హైఓల్టేజ్ తో టైగర్ నాగేశ్వరరావు ట్రైలర్‌..

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ నటించిన చిత్రం 'టైగర్ నాగేశ్వరరావు'. ఈ చిత్రం నుంచి పవర్ ఫుల్ ట్రైలర్ ను చిత్రబృందం విడుదల చేసింది. "పోలీసులకు విజ్ఞప్తి... ఇవాళ కాకినాడ నుంచి మద్రాసు వెళ్లే సర్కారు ఎక్స్ ప్రెస్ దోపిడీకి గురికాబోతోంది" అంటూ పోలీసులకు ఫోన్ చేసే సీన్ తో ట్రైలర్ లో రవితేజ ఎంట్రీ ఇస్తాడు.

New Update
హైఓల్టేజ్ తో టైగర్ నాగేశ్వరరావు ట్రైలర్‌..

Mass maharaja Ravi Teja టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ నటించిన చిత్రం 'టైగర్ నాగేశ్వరరావు'. ఈ చిత్రం నుంచి పవర్ ఫుల్ ట్రైలర్ ను చిత్రబృందం విడుదల చేసింది. "పోలీసులకు విజ్ఞప్తి.. ఇవాళ కాకినాడ నుంచి మద్రాసు వెళ్లే సర్కారు ఎక్స్ ప్రెస్ దోపిడీకి గురికాబోతోంది" అంటూ పోలీసులకు ఫోన్ చేసే సీన్ తో ట్రైలర్ లో రవితేజ ఎంట్రీ ఇస్తాడు. రవితేజ స్టామినాకు తగ్గట్టే టైగర్ నాగేశ్వరరావు చిత్రంలోని సీన్లు హైఓల్టేజ్ తో ఉన్నాయని ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు.

అభిషేక్ అగర్వాల్ నిర్మాతగా వంశీ దర్వకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం అక్టోబరు 20న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లోనూ ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఇందులో నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్, నాజర్, రేణూ దేశాయ్ తదితరులు నటిస్తున్నారు.

టైగర్ నాగేశ్వరరావు.. భారతదేశంలోనే అతి పెద్ద దొంగ అని ఈ చిత్రానికి క్యాప్షన్ ఇచ్చారు. 70వ దశకంలో స్టూవర్ట్ పురం (ఇప్పుడు బాపట్ల జిల్లాలో ఉంది) ఏరియాకు చెందిన టైగర్ నాగేశ్వరరావు పేరుమోసిన గజదొంగగా, పలు రాష్ట్రాల పోలీసులకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా కనిపిస్తాడు. చివరకు నాటకీయ పరిణామాల మధ్య పోలీసుల కాల్పుల్లో మరణించిన టైగర్ నాగేశ్వరరావు జీవితంలో పలు ఆసక్తికర ఘట్టాలు ఉన్నాయి. నాగేశ్వరరావు 'టైగర్ నాగేశ్వరరావు'గా మారడం వెనుక ఉన్న బలమైన అంశాలను ఈ చిత్రంలో చూపిస్తున్నట్టు తెలుస్తోంది.

Also Read : ‘గుంటూరు కారం’ సినిమాలో పూజాహెగ్డేని అందుకే తీసేశాం: నాగవంశీ

Advertisment
Advertisment
తాజా కథనాలు