Tirupati: ఈ నెల 24న ఘనంగా తిరుపతి 894వ జన్మదిన వేడుకలు

తిరుపతి 894వ జన్మదినాన్ని ఈనెల 24వ తేదీ ఘనంగా నిర్వహిస్తున్నట్లు టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడించారు. అందుకు సంబంధించిన వాల్‌పోస్టర్ ను టీటీడీ ఛైర్మన్ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ పుట్టినరోజు అనేది మనిషికే కాదని ప్రాంతానికి కూడా చాలా అవసరమన్నారు.

New Update
TTD: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం!

Tirupati: తిరుపతి 894వ జన్మదినాన్ని ఈనెల 24వ తేదీ ఘనంగా నిర్వహిస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. నగరంలోని కృష్ణాపురం టాణ, తిరుపతి నగర 894వ జన్మదినానికి సంబంధించిన వాల్‌పోస్టర్ ను టీడీపీ ఛైర్మన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ పుట్టినరోజు జరుపుకోవడమన్నది మనిషికే కాదని..నగరానికి కూడా చాలా అవసరమని అన్నారు.

Also Read: షణ్ముక్‌ గంజాయి కేసుపై లాయర్ దిలీప్ సుంకర షాకింగ్ పోస్ట్

ప్రపంచంలో చరిత్ర కలిగిన నగరాలు చాలా ఉన్నాయని..అయితే అంకురార్పణ జరిగిన నగరంగా ఒక్క తిరుపతి మాత్రమే అని అన్నారు. సమతా ధర్మాన్ని స్థాపించి తిరుమల శ్రీవారి నిత్య పూజా కైంకర్యాల నియమాలను స్థిరీకరించిన భగవద్ రామానుజులు తిరుపతి నగర ఆవిర్భావానికి కారకులన్నారు. అలాంటి తిరుపతి ఆధ్యాత్మిక, మానవీయ పరిమళాలు నింపుకుని ఆదర్శంగా జీవిద్దామని అన్నారు. తిరుపతి నగర జన్మదిన వేడుకలకు ప్రతి ఒక్కరు హాజరుకావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.

Also Read: ప్రతిపక్షంలో ఉన్నపుడు ఇచ్చిన మాట ఏమైంది? జగన్ సర్కార్ పై రఘువీరా ఫైర్

హిందువులకు తిరుమల తిరుపతి ఎంత ప్రత్యేకమైనదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేశ విదేశాల నుండి భక్తులు శ్రీవారి దర్శనం నిమిత్తం పెద్ద ఎత్తున తరలివస్తూ ఉంటారు. అలాంటి తిరుమల, తిరుపతి ఆవిర్భావ దినోత్సవాన్ని తిరుపతి ప్రజలు ప్రతి ఏటా ఘనంగా జరుపుకుంటారు. ఈ ఏడాది కూడా అంతే ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నిజానికి ఒక ఊరుకు ఆవిర్భావ దినోత్సవం ఉండటమనేది చాలా అరుదే.

Advertisment
Advertisment
తాజా కథనాలు