Hero: తండ్రైన మరో టాలీవుడ్ యంగ్ హీరో.. పాప పేరు కూడా రివీల్..!

టాలీవుడ్ హీరో శర్వానంద్ గతేడాది వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా శర్వా తన బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ తో ఓ గుడ్ న్యూస్ షేర్ చేశారు. తమకు పాప పుట్టిందని తెలిపారు. తమ ముద్దుల కూతురికి 'లీలాదేవి మైనని' అనే పేరు కూడా పెట్టినట్లు వెల్లడించారు.

New Update
Hero: తండ్రైన మరో టాలీవుడ్ యంగ్ హీరో.. పాప పేరు కూడా రివీల్..!

Sharwanand: యంగ్ హీరో శర్వానంద్ 2023 లో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. జూన్ 3న రక్షిత రెడ్డి అనే అమ్మాయిని పెళ్లాడారు. జైపూర్ లోని లీలా ప్యాలెస్ లో కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితుల మధ్య వీరి పెళ్లి అంగరంగ వైభవంగా చేసుకున్న విషయం తెలిసిందే.

Also Read: Uday Kiran: ఉదయ్ కిరణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఆ సూపర్ హిట్ మూవీ రీ రిలీజ్

తండ్రైన శర్వానంద్

అయితే తాజాగా తన పుట్టిరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పారు శర్వానంద్. సోషల్ మీడియా వేదికగా రక్షిత రెడ్డి, తాను తల్లిదండ్రులమయ్యామని తెలిపారు. తమకు కూతురు పుట్టిందేనే విషయాన్ని రివేల్ చేసి అందరికీ సర్ ప్రైజ్ ఇచ్చారు. తమ ముద్దుల కూతురికి లీలాదేవి మైనని అనే పేరు కూడా పెట్టినట్లు వెల్లడించారు. దీంతో శర్వా ఫ్యాన్స్ అభినందనలు తెలియజేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

publive-image

ప్రస్తుతం శర్వానంద్ టీజీ విశ్వప్రసాద్ నిర్మాణంలో శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కిస్తున్న సినిమాలో నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి 'మనమే ' అనే టైటిల్ ఖరారు చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

View this post on Instagram

A post shared by Sharwanand (@imsharwanand)

Also Read: Samantha: సమంతతో తిరుమలలో ప్రత్యక్షమైన ప్రీతం.. మరోసారి టాలీవుడ్ లో గుసగుసలు

Advertisment
Advertisment
తాజా కథనాలు