనను ఎంతగానో బాధించిందట. సూసైడ్ చేసుకోవాలని లారీకి ఎదురెళ్లా.. దాంతో ఆ బాధను భరించలేక జీవితానికి ముగింపు పలకాలని భావించినట్లు తెలిపాడు. సూసైడ్ చేసుకోవాలని లారీకి ఎదురెళ్లానని, కానీ అంతలో మనసు మార్చుకొని సూసైడ్ ఆలోచనను విరమించుకున్నట్లు వెల్లడించాడు. ప్రేమదేశం అనే తమిళ డబ్బింగ్ సినిమాతో పరిచయమైన అబ్బాస్.. తెలుగులో ప్రియా.. ఓ ప్రియా, రాజా, కృష్ణబాబు, అల్లుడుగారు వచ్చారు. నీ ప్రేమకై వంటి సినిమాల్లో నటించాడు. తమిళంలో పలు సీరియల్స్‌లోనూ మెప్పించాడు. ఇక 2015లో పచ్చక్కల్లం అనే మలయాళం సినిమాలో చివరిసారిగా కనిపించాడు. నా గర్ల్ ఫ్రెండ్ నన్ను మోసం చేయడంతో అలా.. టీనేజ్ అంతా ఏదో గందరగోళంగా నడిచింది. ఆ సమయంలో నాకు ఏది తెలియలేదు. టీనేజ్ లో ఉన్నప్పుడు నా గర్ల్ ఫ్రెండ్ నన్ను మోసం చేసింది. వదిలేసి వెళ్ళిపోయింది. దీంతో నాకు అస్సలు బతకాలనిపించలేదు. రోడ్డు మీద ఓ ట్రక్ ఎదురుగా నిలబడ్డాను. కానీ దాని వెనకాలే బైక్ పై వస్తున్న వ్యక్తిని చూసి.. పక్కకు తప్పుకొన్నాను. ఎందుకంటే నన్ను ట్రక్ గుద్దేస్తే, అతడు దాన్ని ఢీ కొట్టి గాయపడతాడు అనిపించింది. ఆ బైకర్ వలనే నేను ఇప్పుడు ప్రాణాలతో ఉన్నాను. నేను చిన్నతనం నుంచి అంతే.. ప్రాణం పోతున్నా పక్కవాళ్ళ గురించే ఆలోచిస్తాను. ఎవరికైనా సాయం చేస్తే.. ఫలితం ఆశించకండి.. అదే నేను చెప్తాను. సినిమాల్లో అవకాశాలు తగ్గాక నేను ఇక్కడ సెటిల్ అయ్యాను. ఇప్పుడు రీ ఎంట్రీ కోసం ట్రై చేస్తున్నాను” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారింది. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి