తిరుచానూరులో కార్తీక మాస బ్రహ్మోత్సవాలు.. ఏ రోజు ఏ కార్యక్రమం ఉందంటే.. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరగనున్నాయి. రేపటి నుండి ఈనెల 18వ తేదీ వరకు జరిగే ఈ కార్యక్రమాలను అధికారులు వైభవంగా నిర్వహించేందుకు అన్నీ ఏర్పాటను సిద్ధం చేశారు. By Jyoshna Sappogula 09 Nov 2023 in ఆంధ్రప్రదేశ్ తిరుపతి New Update షేర్ చేయండి Tiruchanur Brahmotsavams: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను కన్నులు పండుగగా నిర్వహించేందుకు అధికారులు అన్నీ ఏర్పాట్లను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో రేపటి నుండి ఈనెల 18వ తేదీ వరకు జరుగనున్న వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలకు నవంబరు 9వ తేదీ గురువారం అంకురార్పణ జరుగనుంది. ఈ సందర్భంగా ఉదయం 8 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు లక్షకుంకుమార్చన నిర్వహిస్తారు. సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల వరకు పుణ్యాహవచనం, రక్షాబంధనం, సేనాధిపతి ఉత్సవం, యాగశాలలో అంకురార్పణ కార్యక్రమాలు చేపడతారు. Also Read: ఐటీ కంపెనీలు మారుతున్నారా.. హైక్‌లు ఇంతే.. ఆలయంలో నవంబరు 10న ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు ధ్వజస్థంభ తిరుమంజనం, అలంకారం, ఉదయం 9.10 నుండి 9.30 గంటల మధ్య ధనుర్ లగ్నంలో ధ్వజారోహణంతో అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం 8 నుండి 10 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి. వాహనసేవల వివరాలు : 10-11-2023 – ధ్వజారోహణం, చిన్నశేషవాహనం. 11-11-2023 – పెద్దశేషవాహనం, హంసవాహనం. 12-11-2023 – ముత్యపుపందిరి వాహనం, సింహవాహనం. 13-11-2023- కల్పవృక్ష వాహనం, హనుమంతవాహనం. 14-11-2023 – పల్లకీ ఉత్సవం, వసంతోత్సవం, గజవాహనం. 15-11-2023- సర్వభూపాల వాహనం, స్వర్ణరథం, గరుడవాహనం. 16-11-2023- సూర్యప్రభ వాహనం, చంద్రప్రభ వాహనం. 17-11-2023 – రథోత్సవం, అశ్వ వాహనం. 18-11-2023- పంచమితీర్థం, ధ్వజావరోహణం. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల కోసం భక్తులు ఎంతగానో ఎదురుచూస్తు ఉంటారు. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేసినట్లు తెలుస్తోంది. #tirupati #tiruchanur-brahmotsavam మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి