Tirumala Srivari bus: తిరుమలలో రెచ్చిపోయిన దొంగలు..ఏకంగా శ్రీవారి బస్సునే ఎత్తుకెళ్లిన వైనం..!! తిరుమలలో భక్తుల ఉచిత బస్సు చోరీకి గురికావడంతో కలకలం రేగింది. ఏదయినా వస్తువు పోతేనే పెద్ద హడావిడి జరుగుతుంది. అలాంటిది ఏకంగా బస్సు మాయం కావడంతో టీటీడీ అధికారులు కంగారు పడ్డారు. అధునాతన టెక్నాలజీ ఉన్న జీపీఎస్ బస్సు కావడంతో దాని లొకేషన్ కనిపెట్టారు. ఆ బస్సుని ఎక్కడ స్వాధీనం చేసుకున్నారో చూద్దాం. By Vijaya Nimma 24 Sep 2023 in ఆంధ్రప్రదేశ్ తిరుపతి New Update షేర్ చేయండి టీటీడీ చెందిన ఓ ఎలక్ట్రిక్ బస్సుని చోరీ చేశారు. తిరుమలలోని టీటీడీ ట్రాన్స్‌ఫోర్ట్ కార్యాలయం నుంచి ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకు గుర్తుతెలియని వ్యక్తి బస్సును చోరీరి గురైంది. తిరుమల నుంచి తిరుపతికి .. అక్కడి నుంచి నెల్లూరు వైపునకు బస్సును తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఆదివారం ఉదయం గ్యారేజీలో బస్సు లేకపోవడాన్ని అధికారులు గుర్తించారు. వెంటనే తిరుమల క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో జీపీఎస్ సిస్టమ్ ద్వారా బస్సును.. నాయుడుపేట, గూడూరు మధ్యలో ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. బస్సుని స్వాధీనం అయితే.. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో ఓ ఆర్టీసీ బస్సు చోరీకి గురైంది. ప్రయాణికులతో ఉన్న బస్సుని తీసుకెళ్లి ఓచోట వదిలిపెట్టి ఆగంతకుడు పరారయ్యాడు. చివరకు ప్యాసింజర్లు తేరుకుని అధికారులకు ఫోన్ చేయగా.. అసలు డ్రైవర్‌ని పిలిపించారు. అయితే ఇప్పుడు తిరుమలలో బస్సు మాయం కావడంతో అధికారులు కలవర పడుతున్నారు. తిరుమల కొండపై భక్తుల సేవకు వినియోగించే ఈ ఉచిత బస్సులను శ్రీవారి ధర్మ రథాలుగా పిలుస్తారు. బస్సులు కొండపై ఇలాంటివి మొత్తం10 ఎలక్ట్రిక్ ఉన్నాయి. ఒక్కో బస్సు ఖరీదు రూ.2 కోట్లు ఉంది. అయితే కొండపై ఎక్కువగా భక్తుల కోసం వీటిని వినియోగిస్తున్నారు. తిరుమలలోని టీటీడీ ట్రాన్స్ పోర్ట్ కార్యాలయం నుంచి గుర్తు తెలియని వ్యక్తి ఈ ధర్మరథాన్ని చోరీ చేశాడు. అయితే ఈ బస్సును చివరకు నాయుడుపేట సమీపంలోని బిరదవాడ దగ్గర ఆ బస్సుని స్వాధీనం చేసుకున్నారు. ఇది కూడా చదవండి: తిరుమలలో గరుడ వాహన సేవ.. భక్తుల కోసం టీటీడీ భారీ ఏర్పాట్లు Your browser does not support the video tag. భక్తుల సౌకర్యార్థం ఇక..తిరుమల భక్తుల సౌకర్యార్థం 10 అత్యాధునిక ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. మేఘా ఇంజినీరింగ్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ స్వామివారి సేవ కోసం 10 ఎలక్ట్రిక్ బస్సులను ఉచితంగా ఇచ్చింది. ఎంఈఐఎల్ గ్రూప్ అనుబంధ కంపెనీ ‘ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ లిమిటెడ్’ ఈ బస్సులను హైదరాబాద్ సమీపంలోని తన ప్లాంట్‌లో తయారు చేశారు. టీటీడీ మార్గదర్శకాలకు అనుగుణంగా రూపొందించిన తొలి బస్సును ఈ ఏడాది మార్చి దేవస్థాన రవాణా విభాగం జనరల్ మేనేజర్ పీవీ శేషారెడ్డి సమగ్రంగా పరిశీలించారు. సిబ్బందితో కలిసి బస్సులో కొద్ది దూరం ప్రయాణించిన ఆయన పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఇలా తిరుమలలో వరసగా జరుగుతున్న పరిస్థితులపై టీటీడీ అధికారులకు ప్రతిది పెద్ద టాస్క్‌గానే ఉంది. Your browser does not support the video tag. #tirumala #angry-thieves #srivari-bus #free-bus-in-tirumala మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి