Tirupati: హిందూ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతి వైసీపీ అభ్యర్థి ఇతనే..!

టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వారసుడు భూమన అభినయ్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో తిరుపతి నుంచి బరిలో దిగుతున్నట్లు వైసిపి వర్గాల్లో టాక్ నడుస్తోంది. రిసెంట్ గా కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ్ సీఎం జగన్ ను కలిశారని తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఎన్నికల్లో తిరుపతి అసెంబ్లీ స్థానాన్ని గెలవాలని సీఎం జగన్ వారికి దిశ నిర్దేశం చేశారని సమాచారం.

New Update
Tirupati: హిందూ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతి వైసీపీ అభ్యర్థి ఇతనే..!

Tirupati: ఏపీలో కీలక నియోజకవర్గాల్లో తిరుపతి అసెంబ్లీ స్థానం ఒకటి. హిందూ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమల నియోజకవర్గ పరిధిలోకి రావడమే అందుకు కారణం. ఇక్కడ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించడం అంటే సాక్షాత్ వేంకటేశ్వరస్వామి సేవకు నియమితులైనట్లే. ప్రస్తుతం తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గానికి భూమన కరుణాకర్ రెడ్డి(Bhumana Karunakar Reddy) ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇటీవలే ఆయన టీటీడీ చైర్మన్ గా నియమితులయ్యారు. దీంతో ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరమవుతారని ప్రచారం జరుగుతోంది.

publive-image

అయితే వచ్చే ఎన్నికల్లో తిరుపతి నుంచి ఎవరు బరిలో దిగుతారు అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. చాలామంది ప్రయత్నాల్లో ఉన్నా.. కరుణాకర్ రెడ్డి వారసుడు భూమన అభినయ్ రెడ్డి(Abhinay Reddy) తిరుపతి రాజకీయాల్లో మరింతగా క్రియాశీలక పాత్ర పోషిస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం అభినయ్ తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ గా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో అభినయ్ కే టిక్కెట్ ఇవ్వనన్నట్లు సమాచారం. ఈ మేరకు సీఎం జగన్ సైతం ఆమోదముద్ర వేసినట్లు తెలుస్తోంది. రెండు రోజుల కిందటే కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ్ సీఎం జగన్(CM Jagan) ను కలిశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఎన్నికల్లో తిరుపతి అసెంబ్లీ స్థానాన్ని గెలవాలని సీఎం జగన్ వారికి దిశ నిర్దేశం చేశారు. తాజాగా నిన్నటికి నిన్న వైసిపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయి రెడ్డి తిరుపతిలో పర్యటించారు. ఆ పార్టీ తిరుపతి జిల్లా నియోజకవర్గాల వారీ నాయకులతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో తిరుపతి అభ్యర్థి అభినయ్ రెడ్డి అనీ అందరూ అతనికి తోడుగా నిలిచి భారీ మెజారిటీతో గెలిపించుకోవాలి అని ప్రకటించారు. దీంతో అభినయ్ అభ్యర్థిత్వం ఖరారు అయినట్లు వైసిపి వర్గాల్లో టాక్ నడుస్తోంది.

publive-image

తిరుపతిలో టీటీడీ ఉద్యోగుల ఓట్లు కీలకం. ప్రస్తుతం టీటీడీకి చైర్మన్ గా కరుణాకర్ రెడ్డి ఉన్నారు. గతంలో చైర్మన్ గా వ్యవహరించినప్పుడు టీటీడీ ఉద్యోగులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నారని మంచి పేరు ఉంది. గత ఎన్నికల్లో కరుణాకర్ రెడ్డి స్వల్ప మెజారిటీతో గెలవడానికి టిటిడి ఉద్యోగులే కారణం. అయితే అభినయ్ సైతం టీటీడీ వర్గాల్లో మంచి పట్టు సాధించారు. ప్రస్తుతం తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ గా ఉన్నారు. ఆ పదవితో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నారు. దీంతో ఆయనకు నియోజకవర్గంలో పట్టు దొరికింది. ఈ తరుణంలో అభినయ్ అయితే వచ్చే ఎన్నికల్లో గెలుపు సాధ్యమని జగన్ భావిస్తున్నారు. అందుకే వ్యూహాత్మకంగా అడుగు వేశారు. తండ్రికి టీటీడీ పీఠం కట్టబెట్టారు. కుమారుడి విజయానికి ఇది ఎంతగానో దోహదపడుతుందని భావిస్తున్నారు. సో తిరుపతి అసెంబ్లీ అభ్యర్థిగా భూమన అభినయ రెడ్డి ఖరారయ్యారన్న మాట.

Also Read: ఓవర్ టూ విశాఖ…పాలనకు ముహూర్తం ఫిక్స్

Advertisment
Advertisment
తాజా కథనాలు