భూముల అమ్మకాలతో కేసీఆర్ సర్కార్ ఖజానాకు వేల కోట్లు..రికార్డు స్థాయిలో అమ్మకాలు..త్వరలోనే మోకిలలో వేలం పాట! తెలంగాణ సర్కార్ ఖజానా ప్రస్తుతం భూముల వేలం పాటతో నిండుతోంది. అనూహ్యంగా కనివినీ ఎరుగని రీతిలో వేల కోట్లు హెచ్ఎండీఏ ఈ వేలం పాట ద్వారా సర్కార్ చేతుల్లో పడుతోంది. మరో వైపు భూముల వేలం పాట హైదరాబాద్ లో భూమికున్న విలువను బహిర్గతం చేస్తోంది. ఈ క్రమంలో కోకాపేట్ లో ఎకరం ఏకంగా 100 కోట్లు పైనే పలికి అందన్ని ఆశ్చర్యపోయేలా చేసింది. కోకాపేట్, బుద్వేల్ తో వేల కోట్లు రాబట్టిన సర్కార్ నెక్ట్స్ టార్గెట్ ఇక మోకిలనే..! By P. Sonika Chandra 11 Aug 2023 in తెలంగాణ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి తెలంగాణ సర్కార్ ఖజానా ప్రస్తుతం భూముల వేలం పాటతో నిండుతోంది. అనూహ్యంగా కనివినీ ఎరుగని రీతిలో వేల కోట్లు హెచ్ఎండీఏ ఈ వేలం పాట ద్వారా సర్కార్ చేతుల్లో పడుతోంది. మరో వైపు భూముల వేలం పాట హైదరాబాద్ లో భూమికున్న విలువను బహిర్గతం చేస్తోంది. ఈ క్రమంలో కోకాపేట్ లో ఎకరం ఏకంగా 100 కోట్లు పైనే పలికి అందన్ని ఆశ్చర్యపోయేలా చేసింది. ఇక కోకాపేట్ భూముల వేలంపాటతో జోరులో ఉన్న కేసీఆర్ సర్కార్ వెంటనే బుద్వేల్ భూములను అమ్మకానికి పెట్టడంతో అక్కడ కూడా కనకవర్షమే కురుస్తోంది. కోకాపేట్, బుద్వేల్ తో వేల కోట్లు రాబట్టిన సర్కార్ నెక్ట్స్ టార్గెట్ ఇక మోకిల. త్వరలోనే మోకిల దగ్గర మరో లే అవుట్.. నగర పరిసర ప్రాంతాల్లోని ప్రభుత్వ భూములు కాసుల వర్షాన్ని కురిపిస్తున్నాయి. హెచ్ఎండీఏ సంస్థ రూపొందించిన లే అవుట్ లు కావడం భూములు క్లియర్ టైటిల్ ఉండడంతో చాలా మంది వాటిని కొనడానికి ముందుకు వస్తున్నారు. ప్రభుత్వం కూడా వివిధ ప్రాజెక్టులు చేపట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్న క్రమంలో ప్రభుత్వం అందుకు అవసరమైన నిధులను ప్రభుత్వ భూములను అమ్మి ఏర్పాటు చేసుకుంటోంది. ఈక్రమంలోనే నగర శివారులో ఉన్న మోకిలా దగ్గరున్న 165.37 ఎకరాల్లో లేఅవుట్ ప్లాన్ చేస్తోంది హెచ్ ఎండీఏ. ఇందులో మొత్తం 1321 ప్లాట్లకు గాను మొదటి దశలో 50 ప్లాట్ లను వేలానికి పెట్టింది. ఈ లే అవుట్ మొత్తం రెసిడెన్షియల్ కోసం కేటాయించారు అధికారులు. ఇందులో ఒక ప్లాట్ 300 నుంచి 500 గజాల వరకు ఏర్పాటు చేశారు. గజానికి 25 వేల రూపాయలు అప్సెట్ ప్రైస్ గా నిర్ణయించడం జరిగింది. మొత్తం 50 ప్లాట్లలో 15800 గజాలను అమ్మకానికి పెట్టిన హెచ్ఎండీఏ 40 కోట్ల ఆదాయం రాబట్టనుంది. హాట్ కేకుల్లా బుద్వేల్ భూములు.. 182 ఎకరాల ప్రభుత్వ భూమిలో..100 ఎకరాల్లో హెచ్ఎండీఏ ఈ వేలానికి సిద్ధం చేసింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం బుద్వేల్ లో బహుళ ప్రయోజన నిర్మాణాలకు అనుగుణంగా..మౌలిక వసతులతో అభివృద్ధి చేసింది. పెద్ద సైజ్ లో మొత్తం 14 ప్లాట్లను అమ్మకానికి పెట్టింది. ఒక్కో ప్లాట్లలో 3.47 ఎకరాల విస్తీర్ణం నుంచి 14.33 ఎకరాల విస్తీర్ణం వరకు ఉన్నాయి. ఇక ఎకరాకు ప్రభుత్వం 20 కోట్ల రూపాయల కనీస ధరను నిర్ణయించింది. ఔటర్ రింగు రోడ్డుకు ఆనుకొని ఉండడం, శంషాబాద్ విమానాశ్రయానికి దగ్గర్లో ఉండడంతో కొనుగోలుదారులు పోటీ పడుతున్నారు. తొలి సెషన్ లో బుద్వేల్ భూముల వేలంలో 58.19 ఎకరాలకు మొత్తం ఆదాయం 2061 కోట్లు వచ్చింది. అత్యధికంగా plot no. 4 ధర పలికింది. ఎకరాకు 39.25కోట్లు వచ్చాయి. అత్యల్పంగా..ఎకరా ధర..33.25 కోట్లు పలికింది. అయితే తొలిసెషన్ లో 1,2,4,5,8,9,10 ప్లాట్లకు వేలం పాట వేశారు. దీంతో ఫస్ట్ సెషన్ ఈ వేలం ముగిసింది. అయితే ఈ వేలం ద్వారా 3 నుంచి 4 వేల కోట్ల వరకు ఆదాయం సమకూర్చుకోవాలని తెలంగాణ సర్కార్ భావించింది. ప్రభుత్వ అంచనాలు.. ఇటీవల కోకాపేట్ నియోపోలీస్ లో రెండో దశ అమ్మకం పూర్తి చేసిన ప్రభుత్వం బుద్వేల్ లోని వంద ఎకరాలను వేలం వేసింది. ఇక్కడ రెండు సెషన్స్ లో జరిగిన ఈ వేలంలో ప్రభుత్వానికి 3,625.73 కోట్ల ఆదాయం వచ్చింది. అంటే సగటున ఎకరం 36.25 కోట్లు పలికింది. అయితే కోకాపేటలో ఎకరం 70 నుంచి 80 కోట్లు పలికాయి. అదేవిధంగా బుద్వేల్ భూములు కూడా భారీ రేట్లు పెరుగుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. కనీసం ఎకరా కనీసం 50 నుంచి 60 కోట్ల వరకు పలకొచ్చని భావించింది. కానీ సగటున పలికింది 36 కోట్లే. అత్యధికంగా ఎకరా 41.75 కోట్లకు అమ్ముడు పోయింది. సగటున ఎకరం 50 నుంచి 55 కోట్లు పలికినా కాస్త అటూ ఇటుగా ఐదున్నర వేల కోట్ల వరకూ వస్తాయని ప్రభుత్వం భావించింది. కానీ ప్రభుత్వం అంచనా వేసిన దానికంటే రెండువేల కోట్లు తక్కువగా వచ్చాయి. అయితే పెద్ద పెద్ద బిల్డర్లు కోకాపేట్ లో భూములు కొనేశారు. దీంతో వెంటనే బుద్వేల్ పై ఫోకస్ పెట్టలేకపోయారని కొందరు చెబుతున్నారు. బుద్వేల్ భూములపై లంచ్ మోషన్ పిటిషన్.. బుద్వేల్ భూముల వేలాన్ని సవాల్ చేస్తూ న్యాయవాదుల సంఘం తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. భూముల వేలం పై స్టే ఇవ్వాలని కోర్టుని కోరింది. అయితే ఈ లంచ్ మోషన్ పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించింది. బార్ అసోసియేషన్ లో విభేదాలున్నాయని..అందరూ ఏకాభిప్రాయంతో వస్తే వాదనలు వింటామని స్పష్టం చేసింది. అయితే బుద్వేల్ లోని ప్రభుత్వ భూములు గతంలో హైకోర్టు కోసం కేటాయిస్తామని చెప్పడంతో బార్ అసోసియేషన్ కోర్టుకు వెళ్లింది. మరోవైపు హైకోర్టు నిర్మాణానికి బుద్వేల్ లో వంద ఎకరాలు కేటాయించాలని 2012 నుంచి కోరుతున్నామని బార్ అసోసియేషన్ తెలిపింది. ప్రభుత్వ భూముల వేలంపై భారీగా వ్యతిరేకత.. ప్రభుత్వ భూముల విక్రయాలపై రాజకీయంగా ఇంకా ప్రజా సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. ప్రభుత్వ భూముల అమ్మకానికి వ్యతిరేకంగా..బీజేపీ నిరసనకు దిగింది. రంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ భూములను ప్రభుత్వం విచ్చలవిడిగా అమ్ముకుంటుందని.. మున్ముందు ప్రజా అవసరాలకు కూడా భూములు లేకుండా పోతుందని బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. నార్సింగి, బండ్లగూడ, కోకాపేట్, రాజేంద్రనగర్ ప్రాంతాల్లోని విలువైన భూములను అమ్మేస్తుందని విమర్శించారు. రంగారెడ్డి జిల్లాను కేవలం ప్రభుత్వ ఖజానాకు ఆదాయవనరుగా చూస్తున్నారని వారు విమర్శించారు. ఇక ప్రొఫెసర్ కోదండరామ్ కూడా ప్రభుత్వ భూములకు వ్యతిరేకంగా గళాన్ని వినిపించారు. ఆయన బుద్వేల్ భూములను చూడ్డానికి వెళ్లారు. అయితే ఆయనతో పాటు ఇతర నేతలను కూడా పోలీసులు అడ్డుకున్నారు. భవిష్యత్తులో ప్రభుత్వ అవసరాలకు భూములు లేకుండా కేసీఆర్ సర్కార్ చేస్తుందన్నారు. ఈ దశలో ప్రభుత్వం భూముల విక్రయాలను ఆర్థిక కోణంలో కాకుండా అభివృద్ధి కోణంలో చూడాలని కోరుతోంది.ఇక వేలం పాట ద్వారా వచ్చే నిధులను ప్రజల మౌళిక సదుపాయాల కల్పన కోసం వెచ్చించాలని కొనుగోలుదారులు సైతం సూచిస్తున్నారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి