Coconut Water: కొబ్బరి బోండాం కొనేటప్పుడు ఈ టిప్స్ పాటిస్తే.. మీ డబ్బులకు న్యాయం జరిగినట్లే..! వేసవిలో కొబ్బరి బోండాల డిమాండ్ విపరీతంగా ఉంటుంది. అయితే వీటిని కొనేటప్పుడు ఎక్కువ నీళ్లు, తక్కువ నీళ్లు ఉన్న కాయలను గుర్తించడానికి ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి. కాయను షేక్ చేసినప్పుడు శబ్దం వస్తే తక్కువ నీళ్లు ఉన్నట్లు సూచన. మరిన్ని టిప్స్ కోసం ఆర్టికల్ లోకి వెళ్ళండి. By Archana 02 Apr 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Coconut Water: బయట ఎండలు దంచేస్తున్నాయి, ఈ ఎండాకాలంలో బయటకి వెళ్తే చాలు ఆ ఎండను తట్టుకోలేక బాడీ ఎనర్జీ లెవెల్స్ అన్ని తగ్గిపోతాయి.. అలా అనిపించినప్పుడు ఏదైనా చల్లని కూల్ డ్రింక్స్ తాగితే బాగుండుని అనిపిస్తుంది. అలాంటి సమయంలో అందరికీ ముందుగా గుర్తొచ్చేది కొబ్బరిబొండా. ఎండాకాలంలో కొబ్బరినీళ్లు తాగితే డీహైడ్రేషన్ తగ్గడం మాత్రమే కాదు ఇమ్యూనిటీ పవర్, జీవక్రియను కూడా మెరుగుపరుస్తుంది. తక్షణ శక్తిని అందిస్తుంది. అయితే చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. ఎక్కువ నీళ్లు, తక్కువ నీళ్లు ఉన్న కొబ్బరి బొండాను ఎలా గుర్తుపట్టాలి అని. ఇక వేసవిలో కొబ్బరి బొండాల డిమాండ్ కూడా మామూలుగా ఉండదు. మరి అంత డబ్బు పెట్టి కొంటున్నప్పుడు మంచిది, ఎక్కువ నీళ్లున్న బొండానే కావాలని కోరుకుంటారు అందరు. అయితే ఎక్కువ నీళ్లు ఉన్న కొబ్బరి బోండాన్ని ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాము.. శబ్దం వస్తే కొనకండి కొబ్బరి బోండాం కొనే ముందు బాగా షేక్ చేయాలి. ఇలా షేక్ చేసినప్పుడు లోపల నీళ్లు కదిలిన శబ్దం వస్తే దానిని కొనకూడదు. ఎందుకంటే అందులో తక్కువ నీరు ఉన్నాయని సూచన. అలాగే కొబ్బరి బోండంను ఊపినప్పుడు ఎలాంటి సౌండ్ రాకపోతే.. వాటిలో నీళ్లు ఎక్కువగా ఉన్నట్లు అర్థం అని నిపుణులు చెబుతున్నారు. రంగుతో గుర్తించవచ్చు కొబ్బరి బోండాన్ని దానిమీద రంగుతో కూడా గుర్తించొచ్చు. మనం కొబ్బరిబోండాలను కొనేటప్పుడు వాటిపై ముదురు గోధుమ రంగు మచ్చలు కనిపిస్తే.. ఆ రంగు ఉన్న కొబ్బరి బొండం తీసుకోవడం మానేయండి. అందులో నీరు తక్కువగా ఉంటాయి. పూర్తిగా ఆకుపచ్చ రంగులో ఫ్రెష్‌గా ఉన్నదాన్ని కొబ్బరి బొండాం తీసుకోవడం సరైన ఎంపిక . వాటిలో నీటి శాతం కూడా ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇక నుంచి కొబ్బరి బోండా కొనేటప్పుడు ఈ టిప్స్ ఫాలో అవ్వడం మర్చిపోకండి. గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. Also Read: Summer Tips: వేసవిలో ఈ ఆహారాలు తిన్నారో.. మీ పని అంతే జాగ్రత్త..! #coconut #summer-tips మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి