Thummala Nageshwar Rao: రైతులకు గుడ్ న్యూస్.. ఎకరాకు రూ.10,000! తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేల ఆర్థిక సాయాన్ని అందిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. By V.J Reddy 20 Mar 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Minister Thummala Nageshwar Rao: తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేల ఆర్థిక సాయాన్ని అందిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. అకాల వర్షాల వల్ల ఏర్పడిన పంట నష్టాన్ని అధికారులు అంచనా వేసిన తర్వాత నష్టపరిహారాన్ని అందిస్తామని అన్నారు. గత కొన్ని రోజులుగా తెలంగాణలోని పలు జిల్లాలలో రాళ్ల వర్షాలు కురవడంతో పంట నీట మునిగింది. అకాల వర్షాల వల్ల ఏర్పడిన పంట నష్టాన్ని అధికారులు అంచనా వేసిన తర్వాత... రైతులకు పంట నష్టం కింద ఎకరాకు 10 వేలు (10000/-) -- వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల Farmers will receive Rs10,000 per acre as compensation for crop damages caused by unseasonal rains, following a thorough… pic.twitter.com/njRwrcFhfm — Congress for Telangana (@Congress4TS) March 20, 2024 రైతు బంధుపై.. తెలంగాణలో రైతులకు రైతు బంధు సాయాన్ని అందిస్తున్నామని అన్నారు. ఇప్పటి వరకు మూడు ఎకరాల్లోపు భూమి ఉన్న రైతుల ఖాతాల్లోకి డబ్బు జమ చేశామని తెలిపారు. రైతు బంధు నిరంతర ప్రక్రియ అని.. మార్చి నెలాఖరు అందరి ఖాతాల్లో డబ్బు జమ చేయనున్నట్లు పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో రైతు బంధు నిధులు మే వరకు రైతుల ఖాతాలో జమ చేసిందని గుర్తు చేశారు. వచ్చే పంట సీజన్ నుంచి రైతుల ఖాతాలో రైతు భరోసా నగదును జమ చేస్తామని అన్నారు. ఎన్నికల సమయంలో రైతు భరోసా కింద రైతులకు ఎకరాకు ఏడాదికి రూ.15,000 ఆర్థిక సాయాన్ని అందిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. రుణమాఫీపై.. తెలంగాణ రైతులకు త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది అని చెప్పారు మంత్రి తుమ్మల. రైతు రుణమాఫీపై తమ ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది అని పేర్కొన్నారు. ఏకకాలంలో రైతులను రుణమాఫీ చేసి వారి ఆర్థిక భారాన్ని తగ్గిస్తామని అన్నారు. ఎన్నికల సమయంలో రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన విషయం తెలిసిందే. #cm-revanth-reddy #thummala-nageshwar-rao మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి