Raviteja: హీరో రవితేజకు గాయాలు.. ఆరు వారాలపాటు విశ్రాంతి..!

టాలీవుడ్ హీరో రవితేజ గాయాలపాలయ్యారు. అయన నెక్స్ట్ మూవీ RT75 షూటింగ్ లో కుడిచేతికి గాయమైనట్లు తెలుస్తోంది. గాయం పెద్దగా కావడంతో రవితేజను చికిత్స కోసం యశోద ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు ఆరు వారాలపాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు సమాచారం.

New Update
Raviteja: హీరో రవితేజకు గాయాలు.. ఆరు వారాలపాటు విశ్రాంతి..!

Ravi Teja : మాస్ మహారాజ్ రవితేజ డెబ్యూ డైరెక్టర్ భాను భోగవరపు దర్శకత్వంలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ RT75. రవితేజ 75వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మిస్తోంది. 2025 సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్న ఈ మూవీ షూటింగ్  ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. హీరో సన్నివేశాలతో పాటు మరికొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

రవితేజకు గాయాలు

అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ పాల్గొంటున్న సమయంలో హీరో రవితేజకు ప్రమాదం జరిగింది. కుడిచేతికి పెద్దగా గాయమైంది. దీంతో చిత్ర యూనిట్ చికిత్స కోసం రవితేజను యశోద ఆసుపత్రికి తీసుకెళ్లారు. గాయాలను పరీక్షించిన వైద్యులు ఆరు వారాలపాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు సమాచారం. ఈ విషయం తెలియడంతో రవితేజ ఫ్యాన్స్ తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తమ అభిమాన హీరో త్వరగా కోలుకోవాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read : మాజీ మంత్రికి బిగ్ రిలీఫ్.. కొడుక్కు బెయిల్..!

Advertisment
Advertisment
తాజా కథనాలు