Telangana Election: ఈత కొట్టినంత సులభంగా గెలవబోతున్నాం..తుమ్మల సంచలన వ్యాఖ్యలు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈత కొట్టినంత సులభంగా గెలవబోతున్నామని, పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో కొందరు స్వార్థపరులు దోచుకుంటుంటే చూస్తూ ఉండలేకపోతున్నానని వ్యాఖ్యానించారు. By Vijaya Nimma 22 Oct 2023 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి స్మిమ్మర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో తుమ్మల పాల్గొన్నారు. అంతేకాకుండా మున్నేరులో ఈత కొడుతున్నవారితో సరదాగా గడిపారు. కాంగ్రెస్ వస్తేనే ప్రజాస్వామ్య తెలంగాణ సాధ్యం అంటూ అక్కడున్న స్విమ్మర్స్ నినాదాలు చేశారు. ఖమ్మంలోని అసోసియేషన్ల ప్రతినిధులతో పాటు ప్రముఖులంతా తుమ్మలకు మద్దతు ఇస్తున్నారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ నేతలపై విరుచుకుపడ్డారు. రాష్ట్రం నుంచి అరాచకశక్తులను తరిమికొట్టాలని, అదే ధ్వేయంతో కాంగ్రెస్‌లోకి వచ్చానని చెప్పారు. రాహుల్‌గాంధీ పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేస్తే ఒక్క సూటుకేసుతో బయటికి వచ్చారని, అది చూసి చలించిపోయానని తుమ్మల అన్నారు. Your browser does not support the video tag. రెండుసార్లు ప్రధాని పదవి వచ్చినా.. తీసుకోని మహానాయకుడు రాహుల్ అని అన్నారు. భారత్ జోడో యాత్ర ద్వారా కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు మన కోసం ఆయన నడిచారని, దేశాన్ని ఏకం చేశారని చెప్పారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది స్థానాల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అరాచకశక్తులను తరిమికొట్టి అభివృద్ధి రాజకీయాలకు బాటలువేయాలని సూచించారు. అంతేకాకుండా ఆదర్శవంతమైన కమ్యూనిస్టు నేతలు రజబ్ అలీ, బోడేపూడి, మంచికంటితో కలిసి పనిచేసిన అనుభవం తనకు ఉందని తుమ్మల అన్నారు. Your browser does not support the video tag. ఐదేళ్లుగా ప్రజావ్యతిరేక పాలనతో జనం విసిగిపోయారని, వచ్చే నవంబర్ 30న ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇస్తారని చెప్పారు. భారతదేశం కోసం సోనియాగాంధీ కుటుంబం త్యాగాలు చేయడం వల్లే తెలంగాణ కల సాకారమైందని తుమ్మల చెప్పారు. తనకు దేవుడు NTR అని, చిన్న తనంలోనే రాజకీయ భవిష్యత్‌ని ఇచ్చారని చెప్పారు. రహదారులు, నీటి పారుదల రంగాన్ని ఎంతో అభివృద్ధి చేశామని అన్నారు. ఆత్మీయ సమ్మేళనంలో స్విమ్మర్స్‌ని అభినందించిన తుమ్మల నాగేశ్వరరావు.. ఈత కొట్టి ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. Your browser does not support the video tag. ఇది కూడా చదవండి: ఇంద్రకీలాద్రిపై దుర్గాదేవి అలంకారంలో అమ్మవారు..పోటెత్తిన భక్తజనం #telangana-election-2023 #thummala-nageswara-rao #khammam-district #atmiya-sammelanam మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి