Silk Smitha death anniversary: నేడు సిల్క్ స్మిత వర్ధంతి.. ఆమె ఎలా మరణించారో తెలుసా..?

సిల్క్ స్మిత...ఈ పేరు గురించి ప్రత్యేకంచీ పరిచయం అవసరం లేదు. 80, 90వ దశకంలో ఆమె అందం, డ్యాన్స్ తో ప్రేక్షకులను కట్టేపడేసింది. 1960లో ఏపీలోని ఏలూరులో జన్మించారు సిల్క్ స్మిత. ఆమె అసలు పేరు వడ్లపాటి విజయలక్ష్మీ. సిల్క్ స్మిత కనిపిస్తే చాలు యువత ఉత్సాహానికి హద్దులే ఉండవు. తెలుగుతోపాటు తమిళం, మలయళం, కన్నడ, హిందీ భాషల్లో ఎన్నో పాటల్లో నర్తించింది. 1996 సెప్టెంబర్ 26న బలవన్మరణానికి పాల్పడింది సిల్క్ స్మిత. సిల్క్ స్మిత వర్దంతి సందర్భంగా ఆమెకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

New Update
Silk Smitha death anniversary: నేడు సిల్క్ స్మిత వర్ధంతి.. ఆమె ఎలా మరణించారో తెలుసా..?

సిల్క్ స్మిత...ఈ పేరు గురించి ప్రత్యేకంచీ పరిచయం అవసరం లేదు. 80, 90వ దశకంలో ఆమె అందం, డ్యాన్స్ తో ప్రేక్షకులను కట్టేపడేసింది. 1960లో ఏపీలోని ఏలూరులో జన్మించారు సిల్క్ స్మిత. ఆమె అసలు పేరు వడ్లపాటి విజయలక్ష్మీ. సిల్క్ స్మిత కనిపిస్తే చాలు యువత ఉత్సాహానికి హద్దులే ఉండవు. తెలుగుతోపాటు తమిళం, మలయళం, కన్నడ, హిందీ భాషల్లో ఎన్నో పాటల్లో నర్తించింది. 1996 సెప్టెంబర్ 26న బలవన్మరణానికి పాల్పడింది సిల్క్ స్మిత.

తన అందం, టాలెంట్ తో చిత్రపరిశ్రమలో తనదైన ముద్రవేసింది సిల్క్ స్మిత. మత్తెక్కించే కళ్లు, కసిపుట్టించే ఒళ్లు సిల్క్ స్మిత సొంతం. సినిమాలు ఏవైనా సరే ఆమెకు సంబంధించిన ప్రత్యేకపాట ఉండాల్సిందే. కేవలం సిల్క్ స్మితను చూసేందుకు సినిమాలకు వెళ్లే వారంటే ప్రేక్షకులను సిల్క్ స్మిత ఎంతలా మంత్రముగ్దులను చేసిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

ఇది కూడా చదవండి: సివిల్స్ రాసే వారికి జగన్ సర్కార్ శుభవార్త.. ఏకంగా రూ.1.50 లక్షల ఆర్థిక సాయం.. వివరాలివే!

publive-image Credit: Facebook

1960 డిసెంబర్ 2న జన్మించిన విజయలక్ష్మీ..ఈ పేరు చెబితే చిత్రపరిశ్రమలోనే కాదు ప్రేక్షకులు కూడా గుర్తు పట్టరు. కానీ సిల్క్ స్మిత అంటే మాత్రం అందరూ గుర్తుపడతారు. ఒకప్పుడు తెలుగు, తమిళంలో సన్సేషన్ క్రియేట్ చేసింది. మలయాళ, కన్నడ, హిందీ సినిమాల్లో కూడా నటించారు. ముందుగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన కెరీర్ ప్రారంభించిన సిల్క్ స్మిత 1979లో రిలీజ్ అయిన తమిళ సినిమా వండిక్కరంతో ఎంతో క్రేజ్ ను సంపాదించుకుంది. 17 ఏళ్ల పాటు చిత్రపరిశ్రమలో రాణించారు. దాదాపు 450 చిత్రాల్లో నటించారు. డ్యాన్సర్ గా ప్రేక్షకులను మెప్పించారు. చివరిగా 1996 సెప్టెంబర్ 23న మరణించింది.

publive-image credit: Twitter

సిల్క్ స్మిత పేద కుటుంబంలో జన్మించారు. అందుకే చదవును మధ్యలోనే ఆపేశారు. పలు కథనాల ప్రకారం తనకు 14ఏళ్ల వయస్సులోనే వివాహం జరిగింది. కొన్నాళ్లపాటు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అవన్నీ భరించలేని సిల్క్ స్మిత్ ఇంట్లో నుంచి పారిపోయారు. తన స్నేహితుల ఇంట్లో ఉంటూ..తనతో సినిమా సెట్స్ కు వెళ్తుండేది. ఆ తర్వాత మెల్లగా తానుకూడా మేకప్ ఆర్టిస్టుగా మారారు. ఆంథనీ ఈస్ట్ మ్యాన్ అనే డైరెక్టర్ ముందు తనకు సినిమాలో కనిపించే అవకాశాన్ని కల్పించాడు. అప్పటి నుంచి సిల్క్ స్మిత జీవితమే మారిపోయింది. తర్వాత ఎన్నో హిట్స్ ఆమె ఖాతాలో పడ్డాయి. మోహన్ లాల్, కమల్ హాసన్ వంటి స్టార్ హీరోలతో నటించే ఛాన్స్ దక్కించుకుంది సిల్క్ స్మిత.

ఇది కూడా చదవండి: సూర్యాపేటలో ఐటీ కొలువులు.. 26న ఇంటర్వ్యూలు.. రిజిస్ట్రేషన్ లింక్ ఇదే..!!

publive-image credit : Twitter

సినిమా జీవితం బాగున్నా...వ్యక్తిగత జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నారట సిల్క్ స్మిత. ఎవరికీ తెలియకుండా ఓ డాక్టర్ ను వివాహం చేసుకుందట. ఆ తర్వాత అతను చెప్పినట్లుగా విని తన సంపాదన అంతా ఫిల్మ్ ప్రొడక్షన్ లో పెట్టారని చెబుతుంటారు. కానీ తన భర్త చెప్పినట్లుగా సిల్క్ స్మితకు కలిసి రాలేదు. పెట్టుబడి పెట్టిన సినిమాలు ప్లాప్ అయ్యాయి. ఇలా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న సిల్క్ స్మిత 1996 సెప్టెంబర్ 23న ఆత్మహత్య చేసుకున్న వార్త బయటకు వచ్చింది. ఈ సందర్భంలో తన ఇంట్లో సోదాలు నిర్వహించేందుకు వెళ్లిన పోలీసులకు సూసైడ్ నోట్ దొరికిందని..తన జీవితం సంతోషంగా లేనందునే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు అందులో రాసిందని అప్పట్లో వార్తలు వచ్చాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు