AP: రాజమండ్రిలో పులి కలకలం..!

రాజమండ్రి నగర శివారులో పులి కలకలం రేపింది. పులి సంచరిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు పులి జాడ కనుక్కొనేందుకు ప్రత్యేక టీమ్‌లు ఏర్పాటు చేశారు. స్థానికంగా ప్రజలను కూడా అప్రమత్తం చేశారు.

New Update
AP: రాజమండ్రిలో పులి కలకలం..!

Rajahmundry : తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి నగర శివారులో పులి కలకలం సృష్టించింది. పులి సంచరిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు పులి జాడ కనుక్కొనేందుకు ప్రత్యేక టీమ్‌లు ఏర్పాటు చేశారు. స్థానికంగా ప్రజలను కూడా అప్రమత్తం చేశారు. గతంలో కూడా రాజమండ్రి నగర శివారు ప్రాంతంలో పులి సంచరించినట్లు తెలుస్తోంది. దీంతో నగర వాసులు భయాందోళనకు గురవుతున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Sharmila fires on YCP :  ప్రజలు చెప్పుతో కొట్టినా పద్ధతి మారలేదు.. వైసీపీపై షర్మిల సంచలన వ్యాఖ్యలు!

ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌షర్మిల మరోసారి వైసీపీపై ఫైర్‌ అయ్యారు. ప్రజలు చెప్పుతో కొట్టినట్లు తీర్పు ఇచ్చినా ఇంకా బుద్ది మారలేదంటూ గాటు వ్యాఖ్యలు చేశారు. వైసీపీకి ఆ పార్టీని మోసే సంస్థలకు ఇంకా పచ్చకామెర్ల రోగం తగ్గినట్లు లేదన్నారు.

New Update
 YS Sharmila fire on ycp

YS Sharmila fire on ycp

Sharmila fires on YCP : ఆంధ్రప్రదేశ్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల మరోసారి వైసీపీపై ఫైర్‌ అయ్యారు. ప్రజలు చెప్పుతో కొట్టినట్లు తీర్పు ఇచ్చినా ఇంకా బుద్ది మారలేదంటూ గాటు వ్యాఖ్యలు చేశారు. వైసీపీకి ఆ పార్టీని మోసే సంస్థలకు ఇంకా పచ్చ కామెర్ల రోగం తగ్గినట్లు లేదు. కళ్ళకు కమ్మిన పసుపు బైర్లు తొలగినట్లు లేదు. ఇప్పటికీ అద్దంలో మొహం చూసుకున్నా చంద్రబాబు కనిపించడం చాలా బాధాకరం అంటూ షర్మిల ఎద్దేవా చేశారు.ఏది చేసినా అర్థం, పరమార్థం టీడీపీ అనడం వారి వెర్రితనానికి నిదర్శనం. స్వయంశక్తితో ఎదుగుతుంటే, రాష్ట్రంలో కాంగ్రెస్ పుంజుకుంటుంటే, ప్రత్యామ్నాయ పార్టీగా ప్రజల్లో ముద్ర వేసుకుంటుంటే, చూసి ఓర్వలేక, అసత్యపు ఆరోపణలతో నిందలు వేయడం మీ చేతకానితనానికి నిదర్శనం అంటూ మండి పడ్డారు. మిమ్మల్ని 11 సీట్లకే పరిమితం చేసి ప్రజలు చెప్పుతో కొట్టినట్లు తీర్పునిచ్చినా.. మీ నీచపు చేష్టలు మారలేదు. అసత్యాలు వల్లె వేయడం మానుకోలేదు అంటూ ఆరోపించారు. నిజాలు జీర్ణించుకోలేని మీరు..ఇక ఈ జన్మకు మారరు అని రాష్ట్ర ప్రజలకు మరోసారి అర్థం అయ్యిందంటూ చివాట్లు పెట్టారు.

ఇది కూడా చదవండి: Raghunandan: మీనాక్షి నటరాజన్, రేవంత్ కు మధ్య వార్.. ఎంపీ రఘునందన్ సంచలన ఇంటర్వ్యూ!

ఇంతకాలం ఎవరి సేవలో ఎవరు తరించారో అందరికీ తెలుసు. ఎవరికి ఎవరు దత్తపుత్రుడుగా ఉన్నారో తెలుసని షర్మిల గాటుగానే స్పందిచారు. తండ్రి ఆశయాలకు తూట్లు పొడిచి, రాష్ట్ర ప్రయోజనాలను మోడీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి.. స్వలాభమే పరమావధిగా రాష్ట్రాన్ని దోచుకుతిన్నారని షర్మిల ఆరోపించారు. ప్యాలెస్ లు కట్టుకున్నారు. సొంత ఖజానాలు నింపుకున్నారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని తెచ్చి ప్రజల ఆస్తులు కాజేయాలని చూశారని ఆరోపించారు. రిషికొండను కబ్జా చేయాలని చూశారు. మొత్తంగా మోడీ దోస్తులకు రాష్ట్రాన్ని దోచి పెట్టారన్నారు. కులమతాల మధ్య చిచ్చు పెట్టే ప్రతి అంశంలో మోడీకి మద్దతుగా నిలిచి 5 ఏళ్ల పాటు మోదా సేవలో తరించినట్లు ప్రజలకు సర్వం బోధపడిందని తేల్చి చెప్పారు.

ఇది కూడా చదవండి: ఎమ్మెల్సీగా అద్దంకి ప్రమాణ స్వీకారం.. ఆత్మీయంగా అలింగనం చేసుకున్న కోమటిరెడ్డి.. ఫొటోలు వైరల్

ఎవరో ఒకరి సేవలో తరించాల్సిన ఖర్మ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ వైఎస్ షర్మిలా రెడ్డికి పట్టలేదంటూ చెప్పుకొచ్చారు. పులి బిడ్డ  పులిబిడ్డే. ఈ రాష్ట్రంలో BJP అంటే బాబు, జగన్, పవన్.. అన్ని పార్టీలు బీజేపీకి గులాంగిరి చేసేవే.. ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రతిపక్షంగా ఒంటరి పోరాటం చేస్తుందని తేల్చి చెప్పారు. ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే అసెంబ్లీకి పోవడానికి మీకు దమ్ములేకుంటే.. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యాలను బయట ఉండి ఎత్తిచూపుతూ.. ప్రజా సమస్యల మీద గొంతెత్తి పోరాడుతున్నది ఈ రాష్ట్రంలో ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమేనన్నారు. వక్ఫ్ బిల్లుకి మద్దతు పలికి ముస్లింలకు ఇఫ్తార్ విందులో బాబు విషం పెట్టారని చేసిన మా ఆరోపణలు వినపడకపోవడం మీరు చెవిటోళ్లు అనడానికి... పోలవరం ప్రాజెక్ట్ విషయంలో  మా ఆవేదన కనపడకపోవడం మీరు గుడ్డోళ్ళు అనడానికి నిదర్శనమంటూ ఏద్దేవా చేశారు.  మీకు ప్రజల శ్రేయస్సే ముఖ్యం అనుకుంటే అసెంబ్లీకి వెళ్ళి పోలవరం మీద ఎందుకు ప్రశ్నించలేదు ? అసెంబ్లీ వేదికగా సూపర్ సిక్స్ మోసాలను ఎందుకు ఎండగట్టలేదు ? మీ నీచపు కుయుక్తులతో, పాపపు సొమ్మును ఎరగా చూపి కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేయాలనే కుట్ర తప్పా ప్రజా సమస్యలపై మీకు ఏమాత్రం శ్రద్ధ లేదు. కాంగ్రెస్ ఎదగడం చూసి మీరు భయపడుతున్నారు అనేది పచ్చి నిజం అంటూ షర్మిల ఆరోపించారు.

ఇది కూడా చదవండి: Dia Mirza: HCU వివాదంపై రేవంత్ రెడ్డికి హీరోయిన్ కౌంటర్! అవి AI కాదు రియల్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు